2, జులై 2012, సోమవారం

పద్య రచన - 39


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. పండిత నేమాని
    పేదరికము మిగుల పెరుగుచు నుండగా
    బాల్యమందునేని పనుల కేగి
    కూలి సొమ్ము తెచ్చు కొనుటయే దిక్కయ్యె
    నెపుడు బాగుపడునొ యీ వ్యవస్థ?
*     *     *     *     *     *     *
౨. సంపత్ కుమార్ శాస్త్రి
    చిన్నారి మృదువైన చేత బల్పము లేదు
              బండరాళ్ళను మ్రోయు నెండలోన
    ముసిముసినవ్వుల పసిబుగ్గ లవిలేవె
              యిసుకతిన్నెలయందు మసకబారె,
    అమ్మసాయముచేత నడుగులు వేయదే
              అమ్మకే సాయమ్మునందజేయు,
    పాఠంబు నేర్వగా బడి కేగదే తాను
              బడికోసమై మెట్లు పఱచసాగె,
    పిన్నలీరీతిగా నేడు యున్న మనదు
    దేశ మభివృద్ధి గాంచునే? నాశ మౌను,
    సర్వదేశంబులందున యుర్వి యందు
    విద్యకన్నను గొప్పది వేరు కలదె?

*     *     *     *     *     *
౩. సుబ్బారావు
    ఏమి పాపము చేసిరో యేమొ కాని
    చదువ వలసిన సమయాన సాగి పనికి
    మోయు చుండిరి రాళ్ళను మోయ లేక
    బ్రతుకు సాగింతు రక్కట ! భారముగను
*     *     *     *     *     * 
౪. కందుల వరప్రసాద్
    రాళ్లుగొట్టి నే నాలుగు రాళ్ళతోడ
    తల్లి దండ్రుల గన్నుల తడిని తుడవ
    వచ్చితిని గాని , కాలులో వాలుగ దిగె
    రాయి ,రక్తము చిందె ధారాళముగను
    జూడు మిత్రమా, దేవుని జాలి లేని
    గుండె , పాపి కిచ్చును వెండికొండలను జ
    గతిని పేదరికము బెంచ , కష్ట జీవి
    పైన కరుణ,మమత మచ్చు కైన లేదు.

*     *     *     *     *     *     *
౫. హరి వేంకట సత్యనారాయణ మూర్తి    
    సౌధరాజమునందు సౌఖ్యంబులనుగాంచి
              వైభవంబులఁ దేలు వారలొకరు
    పూరిగుడిసెలోన భోజనంబునకైన
              భాగ్యమందని పేదవారలొకరు
    పిత్రార్జితంబైన విత్తంబు చేకొని
              నిరతసంతోషులౌ సరసులొకరు
    పిన్న పెద్దలటంచు భేదమించుకలేక
              సభ్యులందరు గూడి సర్వగతుల
    నెండ వానలు చూడక నెల్లవేళ
    లందు కష్టంబునకునోర్చి యన్ని పనులు
    చిన్మయానందమూర్తులై చేయుచుండు
    వారలొకకొంద రరయంగ భారతమున.

    అరువదియైదు వత్సరము లద్భుతరీతి గతించిపోయె నీ
    భరతభువిన్ స్వకీయపరిపాలన మంది, స్వతంత్రభారతిన్
    సరియగు నార్థికోన్నతుల ఛాయలు పేదలజీవితాలలో
    నరయగ లేము, కారణము లందరికిన్ విదితంబులే గదా!

    విద్య నేర్వంగ వలసిన వేళలోన
    బాలికలు సైత మింతటి భారమైన
    పనులు చేయుట కటకటా! భావ్యమగునె?
    తమకుటుంబము పోషించ దలచి యౌర!

    ఆటపాటలలో కాల మందమొప్ప
    గడుపగలయట్టి భాగ్యంబు కానరాదు
    కఠినతరమైన దారిద్ర్య కారణమున
    బాలికలకైన నీరీతి భరతభువిని.

    సమత చేకూర గలుగునా సంఘమందు
    నార్థికాభ్యుదయముగల్గి యందరకును,
    బాల కార్మికసరణులీ భారతమున
    నంతరించునె? సౌఖ్యంబు లందగలవె?

*     *     *     *     *     *
౬. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    పొత్తములు బట్టు చేతుల
    నత్తరి నలికూలిరాళ్ళకై పోయితివో
    పుత్తడి బొమ్మా! పెద్దల
    చిత్తమునకు సిగ్గుచేటు చెల్లు నెపుడొకో!

