10, జులై 2012, మంగళవారం

సమస్యాపూరణం -759 (మాట తప్పువాఁడు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

మాట తప్పువాఁడు మంచివాఁడు.

ఈ సమస్యను సూచించిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

కవిమిత్రుల పూరణలు

౧. హరి సత్యనారాయణ మూర్తి
    స్వార్థపరుడె భువిని పాలకాగ్రణి నేడు
    కోట్లు మ్రింగువాడు గొప్పవాడు
    బాస చేసినట్టి పనులను చేయక
    మాట తప్పువాడు మంచివాడు.
*     *     *     *     *
౨. పండిత నేమాని
    చిన్నికృష్ణుడితడు పున్నెములకు ప్రోవు
    మా వరాల పంట మరల మరల
    వాని గూర్చి కొంటె వాడంచు మీరను
    మాట తప్పు, వాడు మంచి వాడు.

*     *     *     *     *
౩. లక్ష్మీదేవి
    ఎవరిమాట నమ్ముటిలను ముప్పునుఁదెచ్చు,
    నెవడు వాడు? జగతి నెపుడు చెడ్డ
    వాని వలన బాధ పడునదెవ్వరు చెప్పు?
    మాట తప్పు వాఁడు, మంచివాఁడు.

*     *     *     *     *
౪. మిస్సన్న
    ధర్మరాజ! నీకు తగదు జూదము పోకు-
    మాట తప్పు వాఁడు మంచివాఁడు
    కాదు శకుని పాచికలను మాయంజేసి
    నీదు సిరుల దోచు నిజము నమ్ము.

*     *     *     *     *
౫. గుండు మధుసూదన్
    భాష పైన గొప్ప పట్టున్న పండితుం
    డతఁడు మాట లాడ నమృత మొలుకు;
    వాని మాట పసిఁడి; వానికి లేదయ్య
    మాట తప్పు! వాఁడు మంచివాఁడు!

*     *     *     *     *
౬. గోలి హనుమచ్ఛాస్త్రి
    ప్రక్క యింటి లోని పాపయ్య గారికి
    పుత్రు లిద్దరయ్య పోల్చి చూడ
    వారు పెద్ద. చిన్న వరుసగా చెప్పెద
    మాట తప్పు వాఁడు, మంచివాఁడు.

*     *     *     *     *
౭. సుబ్బారావు
    వర్జ్యనీయుడు సుమి వసుధలో నిచ్చన
    మాట తప్పు వాడు, మంచి వాడు
    సర్వ జనుల యెడల సమ భావముగ నుండు
    మాట యాయువు గద ! మానవునకు.

*     *     *     *     *
౮. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    మాట తప్పు వాఁడు మంచివాఁడు మనకు
    రాష్ట్రపతి యగునట రాలుగాయి
    రాజకీయ మందు రభస తప్పుటలేదు
    కాంగ్రెసు ప్రణతుడె కడకు గతిర.

*     *     *     *     *
౯. సహదేవుడు
    ఆధునికయుగపతివాదసూత్రములివే
    మాటతప్పువాడుమంచివాడు!
    తూటఁబేల్చువాడుదొడ్డవాడుగఁజెల్లు!
    హత్యఁజేయ గద్దె నందువాడు!
*     *     *     *     *
౧౦. కమనీయం
    శుక్రనీతి చెప్పు సూత్రప్రకారమ్ము
    అనుసరించి గొప్ప యాపదలను
    తనను దాను కాచుకొనుటకై యాడిన
    మాట తప్పువాడు మంచివాడు.

