6, జులై 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 755 (పట్టు నాజానుబాహువే)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

కవిమిత్రుల పూరణలు
౧. కంది శంకరయ్య
    సాధుజన పరిత్రాణమై సదయుఁ డగుచు
    దుష్టజనవినాశము జేయు దురితహారి
    ధర్మసంస్థాపనకు నాయుధమునుఁ జేతఁ
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు!

*     *     *     *     * 
౨. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    రామచంద్రుండు దశరథరాజసుతుడు,
    భువనములనెల్ల దయతోడ బ్రోచుకొరకు
    సర్వసన్నద్ధుడైయుండి సతతము కను
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

*     *     *     *     * 
౩. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    గజ మొకటి వేడఁ బరుగిడి కష్టముఁ దొల
    గించిన హరి, భక్తులు విలపించి త్వర
    నార్తిఁ బిలువ, గావగవలె నంచు నుగ్గ
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.
*     *     *     *     *
౪. పండిత నేమాని
(1)

    నామ రూపాలు లేని చిన్మయుడె యయ్యు
    నమర కార్యార్థమై భువి నవతరించి
    నట్టి పరమాత్మయే యా నరాకృతి గను
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

(2)
    విశ్వమంగళ హేతువై వెలయునట్టి
    శుభ వివాహోత్సవమ్మున జొక్కు రాము
    జేరి సుమమాల వేసిన సీత కరము
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు

*     *     *     *     *
౫. మిస్సన్న
    భక్తులను బ్రోచు కోసమై వడిగ లేచి
    శంఖ చక్రముల్ చేబట్టి సరగున జని
    యూపిరుల నాపి దుష్టుల యుసురు దీయ
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.
*     *     *     *     *
౬. చంద్రమౌళి
    అర్థ కామాల కాధార మదియె కాగ
    మానవాళిని రక్షించు మోక్ష మంద
    ధరణిని సుఖశాంతులనిల్ప ధర్మపథము
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

*     *     *     *     *
౭. సుబ్బారావు
    అందరకు సేమమె ప్రభుత యాయువునకు
    పట్టు , నాజాను బాహువే ప్రభువు మాకు
    నీల మేఘపు దేహుండు సదయు డతడు
    శత్రు భీకరు డైనట్టి శార్ఙ్గి ధన్వి .
*     *     *     *     *
౮. లక్ష్మీదేవి
    నీలదేహుండు, రాముఁడు నీతిఁ దప్ప
    కుండ చరియించు చుండెడు గొప్పవాఁడు,
    తనదు వామహస్తమున కోదండమెపుడు
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.
*     *     *     *     *
౯. గుండు మధుసూదన్
(1)
    కమల పత్రాక్షుఁడు, శుభ లక్షణుఁడు, ధర్మ
    రక్షకుఁడు, నీల వర్ణుండు, రఘు కులుండు,
    పతిత పావనుం, డసురారి,బలునిగఁ గను
    పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు!
(2)
    అబలఁ జెఱ నిడిన దశకం
    ఠుఁ బిండి సేయుటకుఁ , దా ధనుర్బాణములన్
    సబలుఁడయి పట్టు, నాజా
    ను బాహువే ప్రభువు నాకు; నుతియించంగన్!
(3)
    మాయ సన్యాసియై భిక్ష వేయు మనియు,
    మోసమున సీతఁ జెఱపట్టు మూర్ఖుఁ డైన
    రావణుని వధించఁగ ధనుర్బాణములను
    పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు!

*     *     *     *     *
౧౦. కమనీయం
    దుష్ట శిక్షణ గావించి శిష్టరక్ష
    జేయ నవతారమూర్తియై చిన్మయుండు
    విష్ణుదేవుండు రూపాల వేరుగ గను
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

*     *     *     *     *
౧౧. గుండా సహదేవుడు
    ప్రజలు మెచ్చంగ రామన్న ప్రభుత నడిపె
    సహనశీలమ్ముతో సీత సతిగ నొప్పె
    ధర్మమార్గాన నడిపింప ధరణిజాతఁ
    బట్టు నాజానుబాహుడు ప్రభువు మాకు.
*     *     *     *     *
౧౨. సంపత్ కుమార్ శాస్త్రి
కురుక్షేత్రములో శ్రీకృష్ణుని గురించి.........
    ఆయుధముచేత బట్టనీ యాజియందు
    ననుచు నానతిజేసియు, నవనిలోన
    భక్తులను కాచు నెపమున శక్తిచేత
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.
*     *     *     *     *
౧౩. గోలి హనుమచ్ఛాస్త్రి
    వామ భాగము గూర్చుండ వసుధ పుత్రి
    వెనుక తమ్ముళ్ళు మువ్వురు వేడ్క నిలువ
    హనుమ పాదాల బట్టగ నలరుచు గను
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

25 కామెంట్‌లు:

  1. సాధుజన పరిత్రాణమై సదయుఁ డగుచు
    దుష్టజనవినాశము జేయు దురితహారి
    ధర్మసంస్థాపనకు నాయుధమునుఁ జేతఁ
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు!

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్ గారూ,
    గజేంద్రమోక్షాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో ప్రాసయతి దోషం. రెండు దోట్లా అనుస్వారయుక్తమైన వర్ణమే ఉండాలి. సవరించండి.
    నా సవరణ...
    ‘గజ మొకటి వేడఁగఁ బరుగిడి కష్టముఁ దొల
    గించిన హరి.....’

    రిప్లయితొలగించండి
  3. రామచంద్రుండు దశరథరాజసుతుడు,
    భువనములనెల్ల దయతోడ బ్రోచుకొరకు
    సర్వసన్నద్ధుడైయుండి సతతము కను
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

    రిప్లయితొలగించండి
  4. మస్తారూ, బాగు బాగు. సవరణతో:
    గజ మొకటి వేడఁ బరుగిడి కష్టముఁ దొల
    గించిన హరి, భక్తులు విలపించి త్వర
    నార్తిఁ బిలువ, గావగవలె నంచు నుగ్గ
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

    రిప్లయితొలగించండి
  5. నామ రూపాలు లేని చిన్మయుడె యయ్యు
    నమర కార్యార్థమై భువి నవతరించి
    నట్టి పరమాత్మయే యా నరాకృతి గను
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు

    రిప్లయితొలగించండి
  6. భక్తులను బ్రోచు కోసమై వడిగ లేచి
    శంఖ చక్రముల్ చేబట్టి సరగున జని
    యూపిరుల నాపి దుష్టుల యుసురు దీయ
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు

    రిప్లయితొలగించండి
  7. అర్థ కామాలకాధారమదియెకాగ
    మానవాళిని రక్షించు మోక్షమంద
    ధరణిని సుఖశాంతులనిల్ప ధర్మపథము
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు!

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. ప్రజల సేమమే కద నిల ప్రభుత కాయు
    పట్టు , నాజాను బాహువే ప్రభువు మాకు
    నీ ల మేఘపు దేహుడు చాల దయుడు
    శత్రు భీ క రు డైనట్టి శా ర్జ్న ధన్వి .

    రిప్లయితొలగించండి
  10. నీలదేహుండు, రాముఁడు నీతిఁ దప్ప
    కుండగ చరియించు చుండెడు గొప్పవాఁడు,
    తనదు వామహస్తమున కోదండమెపుడు
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పూరణ....

    కమల పత్రాక్షుఁడు, శుభ లక్షణుఁడు, ధర్మ
    రక్షకుఁడు, నీల వర్ణుండు, రఘు కులుండు,
    పతిత పావనుం, డసురారి,బలునిగఁ గను
    పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు!

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి పూరణలు.....
    కందము :
    అబలఁ జెఱ నిడిన దశకం
    ఠుఁ బిండి సేయుటకుఁ , దా ధనుర్బాణములన్
    సబలుఁడయి పట్టు, నాజా
    ను బాహువే ప్రభువు నాకు; నుతియించంగన్!

    తే. గీ.
    మాయ సన్యాసియై భిక్ష వేయు మనియు,
    మోసమున సీతఁ జెఱపట్టు మూర్ఖుఁ డైన
    రావణుని వధించఁగ ధనుర్బాణములను
    పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు!