*     *     *     *     *     *
౭. రాజేశ్వరి నేదునూరి
    మండెడి యెండన మాడుచు
    కండలు కరిగించు మనల కరుణిం చరుగా !
    బండల గుండెలు వారివి
    దండిగ దోచిరి ధనమద దైత్యు లటన్నన్ !
 

*     *     *     *     *     * 
౮. గుండు మధుసూదన్
సీ.
బాలికల్ చదివిన భవితకే వెలుఁగన
         ధనహీన బాలిక తట్ట మోసె;
తల్లిదండ్రుల చాటు పిల్ల యనంగను
         తలిదండ్రులకె యండ తాన యయ్యె;
చిదిమిన పాల్గాఱు చిఱుత వయస్సున
         బాలకార్మిక వృత్తిఁ బడయ వలసె;
బడిబాట పట్టెడి బాల్యమ్ము నందునఁ
         బరువిడి పనిబాట పట్ట నెంచె;
గీ.
సంపదలు గల వారికే చదువు లాయె;
కటిక నిరుపేద కలలన్ని కల్ల లాయె;
బాలహక్కుల చట్టాలు వట్టి పోయె;
పసిఁడి బాలల బ్రతుకులు బండలాయె!

18 కామెంట్‌లు:

  1. పేదరికము మిగుల పెరుగుచు నుండగా
    బాల్యమందునేని పనుల కేగి
    కూలి సొమ్ము తెచ్చు కొనుటయే దిక్కయ్యె
    యెపుడు బాగుపడునొ యీ వ్యవస్థ?

    రిప్లయితొలగించండి
  2. చిన్నారి మృదువైన చేత బల్పములేదు
    బండరాళ్ళను మ్రోయునెండలోన
    ముసిముసినవ్వుల పసిబుగ్గలవిలేవు
    ఇసుకతిన్నెలయందు మసకబారె,
    అమ్మసాయముచేతనడుగులు వేయదే
    అమ్మకేసాయమ్మునందజేయు,
    పాఠంబునేర్వగా బడికేగదేతాను
    బడికోసమై మెట్లు పఱచసాగె,

    పిన్నలీరీతిగా నేడు యున్న మనదు
    దేశమభివృద్ధిగాంచునే? నాశమౌను,
    సర్వదేశంబులందున యుర్వి యందు
    విద్యకన్నను గొప్పది వేరు కలదె?

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    చాలా చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ఇంత వేగంగా సీసపద్యంలో మీ స్పందన కరుణరసాన్వితంగా తెలిపిన మీ చాతుర్యానికి అబ్బురపడుతున్నాను.
    ‘పాఠంబునేర్వగా బడికేగదే తాను
    బడికోసమై మెట్లు పఱచసాగె’
    ఎంత చక్కని భావన!
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఏమి పాపము చేసిరి యే మొ కాని
    చదువ వలసిన సమయాన సాగి పనికి
    మోయు చుండిరి రాళ్ళను మోయ లేక
    బ్రతుకు సాగింతు రక్కట ! భార ముగను

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి నమస్కారములతో
    రాళ్లుగొట్టినే నాలుగు రాళ్ళ తోడ
    తల్లి దండ్రుల గన్నుల తడిని తుడవ
    వచ్చితిని గాని , కాలులో వాలుగ దిగె
    రాయి ,రక్తము జిందె ధారాళ ముగను
    జూడు మిత్రమా, దేవుని జాలి లేని
    గుండె , పాపి కిచ్చును వెండికోండలను జ
    గతిని పేదరికము బెంచ , కష్ట జీవి
    పైన కరుణ,మమత మచ్చు కైన లేదు.

    రిప్లయితొలగించండి
  6. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం కరుణరసాత్మకమై బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నేమాని వారి పద్యం నాల్గవ పాదం లో యడాగమం రాదనుకుంటాను సరిచేయండి

    రిప్లయితొలగించండి
  8. సౌధరాజమునందు సౌఖ్యంబులనుగాంచి
    వైభవంబులఁ దేలు వారలొకరు
    పూరిగుడిసెలోన భోజనంబునకైన
    భాగ్యమందని పేదవారలొకరు
    పిత్రార్జితంబైన విత్తంబు చేకొని
    నిరతసంతోషులౌ సరసులొకరు
    పిన్న పెద్దలటంచు భేదమించుకలేక
    సభ్యులందరు గూడి సర్వగతుల
    నెండ వానలు చూడక నెల్లవేళ
    లందు కష్టంబునకునోర్చి యన్ని పనులు
    చిన్మయానందమూర్తులై చేయుచుండు
    వారలొకకొంద రరయంగ భారతమున.

    అరువదియైదు వత్సరములద్భుతరీతి గతించిపోయె నీ
    భరతభువిన్ స్వకీయపరిపాలనమంది, స్వతంత్రభారతిన్
    సరియగు నార్థికోన్నతుల ఛాయలు పేదలజీవితాలలో
    నరయగ లేము, కారణము లందరికిన్ విదితంబులే గదా!

    విద్య నేర్వంగ వలసిన వేళలోన
    బాలికలు సైత మింతటి భారమైన
    పనులు చేయుట కటకటా! భావ్యమగునె?
    తమకుటుంబము పోషించ దలచి యౌర!

    ఆటపాటలలో కాల మందమొప్ప
    గడుపగలయట్టి భాగ్యంబు కానరాదు
    కఠినతరమైన దారిద్ర్య కారణమున
    బాలికలకైన నీరీతి భరతభువిని.

    సమత చేకూర గలుగునా సంఘమందు
    నార్థికాభ్యుదయముగల్గి యందరకును,
    బాల కార్మికసరణులీ భారతమున
    నంతరించునె? సౌఖ్యంబు లందగలవె?

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాత గారూ,
    నిజమే.. ధన్యవాదాలు. సరి చేస్తాను.

    రిప్లయితొలగించండి
  10. పొత్తములు బట్టు చేతుల
    నత్తరి నలికూలిరాళ్ళ కైపోయితివో
    పుత్తడి బొమ్మా! పెద్దల
    చిత్తమునకు సిగ్గుచేటు చెల్లు నెపుడకో!

    రిప్లయితొలగించండి
  11. హ.వేం.స.నా.మూర్తి గారూ మీ పద్యం చాలా బాగుంది.

    అరువదియైదు వత్సరములద్భుతరీతి గతించిపోయె నీ
    భరతభువిన్ స్వకీయపరిపాలనమంది, స్వతంత్రభారతిన్
    సరియగు నార్థికోన్నతుల ఛాయలు పేదలజీవితాలలో
    నరయగ లేము, కారణము లందరికిన్ విదితంబులే గదా!

    రిప్లయితొలగించండి
  12. మండెడి యెండన మాడుచు
    కండలు కరిగించు మనల కరుణిం చరుగా !
    బండల గుండెలు వారివి
    దండిగ బలకొను ధనమద దైత్యు లటన్నన్ !

    రిప్లయితొలగించండి
  13. సత్యనారాయణ మూర్తి గారూ,
    అద్భుతంగా ఉండీ మీ ఖండకావ్యం. ధన్యవాదాలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. గుండు మధుసూదన్ గారి పద్యము....

    సీ.
    బాలికల్ చదివిన భవితకే వెలుఁగన
    ధనహీన బాలిక తట్ట మోసె;
    తల్లిదండ్రుల చాటు పిల్ల యనంగను
    తలిదండ్రులకె యండ తాన యయ్యె;
    చిదిమిన పాల్గాఱు చిఱుత వయస్సున
    బాలకార్మిక వృత్తిఁ బడయ వలసె;
    బడిబాట పట్టెడి బాల్యమ్ము నందునఁ
    బరువిడి పనిబాట పట్ట నెంచె;

    గీ.
    సంపదలు గల వారికే చదువు లాయె;
    కటిక నిరుపేద కలలన్ని కల్ల లాయె;
    బాలహక్కుల చట్టాలు వట్టి పోయె;
    పసిఁడి బాలల బ్రతుకులు బండలాయె!

    రిప్లయితొలగించండి
  15. మధుసూదన్ గారూ,
    మీ పద్యంలో ఆర్ద్రత ఉంది. చక్కని పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. సంపత్ కుమార్ శాస్త్రి గారూ! అభిననందనలు.

    రిప్లయితొలగించండి
  17. ధన్యోశ్మి గురువుగారూ.

    ఇంతకన్నా ఏమి చెప్పలేను.

    శ్రీ మిస్సన్న గారు,

    ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి