25, జులై 2012, బుధవారం

సమస్యాపూరణం - 773 (విషము సేవింప నాయువు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
విషము సేవింప నాయువు పెరుగునయ్య!
ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. విశ్వనాథునికే చెల్లు విషము ద్రావ
    మాత పుస్తెల కున్నట్టి మహిమ చేత
    నక్క వాతల పోలిక నరులు తెలిసి
    విషము సేవింప నాయువు పెరుగునయ్య?

    రిప్లయితొలగించండి
  2. చంద్ర శేఖర్ గారూ! మీ హోమియో వైద్యం బాగుంది...మూడవ పాదంలో గణములు సరి చూడండి.

    రిప్లయితొలగించండి
  3. హనుమచ్ఛాస్త్రి గారూ,
    సమస్యపాదాన్ని ప్రశ్నార్థకం చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘అనుస/ రించుచు భిషక్కు...’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  4. గోలి వారికీ, మాస్టారికీ ధన్యవాదాలతో:
    విషమునకు విషమే కదా విరుగుడంచు
    చాటు హోమియోపతి వైద్య శాస్త్రమనుస
    రించుచు భిషక్కు లిచ్చిన రీతిగ తగు
    విషము సేవింప నాయువు పెరుగునయ్య!

    రిప్లయితొలగించండి
  5. సర్వరోగపీడితుఁ డయి సత్తువ చెడి
    ఘన విషప్రయోగవ్యస్త మనుజునకు భి
    షక్కొసఁగిన స్వస్థతఁ గూర్పఁజాలెడి యతి
    విషము సేవింప నాయువు పెరుగునయ్య!
    (అతివిషము = ఒక ఔషధము, విషమునకు విరుగుడు)

    రిప్లయితొలగించండి
  6. హిరణ్యకశ్యప,ప్రహ్లాదుల సంభాషణ:

    హరిని మరువక ప్రహ్లాద!తిరిగినంత
    కాలకూటవిషమునీకుమేలనంగ
    తండ్రియానతి పాటించి దలచి హరిని
    విషముసేవింపనాయువు పెరుగు నయ్య!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురువులకు మరియు గురుతుల్యులు శ్రీ నేమాని వారికి శిరసాభివందనములు.

    దీర్ఘకాలికరోగముల్ తెరపిలేక
    బాధపెట్టుచునున్ననిర్భాగ్యునకును
    ప్రకృతివైద్యానుసారమౌ పసరు పచ్చి
    విషము సేవింప నాయువు పెరుగునయ్య.

    పచ్చి విషము = చేదు

    పసరు = ఆకు పసరులు

    రిప్లయితొలగించండి
  8. విషము సేవింప నాయువు పెరుగును కద
    యనుచు జూపించె శంకరు డదియు గాక
    భీమసేనుని యెడ నిరూపింపబడెను
    బళిర! నీటికి పర్యాయపదము విషము

    రిప్లయితొలగించండి
  9. అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీరు మాత పుస్తెల కున్నట్టి మహిమ చేత అన్నారు. మంచిదే. కాని శ్రీ శంకరాచార్యులవారు "జనని! తవ తాటంక మహిమా" అని అన్నారు. అంటే అమ్మ చెవికమ్మల మహిమ అని వారి ఉద్దేశము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. పాము కఱచెనా, విషమది ప్రాణహరణ
    చేయునని విన్న తోడనె చింత వలదు.
    వైద్యమందు తగిన రీతి పాము నోటి
    విషము సేవింప నాయువు పెరుగునయ్య!

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పూరణ.....
    (క్షీరసాగర మథనమందు మొదట హాలాహల ముద్భవించి, లోకముల దహించునపుడు,
    దేవదానవులు శివుని శరణు వేడి, పలికిన సందర్భము)


    పాల సంద్రమ్ముఁ ద్రచ్చంగఁ బ్రథమముగను
    హాలహల ముద్భవించెను; హరుఁడ! నీవు
    విషము సేవింప; నాయువు పెరుగు నయ్య
    దేవ దానవ తతులకు; దీన బంధు!

    రిప్లయితొలగించండి
  12. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘నీటికి పర్యాయపదము విషము’ అనడం చాలా బాగుంది. మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    గోలి వారు పోతన గారి పద్యం... ‘మ్రింగుమనె సర్వమంగళ/ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో’ అన్నదాన్ని స్వీకరించారు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గారూ! నమస్కృతులు.
    మీ పద్యములో

    "సర్వ రోగ పీడితుడయి సత్తువ చెడి" అన్నారు. ఇలా మార్చితే బాగుంటుంది:

    దీర్ఘ రోగ పీడితుడయి తేకువ చెడి"

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. కట్టె మధియింప మధియింప గాడ్పు రగులు
    మందు సేవింప సేవింప వ్యాధి నణచు
    వేము తినినంత తినినంత వెడలు చేదు
    విషము సేవింప నాయువు పెరుగు నయ్య !
    -----------------------------------------------
    కాల కూటము మ్రింగగ గరళ కంఠు
    సర్వ మంగళ మంగళ సూత్రము బలి
    మియని నమ్మి మ్రింగమనె మేలు జగతి
    విషము సేవింప నాయువు పెరుగు నయ్య !

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
    శుభాశీస్సులు. మీ పద్యము బాగున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి