"శంకరాభరణం"
బ్లాగు వీక్షకులకు, మార్గదర్శకులకు, కవి మిత్రులకు, హితులకు
విజయదశమి శుభాకాంక్షలు!
వశమయ్యె మీదు స్నేహము
యశమును గడియించె "శంకరాభరణము" బ్లా
గ్యశ కారకులార! విజయ
దశమి శుభాకాంక్షలివె సదా మీ హితుఁడన్.కంది శంకరయ్య.
దసరా శుభాకాంక్షలు
శంకరాభరణమే సాహిత్య మణి రత్న
మాలయై శోభాయమాన మయ్యె ,
పూర్వ కవీంద్రుల భూరికావ్యము లోని
పద్యచమత్కృతి ప్రాభవాలు
పదపదంబున దాగి పరికించు మనిగోరు
ఆ ప్రహేళికలపై ఆశలూరు
పూరణ చరణాల పూరణల్ సవరించి
పూర్ణత జేకూర్చు పూజ్య గురువు
దత్తపదు లెన్నొ మాలలో దాగియుండు
గళ్ళనుడి కట్టు పదరీతి గతులదెలుపు
ఎన్నగా జూడ భాషకు వన్నె గూర్చ
సఫల మయ్యారు గురువు శ్రీ శంకరయ్య !.
గన్నవరపు మూర్తి మిన్నగా జెప్పును
చంద్ర గారు జెప్పు చక్క గాను ,
నేదునూరి వారు నేర్పుగా చెబుతారు,
అంద రికిని దసర వంద నములు . యీ బ్లాగులో పాల్గొంటున్న , వీక్షిస్తున్న మిత్రు లందరికి
వి జ య ద శ మి శుభాకాంక్షలు .
మంద పీతాంబర్
ధన్య వాదములు. పీతాంబర్ గారు." మీ వందనములకు అభినందనములు.' అందరికి విజయ దశమి శుభా కాంక్షలు.గురువులు,బహుముఖ ప్రజ్ఞాశాలి ' శంకరయ్య గారికి ప్రత్యేకాభి నందనలు.
ప్రీతి తోడ జెపును పీతాంబరు గారు
గన్నవరపు జెప్పు గగన మెరుపు
చంద్ర గారు జెప్పు చంద్రుని వెలుగంత
సరస గతిని నేర్పు శంకర గురువర్య.
వందనమ్ము లివియె యందుకొను మందరు
దోస మెంచ వలదు దశమి గనుకరాజేశ్వరి నేదునూరి