19, జులై 2012, గురువారం

సమస్యాపూరణం -767 (ముగిసె నాషాఢ మని)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

ముగిసె నాషాడ మని యేడ్చె ముద్దుగుమ్మ.

21 కామెంట్‌లు:

  1. తల్లి గారింట చేరిన తరుణి దల్చె
    కంతుడనుకొన్నపెనిమిటికాలుడనుచుఁ
    భర్త వచ్చెను గొనిపోవ పత్నినపుడె
    ముగిసెనాషాడమనియేడ్చెముద్దుగుమ్మ!

    రిప్లయితొలగించండి
  2. కన్నె చెరవీడె నొక చెలికాడు దొరకె
    జ్యేష్థ మాసాన రోజులు చిత్ర మేమొ
    క్షణము లాయెనే నేమందు సరస యాత్ర
    ముగిసె నాషాడ మని యేడ్చె ముద్దుగుమ్మ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      ముగిసింది జ్యేష్టమాసమా? బాగుంది. చక్కని విరుపు. మంచి పూరణ. అభినందనలు.

      తొలగించండి
  3. పెండ్లి తరువాత వచ్చెను బిడ్డ, ముద్దు
    ముచ్చటలు తీరలేదని పొగిలి తల్లి
    ముగిసె నాషాఢ మని యేడ్చె; ముద్దుగుమ్మ
    పెనిమిటినిఁ జేరఁ బోయెద ననుచు మురిసె.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ ధన్యవాదాలు.
    మీ విరుపు ముందు నావిరుపు దిగదుడుపు.

    రిప్లయితొలగించండి
  5. అమ్మగారింట నాషాఢ మనుచు జేరి
    తల్లి ప్రేమను పొందెను తనివిదీర
    శ్రావణంబున పతి దరి సాగనంప
    ముగిసె నాషాడ మని యేడ్చె ముద్దుగుమ్మ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      చాలా బాగుంది మీ పూరణ.. నేను తల్లిని ఏడ్పిస్తే మీరు పిల్లను ఏడ్పించారు. అభినందనలు.

      తొలగించండి
  6. గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
    గురువుగారూ పద్య పాదములను మార్చుట శ్రీ పండిత నేమాని వారిది . వారి యడుగు జాడలలో నడచుటకు చిన్ని ప్రయత్నము . ఇది వారి రామాయణము గొప్పదనము దప్ప నాది కాదు.
    నాకు తెసిన ఒక కుటుంబములో కోడలు అత్త ముట్టిన, పట్టినవి ముట్టదు . ఆ పై కోపతాపములను ప్రదర్శించును .
    పుట్టింటి వైభవమును రోజులకొలది జెప్పును . ఆ యత్త
    ------
    కోపతాపములను జూపు గోడలి గని
    ముగిసె నాషాడ మని యేడ్చే , ముద్దు గుమ్మ
    మురిసె పతినింట పాదము మోపి, దెలిపె
    పుట్టినింటి సంగతులను గట్టిగాను .
    -----
    అత్త గారు ముగిసె నాశాడ మని యేడ్చే ,
    ముద్దు గుమ్మ మనసు హద్దు దాటె
    పతిని గాంచి దెలిపె నతి వేగమున పుట్టి
    నిం ట కబురులెల్ల నింపుగాను .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      వాహ్! దాదాపు ఒకే భావాన్ని రెండు వేర్వేరు పద్యాల్లో, ఒకే సమస్యను వేర్వేరు ఛందాల్లో ... అద్భుతం! అభినందనలు.
      మొదటి పూరణలో ‘పతి యింట’ అనీ, రెండవ పూరణలో ‘పుట్టినింటి కబురులెల్ల’ అని మార్చండి.

      తొలగించండి
  7. ధనము నార్జించుట కొఱకు తరలి వెళ్ళె
    భర్త పరదేశమునకును, భార్య వేచె
    సఖియలెల్లరు చేరిరి సఖుల చెంత
    శ్రావణమ్మున, నికపైన జాగదేల

    ననగ కొంతకాలమ్మగుననుచు పతియు
    దెలిపె; తనదు పతిని దలచి దీనురాలు,
    దాను జేరగ పోవగ దారి లేక,
    "ముగిసె నాషాఢమ"ని యేడ్చె ముద్దుగుమ్మ

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ముద్దుగా బెంచి ,లాలించి మురిపెముగను,
    పెండ్లి జేసిరి ;యా క్రొత్త పెండ్లి కూతు
    రునకు పతియింటికిని బోవ మనసురాక
    ముగిసె నాషాఢ మని యేడ్చె ముద్దుగుమ్మ.

