19, జులై 2011, మంగళవారం

ప్రహేళిక - 44

ఈ దేవి ఎవరు?
తే. గీ.
గాలికొడుకు కుమారునిఁ గూల్చినట్టి
వాని తండ్రిని మ్రింగెడివారి తలలు
నఱికినట్టివాని సుతుని నలుమొగముల
నెలకొనిన దేవిఁ గొల్తు విద్యల నొసంగ.

మిత్రులారా,
సమాధానాలను వ్యాఖ్యగా పెట్టకుండా క్రింది మెయిల్ చిరునామాకు పంపండి.
shankarkandi@gmail. com

8 కామెంట్‌లు:

  1. సంపత్ గారి వ్యాఖ్య ...

    గాలికొడుకు = భీముడు
    కుమారుని కూల్చినట్టి వాని = ఘటోత్కచుని చంపిన వాడు ( కర్ణుడు )
    వాని తండ్రిని = సూర్యదేవుని
    మ్రింగెడివారి తలలు = రాహు, కేతువుల తలలు
    నరికినట్టివాని = విష్ణుమూర్తి
    సుతుని = బ్రహ్మ
    నలుమొగముల = నాల్గు ముఖముల
    నెలకొనిన దేవి = నడయాడునట్టి దేవి ( సరస్వతి దేవి )
    గొల్తు విద్యల నొసంగ = విద్యకొరకు వేడుకొందును.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారి వ్యాఖ్య ...

    గాలి కొడుకు కుమారుని = భీముని కొడుకు ఘటోత్కచుని
    కూల్చి నట్టి వాని తండ్రి = కర్ణుని తండ్రి సూర్యుడు
    వాని మ్రింగెడివారి తలలు = రాహుకేతువుల తలలు
    నఱికినట్టివాని సుతుని = (మోహిని ) విష్ణువు సుతుని
    నలుమొగముల నెలకొనిన దేవి = బ్రహ్మ భార్య ... సరస్వతి ని గొల్తు విద్యల నొసంగ

    రిప్లయితొలగించండి
  3. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి వ్యాఖ్య ....

    భీమసుతుని గూల్చె భీకర రణమందు
    వీర కర్ణుడతడు వీరసుతుడు
    రవిని మింగునట్టి రాహుకేతువులకు
    తలలు కత్తిరించె దనుజ వైరి
    పద్మనాభ సుతుని వదనంబులందాడు
    పలుకు ముద్దరాలి ప్రస్తుతింతు.

    వీరుడు = సూర్యుడు

    రిప్లయితొలగించండి
  4. మందాకిని గారి వ్యాఖ్య ....

    గాలికొడుకు కుమారుండు-ఘటోత్కచుడు
    చంపినవాడు కర్ణుడు
    వాని తండ్రిని మింగేది రాహు కేతువులు.
    వాళ్ళ తలలు నరికేది మోహిని- విష్ణువు
    వానిసుతుని నాలుగు మొగములు- బ్రహ్మ నాలుగు మొగములు
    లో వుండేది విద్య నొసగెడి దేవి- సరస్వతి.

    రిప్లయితొలగించండి
  5. సంపత్ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మొట్టమొదట సరియైన సమాధానం చెప్పింది మీరే. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అభినందనలు.
    *
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    వెంటనే స్పందించి, సరియైన సమాధానాన్ని ‘చందోబద్ధంగా’ ఇచ్చినందుకు ధన్యవాదాలు, అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. మందాకినిగారూ, శంకరయ్యగారూ నెనరులు!

    రిప్లయితొలగించండి