    రిప్లయితొలగించండి
  13. సత్యనారాయణ మూర్తి గారూ,
    రాముణ్ణి దర్శిస్తూ చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    లీలామానుషవేషధారియైన భగవంతుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు,
    *
    మిస్సన్న గారూ,
    దుష్టసంహారానికి మునుకొనువాని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    ధర్మపథాన్ని బట్టిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఆయుపట్టు’ అనడం దోషమే. ‘శార్ఙ్గి’ అన్నచో టైపాటు. మీ పద్యానికి నా సవరణ....
    అందరకు సేమమె ప్రభుత యాయువునకు
    పట్టు , నాజాను బాహువే ప్రభువు మాకు
    నీల మేఘపు దేహుండు సదయు డతడు
    శత్రు భీకరు డైనట్టి శార్ఙ్గి ధన్వి .
    *
    లక్ష్మీదేవి గారూ,
    కొద్ది రోజులుగా మీ పూరణలు, పద్యాలు లేవు. ఏమయ్యారా అని కలవరపడ్డాను. పునర్దర్శనం సంతోషదాయకం!
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘కుండ చరియించు’ లేదా ‘కుండగ చరించు’ అంటే సరి!
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ముచ్చటైన మీ పూడు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా తేటగీతి పాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారు,
    అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి రావటంతో కొన్నిరోజులు ఈ సభానందాన్ని మిస్ అయ్యాను.
    ఈ రోజే తిరిగి వచ్చాను.
    ధన్యవాదాలు.
    మీ సవరణ బాగుంది. నిజమే, పొరబాటు పడ్డాను.

    నీలదేహుండు, రాముఁడు నీతిఁ దప్ప
    కుండ చరియించు చుండెడు గొప్పవాఁడు,
    తనదు వామహస్తమున కోదండమెపుడు
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

    రిప్లయితొలగించండి
  15. దుష్ట శిక్షణ గావించి శిష్టరక్ష
    జేయ నవతారమూర్తియై చిన్మయుండు
    విష్ణుదేవుండు రూపాల వేరుగ గను
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    "పరిత్రాణాయ సాధూనాం .... " అనే భగద్గీతా శ్లోక భావమును తెలుగు పద్యరూపములో వెలయించిన మీ పూరణ ప్రశస్తముగా నున్నది. మీదే ప్రథమ తాంబూలము కూడా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. విశ్వమంగళ హేతువై వెలయునట్టి
    శుభ వివాహోత్సవమ్మున జొక్కు రాము
    జేరి సుమమాల వేసిన సీత కరము
    బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు

    రిప్లయితొలగించండి
  18. కురుక్షేత్రములో శ్రీకృష్ణుని గురించి.........

    ఆయుధముచేత బట్టనీ యాజియందు
    ననుచు నానతిజేసియు, నవనిలోన
    భక్తులను కాచు నెపమున శక్తిచేత
    పట్టునాజాను బాహువే ప్రభువు మాకు.

    శక్తి = ఒక ఆయుధము...

    రిప్లయితొలగించండి
  19. వామ భాగము గూర్చుండ వసుధ పుత్రి
    వెనుక తమ్ముళ్ళు మువ్వురు వేడ్క నిలువ
    హనుమ పాదాల బట్టుచు నలరుచు గన
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

    రిప్లయితొలగించండి
  20. వామ భాగము గూర్చుండ వసుధ పుత్రి
    వెనుక తమ్ముళ్ళు మువ్వురు వేడ్క నిలువ
    హనుమ పాదాల బట్టగ నలరుచు గన
    పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.

    రిప్లయితొలగించండి
  21. గుండా సహదేవుడు గారి పూరణ....
    ప్రజలు మెచ్చంగ రామన్న ప్రభుత నడిపె
    సహనశీలమ్ముతో సీత సతిగ నొప్పె
    ధర్మమార్గాన నడిపింప ధరణిజాతఁ
    బట్టు నాజానుబాహుడు ప్రభువు మాకు.

    రిప్లయితొలగించండి
  22. కమనీయం గారూ,
    విరాడ్రూపుణ్ణి దర్శించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    సీతాకరగ్రహణం చేసిన రాముణ్ణి దర్శింప జేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    శక్తి(చక్ర) ధారిని గనినట్టి మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రామ పట్టాభిషేక దృశ్యాన్ని కళ్ళకు కట్టించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    సీతాకరగ్రహణం చేసిన రాముణ్ణి వర్ణించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. మూడు లోకము లేలుచు ముక్తి నిడగ
    కాచి రక్షించు భవుడన కరుణ తోను
    సృష్టి స్థితి లయ ములకు స్రష్ట యైకన్
    పట్టు నాజాను బాహువే ప్రభువు మాకు !

    రిప్లయితొలగించండి
  24. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    కాని మూడవ పాదంలో గణదోషం, అన్వయదోషం ఉన్నాయి. సవరించే ప్రయత్నం చేయండి.

    రిప్లయితొలగించండి