19, జులై 2011, మంగళవారం

సమస్యా పూరణం -398 (తండ్రి మించిన శత్రువు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
తండ్రి మించిన శత్రువు ధరణి గలఁడె?
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. చదువు నేర్పించి బుద్ధులు చక్క దిద్ది
    మిత్రుడై మెలగును గాదె పుత్రునకును
    వాడి నిస్పృహ దుర్గుణ పాలి తెలియ
    తండ్రి మించిన శత్రువు ధరణి గలఁడె?

    రిప్లయితొలగించండి
  2. కనక కశిపుడు సుతునితో ననెను " బిడ్డ!
    హరిని తలచుట కొలుచుట సరియె నీకు?
    సురల ప్రభువయి చెలగుచు మరుని గన్న
    తండ్రి మించిన శత్రువు ధరణి గలఁడె? "

    రిప్లయితొలగించండి
  3. వేద వేదాంగవిద్యలఁ విదితమగుట
    కష్ట సాధ్యమౌ బ్రహ్మమ్ముఁ గన్న ముద్దు
    గొమరు మరణము నత్తఱిఁ గోరు నట్టి
    తండ్రి మించిన శత్రువు ధరణి గలఁడె?

    రిప్లయితొలగించండి
  4. డా. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ...

    చౌర్య వృత్తిని బెంపారు సంపద లిడి
    శూరులుగ నెంచి హీనులు శుంఠ లైన
    సంతతియు జేర చెఱసాల వింత గాంచు
    తండ్రి మించిన శత్రువు ధరణిఁ గలఁడె

    రిప్లయితొలగించండి
  5. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, జులై 19, 2011 3:48:00 PM

    బిడ్డలన్నను ఇసుమంత ప్రేమలేక,
    భావమున దుష్కృతత్వపు భయము లేక,
    చెత్తకుప్పల పారవేసే కసాయి
    తండ్రి, మించిన శత్రువు ధరణి గలడె.

    రిప్లయితొలగించండి
  6. నరకునకును,ప్రహ్లాదుకు నరయ పాండు
    రాజపౌత్రులకును; మరి రావణసుతు
    లకును; నాబావమరిదికినకట!నిజము!
    తండ్రి మించిన శత్రువు ధరణిఁ గలఁడె

    రిప్లయితొలగించండి
  7. చట్టవ్యతిరేకమూ, అంతకు మించి ప్రమాదకరమూ ఐనా , పదవతరగతి, ఇంటరు చదివే తమ పిల్లలకు మోటారుసైకిళ్ళిచ్చే తండ్రుల బాధ్యతారాహిత్యాన్ని నిరసిస్తూ:

    ర్యాంకులని మార్కులని రాచిరంపమందు
    బెట్టి,రాకపోకలకునై,పిల్లలకును
    హతవిధీ!కోరి యంత్ర వాహనమునిడెడి
    తండ్రి మించిన శత్రువు ధరణిఁ గలఁడె

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ___________________________________

    తపసి యాశ్రమ మందున - తపసుల వలె
    తల్లి యొద్దను బెరిగిన - పిల్ల లకును
    తమను తాము నిరూపించు - తరుణ మమరె !
    తండ్రి రాముడ నెరుగని - తనయు లపుడు
    తత్తడిని పట్టి కట్టిరి - తరువు నకును !

    తగవు తలపడి గెల్చిన - త్రపను బొంద
    తండ్రి మించిన శత్రువు - ధరణి గలఁడె?
    ___________________________________
    త్రప = కీర్తి

    రిప్లయితొలగించండి
  9. 02)
    ___________________________________

    తరుణ వయసున ,నే ,బిందు - తంత్ర మందు
    తండ్రి పైనను గెల్చితి ! - తమియు దీరె !
    తరుణ వయసున నేర్పించ - తనయులకును
    తండ్రి మించిన శత్రువు - ధరణి గలఁడె?
    ___________________________________
    బిందుతంత్రము = చదరంగము

    రిప్లయితొలగించండి
  10. డా. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ...

    కిశోర్ జీ, మీ బిందుతంత్ర ప్రజ్ఞ నిచ్చట గాంచుచుంటిమి. మీ పద్యాలమోఘము.

    రిప్లయితొలగించండి
  11. వసంత్ జీ ! బాగుంది . తరుణ ప్రాయమునను బిందు; తరుణ ప్రాయమునను నేర్ప ... అంటే ఎలా ఉంటుందీ!

    రిప్లయితొలగించండి
  12. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
    తరుణప్రాయము - అంటే గురువుగారొప్పుకోరు -గణభంగమంటారు !
    అందు చేత ----

    రిప్లయితొలగించండి
  13. మాస్టరు గారూ ! తరుణ ప్రాయము అని విడి విడి గా చదువుతాము కదా ! అప్పుడు 'ణ' గురువౌతుందా ? తరుణ వయసు అనవచ్చా ? తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిబుధవారం, జులై 20, 2011 7:40:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    ఒక తండ్రి తన కొడుకుతో

    సహనముడిగిన శాంతము సన్నగిల్లు
    క్రోధమన్నది మనిషికి బాధపెట్టు
    పాపములనెన్నొ జేయించు కోపమునకు,
    తండ్రి,మించిన శత్రువు ధరణి గలడె

    తండ్రి = ఒరె నాన్నా (అని సంబోధిస్తూ) కోపమును మించిన శత్రువు లేదు అనిచెప్పెను.

    రిప్లయితొలగించండి
  15. హనుమచ్ఛాస్త్రి గారూ,
    తరుణ ,ప్రాయము రెండూ సంస్కృత పదాలు . కాబట్టి ప్రా ముందున్న అక్షరం గురువు అవుతుంది.
    తరుణ వయస్సు అంటే సంస్కృతం , తెలుగు పదాలు. అవుతాయి.

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘తరుణప్రాయము’ అన్నప్పుడు ‘ణ’ తప్పక గురు వవుతుంది.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    అయితే వేదవేద్యుడైన కొడుకు మరణాన్ని కోరిన తండ్రి ఎవరో కాస్త వివరణ ఇస్తే అందరికీ అర్థం అయ్యేది.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    కాని భావమే కొద్దిగా అవగాహనకు అందడం లేదు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    మీ రెండు పూరణలూ బహు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో మిగతావారి సంగతేమో కాని పాండురాజ పౌత్రులకు, ‘నా’ బావమరదికి తండ్రి శత్రు వెలా అయ్యాడు?
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘రాముడని + ఎరుగని’ అన్నప్పుడు సంధి లేదు. ‘రాముడౌ టెరుగని’ అంటే సరి!
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. సందేహ నివృత్తి జేసిన శంకరార్యులకు ధన్యవాదములు.
    మందాకిని గారూ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. వేద వేదాంగవిద్యలందు ఆరితేరినా, విదితమగుట కష్ట సాధ్యమౌ బ్రహ్మమును గన్న-చూసిన-ఎఱిగిన ముద్దు
    గొమరు - ప్రహ్లాదుని మరణము నత్తఱిఁ గోరు నట్టి (హిరణ్య కశ్యపుని వంటి)
    తండ్రి మించిన శత్రువు ధరణి గలఁడె?

    ప్రహ్లాదుడు కాకుండా తండ్రియే శత్రువు గా బాధలు పడ్డవాళ్ళు మరి ఇంకెవరూ నా దృష్టి లోకి రాలేదు గురువుగారూ!

    రిప్లయితొలగించండి
  19. అర్భకులు ఉపపాండవులు కేవలం పాండవుల కడుపున పుట్టిన కారణానికి అన్యాయంగా మరణించారు కదండీ అందువల్ల అలా అన్నాను.
    అలానే - రావణ పుత్రులు కూడ తండ్రి శత్రుత్వాన్ని నెత్తికెత్తుకుని మరణించినవాళ్లే-
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  20. అన్ని పూరణలూ బాగున్నాయి. ఊకదంపుడు గారూ, నేనా ఉద్దేశ్యంతో అనలేదు. ఎవరు అని తెలిసేట్టుగా రాస్తే బాగుండేదని గురువుగారు అన్నారు.
    ప్రహ్లాదుడి పేరు పద్యంలో రాకపోయినా అతడు తప్ప ఇంకెవరు తండ్రి చేత పరమ శత్రువు గా భావింపబడిన వారు ఉన్నరు అనే ఉద్దేశ్యంతో నేను వివరణ రాయలేదని గురువు గారికి పై వ్యాఖ్యలో చెప్పుకున్నాను . అంతే.
    కానీ మిగతా పూరణల్లో కవిమిత్రులందరూ నా ఉద్దేశ్యం తప్పని మీరందరూ నిరూపించారుగా. పిల్లలకు చాలా మంది తల్లిదండ్రులు శత్రువులుగా ఉన్నారు. కద్రువ కూడా సర్పజాతి అంతా నాశనంకావాలని శపించింది.

    రిప్లయితొలగించండి