27, జులై 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 114 (ప్రహేళిక)

చం.
కలువలరాజు బావ సతి కన్నకుమారుని యన్న మన్మనిన్
దొలఁచినవాని కార్యములు తూకొని చేసినవాని తండ్రినిం
జిలికినవాని వైరి పతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్
వలచిన వాహనంబు వలె వచ్చెడి నింటికిఁ జూడవే చెలీ!

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఆ వస్తున్న వాడెలా ఉన్నాడో వివరించండి.
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

3 కామెంట్‌లు:

  1. మందాకిని గారూ,
    వాయుదేవుని వరకు సరిగానే వచ్చారు. ప్రయత్నించండి. ఇక్కడ వాయువును చిలికినవాడు అంటే ‘శేషుడు’. ఇక ముందుకు సాగండి.

    రిప్లయితొలగించండి
  2. మందాకిని గారూ,
    ఇప్పుడు మీ సమాధానం 100% కరెక్ట్! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ సమాధానం 100% సరియైనది. అభినందనలు.

    రిప్లయితొలగించండి