15, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 124

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
భార్య లిద్దరు శ్రీరామభద్రునకును.

14 కామెంట్‌లు:

  1. నమస్కారమండీ, నా పూరణ :

    అవనిరమణుడు శ్రీరాము డడవి కేగ
    అవని తనయను రావణు డపహరించె
    ఇద్ద రతివల విరహత నొద్ది కయ్యె
    భార్య లిద్దరు శ్రీరామ భద్రునకును

    శంకరయ్య మాస్టారు గారికి, మిత్రులందఱికీ విజయదశమి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. కైక పంపించె రాముని కానలకును
    మిగుల పొగిలిరి దశరధు మిగిలినట్టి
    భార్య లిద్దరు, శ్రీరామ భద్రునకును
    మాత్ర మమిత భక్తి మువురు మాతలందు.

    రిప్లయితొలగించండి
  3. నరసింహ మూర్తిగారూ! కృత"ఙ్ఞ"తలు. నేర్చుకున్నాను.
    గురువుగారికి కూడా నమస్కారాలు.

    రిప్లయితొలగించండి
  4. ఇడుము లనెడము జేయువాడిన కులేషు
    డొక్క డేయని దలపోసి మ్రొక్కి నారు
    ప్రభువు దక్కగా, చిక్కగా, ప్రభువు దేవు
    భార్య లిద్దరు, శ్రీ రామ భద్రునకును !

    రిప్లయితొలగించండి
  5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    రాముణ్ణి భూపతి, సీతాపతిగా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    ఏమని వ్యాఖ్యానించను? మీ పూరణ అత్యద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    మంద పీతాంబర్ గారూ,
    పద్యం నిర్దోషంగా ధారాశుధి కలిగి చక్కగా ఉంది. అభినందనలు.
    కాని భావం కొద్దిగా ఇబ్బంది పెడుతున్నది.
    "ప్రభువు దక్కగా, చిక్కగా, ప్రభువు దేవు భార్య లిద్దరు" ఇది అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
    ప్రఖ్యాత డ్యాన్సు మాస్టరు మరియు నటుడు కూడ అయిన
    భార్య రమా దేవి (పూర్వము ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ,పిల్లలు కుడా కలరట)
    ఉండగా యీ మద్య సినీ నటి, నయన తారను పెళ్లి చేసుకున్నట్లు కేసు
    కోర్టు వరకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి .పాత భార్య రమా దేవి ప్రభువు(భర్త)
    తనకే దక్కాలని ,కొత్త భార్య నయన తార ప్రభువు తనకే చిక్కాలని
    ప్రభు దేవ భార్యలిద్దరూ రామ భద్రున్ని వేడున్నారని ఊహించి పూరించాను.
    పూరణ బాగున్నందుకు సంతోషం .
    .

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ మీ ప్రశంసను వినమ్రతతో స్వీకరిస్తున్నాను.కృతఙ్ఞుణ్ణి.

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    మీరు సమస్య భావాన్ని చక్కగా ఒడిసి పట్టారు. నేను సమస్య సూచించి నపుడు ఏమి అనుకొన్నానో అది మీ పద్యం లో బంధించేశారు. నా ప్రశంసలు. మీరు ముందుగా వ్రాసి పంపటం వల్ల నేను నా పూరణని మార్చుకోని వేరే పంపుతాను.

    రిప్లయితొలగించండి
  9. మరొక పూరణండీ :

    చాప మెత్తగ సీతను జనకు డిచ్చె.
    విల్లునెత్తని బీరమె పిల్ల నివడె
    జామదగ్నుడు. సీతకు సవతి దప్పె,
    భార్య లిద్దరు, శ్రీరామభద్రునకును

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్నగారూ, గురువర్యులు జ్ఞానానిస్తూంటే, 'జ్ఞ ' లివ్వటానికి నాభ్యంతరం లేదు. మీరు మంచి పూరణలు చేస్తూ వుండండి. పీతాంబర్ గారు పూరణలు చేయడమే గాక మాకు ప్రపంచ జ్ఞానాన్ని కూడా కలుగ చేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. కార్య మేదైన మనరాదు భార్య లేక
    భార్య లిద్దరు గలిగిన భావ్య మౌనె ?
    రామ చంద్రుడు చేయించె పసిడి సీత .
    భార్య లిద్దరు శ్రీరామ భద్రునకును .

    రిప్లయితొలగించండి
  12. రామ పట్టాభిషేకసంరంభ మందు
    తోటి సుగ్రీవు దీటున తోడు గూడ
    హార తిచ్చిరి ఘనరాము నాత్మసఖుని
    భార్య లిద్దరు,శ్రీరామభద్రునకును.
    మనవి: రామ పట్టాభిషేక సమయానికి సుగ్రీవుని భార్యలు ఇద్దరు - తార, రుమ.

    రిప్లయితొలగించండి
  13. రాజేశ్వరి గారు తప్పకుండా లవకుశ సినిమా చాలా సార్లు చూసి వుంటారు. చాలా చక్కటి భావం. ఆడవారికి మన సంకృతి లో ప్రాధాన్యం లేదనే వారికిది చక్కని సమాధానమని చిన్నప్పుడు ఆ ఘట్టం చెబుతూ మా తెలుగు మాష్టారు శ్రీ కంఠ శాస్త్రి గారు అనేవారు. మహానుభావులు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ చంద్రశేఖర్ గారూ, శ్రీ నరసింహ మూర్తి గారూ మీ సహృదయతకు కృతఙ్ఞతలు.

    రిప్లయితొలగించండి