*     *     *     *     *
౧౧. చంద్రమౌళి
(సత్రాజిత్తు శ్యమంతకరత్నాన్ని కృష్ణుడపహరించెననిన బలరాముడు ఆ నింద నిజముకాదని అతని మందలించిన సందర్భము)
    “పరుల సొమ్ము కృష్ణ పరమాత్మ తాకడు,
    నింద వేయ తగదు నిజము గాను
    తమ్ముడా రతనము తస్కరించె ననెడి
    మాట తప్పు, వాడు మంచివాడు”
*     *     *     *     *
౧౨. రాజేశ్వరి నేదునూరి
    కలసి యాడి పాడి కలలందు కరిగించి
    మమత లెన్నొ పెంచి మాట మార్చి
    మోస గించ లేక విసుగు నభినయించి
    మాట తప్పు వాఁడు మంచి వాఁడు.
*     *    *     *     *
౧౩. ఊకదంపుడు
    లోన దిగులు మింగి లేనిధైర్యమునొంది
    పలికె పతికి నిట్లు "పవలు, కొడుకు
    చేరదీయడనిన చిలుకజోస్యమువాని
    మాట తప్పు, వాఁడు మంచి వాఁడు."

32 కామెంట్‌లు:

  1. స్వార్థపరుడె భువిని పాలకాగ్రణి నేడు
    కోట్లు మ్రింగువాడు గొప్పవాడు
    బాస చేసినట్టి పనులను చేయక
    మాట తప్పువాడు మంచివాడు.

    రిప్లయితొలగించండి
  2. చిన్నికృష్ణుడితడు పున్నెములకు ప్రోవు
    మా వరాల పంట మరల మరల
    వాని గూర్చి కొంటె వాడంచు మీరను
    మాట తప్పు, వాడు మంచి వాడు

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని గారూ! చక్కని విరుపు. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. ఎవరిమాట నమ్ముటిలను ముప్పునుఁదెచ్చు,
    నెవడు వాడు? జగతి నెపుడు చెడ్డ
    వాని వలన బాధ పడునదెవ్వరు చెప్పు?
    మాట తప్పు వాఁడు, మంచివాఁడు.

    పండితుల వారి పూరణ మనోహరంగా నున్నది.

    రిప్లయితొలగించండి
  5. అమ్మా లక్ష్మీ దేవీ గారు & శ్రీ మిస్సన్న గారూ!
    మీ ఆనందమే నా ఆనందము - శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. నేమాని పండితార్యా! నేను కాదు. గోలి వారు.
    మీ పూరణ మనోజ్ఞం.

    రిప్లయితొలగించండి
  7. ధర్మరాజ! నీకు తగదు జూదము పోకు-
    మాట తప్పు వాఁడు మంచివాఁడు
    కాదు శకుని పాచి కలను మాయంజేసి
    నీదు సిరుల దోచు నిజము నమ్ము.

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పూరణ....

    భాష పైన గొప్ప పట్టున్న పండితుం
    డతఁడు మాట లాడ నమృత మొలుకు;
    వాని మాట పసిఁడి; వానికి లేదయ్య
    మాట తప్పు! వాఁడు మంచివాఁడు!!

    రిప్లయితొలగించండి
  9. ప్రక్క యింటి లోని పాపయ్య గారికి
    పుత్రు లిద్దరయ్య పోల్చి చూడ
    వారు పెద్ద. చిన్న వరుసగా చెప్పెద
    మాట తప్పు వాఁడు, మంచివాఁడు

    రిప్లయితొలగించండి
  10. వర్జ్య నీ యుడు సుమి వసుధ లోన
    మాట తప్పు వాడు, మంచి వాడు
    సర్వ జనుల యెడల సమ భావముగ నుండు
    మాట యాయు వు గద ! మాన వునకు

    రిప్లయితొలగించండి
  11. సత్యనారాయణ మూర్తి గారూ,
    పండిత నేమాని వారూ,
    లక్ష్మీదేవి గారూ,
    మిస్సన్న గారూ,
    గుండు మధుసూదన్ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణలు వైవిధ్యంగా మనోరంజకంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం నా సవరణ గమనించండి.

    రిప్లయితొలగించండి
  12. మాట తప్పు వాఁడు మంచివాఁడుమనకు
    రాష్ట్రపతి యగునట రాలుగాయి
    రాజకీయ మందు రభస తప్పుటలేదు
    కాంగ్రెసు ప్రణతుడె కడకు గతిర

    రిప్లయితొలగించండి
  13. చంద్రశేఖర్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘కాంగ్రెసు ప్రణవమె కడకు గతిర’ అంటే ఎలా వుంటుంది?