    రిప్లయితొలగించండి
  10. ఆషాఢ మాసాన హాయిగా మగనితో
    రమణి వినోద యాత్రల నొనర్చె
    నందులోన విమాన యానమ్ముల నొనర్చె
    హాయిగా సౌఖ్యాల ననుభవించె
    తక్కువ ధరలకే చక్కని వెన్నియో
    స్వర్ణాభరణ విశేషముల కొనెను
    పలురకమ్ముల వస్త్రములనేని తక్కువ
    ధరలకే కొని పొంగె సరసిజాక్షి
    యాత్రల ముగించుకొని యింటి కరుగుదేర
    ననుభవమ్ములు జ్ఞాపకాలగుచు మిగిలె
    నింటి పనులును బాధ్యత లెల్ల గనుచు
    ముగిసె నాషాఢమని యేడ్చె ముద్దుగుమ్మ

    రిప్లయితొలగించండి
  11. తనను గొని పోవ పెనిమిటి తరలి రాగ
    తల్లి దండ్రుల విడువను దల్ల డిల్లి
    చేత లేమియు చేయుట చేత కాక
    ముగిసె నాషాఢమని యేడ్చె ముద్దు గుమ్మ

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి ధన్యవాదములు
    శ్రీ నేమాని వారి శ్రీ మదధ్యాత్మ రామాయణము చదివిన తరువాత, వారివలె చందస్సుతో ఆటలాడు కొనవలెనని అనిపించక మానదు. అంత అద్బుతముగా రామాయణమును రచించినారు. ఈ గొప్పదనమంతయూ వారికి చెందను. వారి శుభాశీస్సుల బలముతో గర్భకవితలు మరియు అన్ని చందాలలో పద్యములు వ్రాయాలని నా ఆశ .

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారి పూరణ....

    కొత్త దంపతు లాషాఢ ముత్తమ మని,
    యత్తలకు దూర ముండియు, హాయిఁ గొనుచుఁ
    దేలి రానంద లోకాలఁ; దిరిగె నెలయు!
    ముగిసె నాషాఢమని యేడ్చె ముద్దు గుమ్మ!!

    ('ఆషాఢ మింత తొందరగ ముగియకున్న నే యాటంకములు లేక మఱి
    కొంత కాలము వర కానందమును బొందుదుము గదా!' యనియే యా యేడుపు!)

    రిప్లయితొలగించండి
  14. విరిసె వలపులు మదినిండ వెల్లువ గను
    ఊ ర్ధ్వ లోకాల దేలుచు నూటి [ ఊటి ] కేగి
    క్రొత్త జంటగ దిరిగిరి మత్తు గాను
    ముగిసె నాషాఢ మని యేడ్చె ముద్దు గుమ్మ !

    రిప్లయితొలగించండి
  15. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ ‘ఆషాఢం డిస్కౌంట్ల’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    శుభమస్తు!
    మనసు చీకాకుగా ఉన్నప్పుడు నేమాని వారి రామాయణాన్ని చదువుతూ వుంటాను. అది నాకు మనశ్శాంతిని ఇస్తుంది.
    *
    మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    కొత్త జంటను ఊటీకి పంపిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నాకో ధర్మసందేహం... నిజానికి ఆషాఢంలో ఒకరినొకరు చూడకూడనిది కొత్త జంటా? అత్తాకోడళ్ళా?
    మా కొత్త కోడల్ని మా ఆవిడా, మా అబ్బాయీ చూడలేదు కాని నేనైతే ఒకసారి వెళ్లి చూసి వచ్చాను.

    రిప్లయితొలగించండి
  17. తమ్ముడూ ! నాకుతెలిసి " అత్తా అల్లుడు గడప దాట కూడదు " అని అంటారు . అంటే , అల్లుడిక్కడికి రాకూడదు , అత్తగారు అక్కడికి వెళ్ళ కూడదు
    " అసలు వాళ్ళిద్దరూ ఎటైనా వెళ్ళి పోవచ్చు" . అదన్న మాట

    రిప్లయితొలగించండి