13, అక్టోబర్ 2010, బుధవారం

దత్త పది - 8

కవి మిత్రులారా,
నయా, కియా, దియా, గయా
పై పదాలను ఉపయోగించి మీకు నచ్చిన ఛందస్సులో ఇష్టదైవ ప్రార్థన వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. సిద్ది గణపా! శివతనయా! స్థిరముగ మది
    యార దలుతునే తీరుగయా గొలవను?
    తపముల స్రుక్కి యాతనలు పడలేను
    శీఘ్రముగ రార చిద్రూప సింధురదన !

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పినట్టు ఇష్ట దైవ ప్రార్థన కాదు, ఐనా సరదాకి రాయాలనిపించింది.

    ఢిల్లి కెల్లి వారు ఢీలా పడేనయా
    మంత్రివర్గ మార్పు మరచి యే క్యాకియా?
    నమ్ముకున్న వారి వమ్ము యే కర్‌దియా
    రూఢి, కీలు బొమ్మ రొషయ్య బన్‌గయా

    రిప్లయితొలగించండి
  3. నదియా గౌతమి తీరమందు వెలిసెన్ నవ్య ప్రభల్ జిమ్ముచున్ ,
    నదియే బాసర వాసియై తనకి యానందమ్ము జేకూర్చగా,
    హృదిలో భక్తిసరాగముల్గలుగ యా యుల్లాస హాసాన యా
    చదువుల్నిచ్చెడు వాణినే గొలుతు నా సర్వస్వ మర్పించుచున్ !

    రిప్లయితొలగించండి
  4. పీతాంబర్ గారు తప్పులెలా దొర్లుతాయో బాగా శలవిచ్చారు. ఆత్రుత,అనాలోచన,సులోచనములు దగ్గఱలో లేక పోవడం కూడా కారణాలుగా పేర్కొనవచ్చును. చూడండి, గేయ రచనలు కొంచెము సుళువేమో. అష్టావధాన ప్రక్రియలు చేసే వారికి జోహారులు.

    రిప్లయితొలగించండి
  5. పీతాంబర్ గారూ చూసారా మళ్ళీ సవరించా

    నందన యాదవ నందన లొందిరే
    అనురాగ మానాడు యవని లోన
    ధరణిలో దక్కెనే దాపసులకి యాగ
    ఫలములు నిను గోర భక్తి దోడ
    ఆట లందుట బొంది యా స్నేహరాగమ్ము
    పొంపిరి బొంగిరే గోప సుతులు
    వెరగుగ యామినీ వెన్నెల గాదుటే
    వెల్లువై పొంగ నీ ప్రేమరసము

    అలుక లేలనొ కంసుడు యడగె నాడు
    నెయ్య మందుట దొడరగ గయ్య మేల
    స్నేహశీలత సులభమౌ మోహ మయ్యె
    చెలిమి సేయగ నీ తోడ చిన్ని కృష్ణ

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి వ్రాసిన చంద్రశేఖర్ గారూ,
    ఆటవెలది వంటి గేయాన్ని వ్రాసిన హరి గారూ,
    మత్తేభ వృత్తాన్ని వ్రాసిన మంద పీతాంబర్ గారూ,
    సీస పద్యాన్ని వ్రాసిన గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అందరికీ అభినందనలు.
    బహుశా దత్తపది కొందరికి ప్రథమ ప్రయత్నం కావచ్చు. అందరి పద్యాల్లోను కొన్ని లోపాలున్నాయి. ఒక ముఖ్యమైన ఫంక్షన్ కోసం ఊరికి వెళ్తున్నాను. సమయాభావం వల్ల ప్రస్తుతం విడివిడిగా వ్యాఖ్యానించడం, సవరించడం చేయలేకపోతున్నాను. మన్నించండి. వీలును బట్టి తరువాత వ్యాఖ్యానిస్తాను.

    రిప్లయితొలగించండి
  7. హే భగవాన్ తుమునే క్యా కియా
    హర్ దిలె సే మిలాతే గయా
    సప్న హర్ పర్ దిఖాయా నయా
    మన్ సే ఆశు బహానే దియా

    రిప్లయితొలగించండి
  8. హే భగ వాన్ తుమునె క్యాకియా ?
    హర్ దిలు సే మిలా తేగయా
    సపన హర్ పల్ దిఖాయా నయా
    మన్ సే ఆశు బహానేదియా

    క్షమించాలి . అక్షర దోషములు ఉన్నందున మళ్ళీ వ్రాసాను.

    రిప్లయితొలగించండి
  9. వినయాంభోధి .తరంగ శీకరములావేశించి హృద్వీధిలో
    వనమాలాంకిత వేంకటేశునికి యావచ్ఛక్తి సంప్రీతి పూ
    జనముల్ సేయుచు చందనమ్మలది యా సన్మంగళాకారు నే
    ననయంబున్ స్తుతియింతు నిక్కముగ !యాజ్యుండాతడీ ధాత్రిపై!!!!

    రిప్లయితొలగించండి
  10. వినయాంభోధి తరంగ శీకరములావేశించి హృద్వీధిలో
    వనమాలాంకిత వేంకటేశునికి యావచ్ఛక్తి సంప్రీతి పూ
    జనముల్ సేయుచు చందనమ్మలది యా సన్మంగళాకారు నే
    ననయంబున్ స్తుతియింతు నిక్కముగ !యాజ్యంబౌను తల్లీలలున్ !!!!
    -----------------------------------

    రిప్లయితొలగించండి