    రిప్లయితొలగించండి
  14. 1.ఆధునికయుగపతివాదసూత్రములివే
    మాటతప్పువాడుమంచివాడు!
    తూటఁబేల్చువాడుదొడ్డవాడుగఁజెల్లు!
    హత్యఁజేయ గద్దె నందువాడు!

    2.మంచివాడెవరన?మాటతప్పనివాడు!
    యచ్చుత్ప్పదేమొ?నతడుఁగాడు!
    మన వసంతుడట్లుమాటతూలుననెడు
    మాట తప్పు, వాడు మంచి వాడు!
    (మిత్రుడు వాడు అన్నందులకు మన్నించాలి)

    రిప్లయితొలగించండి
  15. పరల సొమ్ము కృష్ణ పరమాత్మ తాకడు
    సత్రాజిత్తు నింద సరియ గునే
    తమ్ముడా రతనము తస్కరించాడన్న
    మాట తప్పు, వాడు మంచివాడు

    రిప్లయితొలగించండి
  16. "ప్రణతుడు=వంగి నమస్కరించువాడు=వంగి వంగి దండాలు పెట్టేవాడు" అంటేనేబాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  17. సహదేవుడు గారూ,
    ‘ఆధు - వాద’ అని ద-ధ ప్రాసవేసారు. సరే.. పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పూరణ అర్థం కాలేదు.
    *
    చంద్రమౌళి గారూ,
    రెండవ పాదంలో ‘సత్రాజిత్తు’ అన్నచొట గణదోషం. అంతేకాక మీరు చెప్పదలుచుకున్న దేమిటో అవగాహన కావడం లేదు. దయచేసి కాస్త వివరిస్తారా?

    రిప్లయితొలగించండి
  18. చంద్రశేఖర్ గారూ,
    నేను కేవలం పరిహాసానికి అన్నాను. మీ ప్రయోగమె సముచితం.

    రిప్లయితొలగించండి
  19. శుక్రనీతి చెప్పు సూత్రప్రకారమ్ము
    అనుసరించి గొప్ప యాపదలను
    తనను దాను కాచుకొనుటకై యాడిన
    మాట తప్పువాడు మంచివాడు.

    రిప్లయితొలగించండి
  20. కమనీయం గారూ,
    శుక్రనీతిని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. ”పరల సొమ్ము కృష్ణ పరమాత్మ తాకడు”
    నింద వేయ తగదు నిజము గాను
    తమ్ముడా రతనము తస్కరించాడన్న
    మాట తప్పు, వాడు మంచివాడు’
    (సత్రాజిత్తు స్యమంతకరత్నాన్ని కృష్ణుడపహరించెననిన బలరాముడు ఆ నింద నిజముకాదని అతని మందలించిన సందర్భము)

    రిప్లయితొలగించండి
  22. చంద్రమౌళి గారూ,
    ఇప్పుడు మీ పూరణ అన్నివిధాల బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. కలసి యాడి పాడి కలలందు కరిగించి
    మమత లెన్నొ పెంచి మాట మార్చి
    మోస గించ లేక విసుగు నభినయించి
    మాట తప్పు వాఁడు మంచి వాఁడు

    రిప్లయితొలగించండి
  24. రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ బాగుంది. కొందరు మంచి వాళ్ళే అలా ఉంటారు.

    "కలసి యాడి పాడి కలలందు కరిగించి"

    రిప్లయితొలగించండి
  25. లోన దిగులు మింగి లేనిధైర్యమునొంది
    పలికె పతికి నిట్లు "పవలు, కొడుకు
    చేరదీయడనిన చిలుకజోస్యమువాని
    మాట తప్పు, వాఁడు మంచి వాఁడు."

    రిప్లయితొలగించండి
  26. రాజేశ్వరక్కయ్యగారూ, మంచి సునిసితమైన భావనను చిన్న పద్యంలో వెలిబుచ్చారు. ప్రశంసలు.

    రిప్లయితొలగించండి
  27. మా తెలుగు శేఖరులు మా మంచి తమ్మునికి ధన్య వాదములు .

    రిప్లయితొలగించండి