21, అక్టోబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 129

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
గణనాయకు గళమునందు గరళము నిండెన్.

18 కామెంట్‌లు:

  1. ప్రస్తుత రాజకీయాలలో,

    పణముల నిడి పదవులు గొని
    జెణకుల సాధింపఁ బూనఁ జేదయె ప్రజ్ఞల్
    గణరాశులు తను గాదన
    గణనాయకు గళము నందు గరళము నిండెన్

    రిప్లయితొలగించండి
  2. గణతంత్రపు భారతమున
    గణి యింపగ గలరు పెక్కు ,గర్వము మీరన్,
    రణ శూరులు, మును చైనా
    గణ నాయకు గళము నందు గరళము నిండెన్ !
    పని మీద వేములవాడకు వెళుతున్నాను తొందరలో పూరించాను
    జూడగ వేములవాడకు,
    వేడగ నగ రాజ తనయ నాథున్ ప్రీతిన్
    కోడెల రాయని కోరగ
    పాడగ రాజన్న పాట పరవశ మొందన్!

    రిప్లయితొలగించండి
  3. ప్రణమిల్ల సురులు దైత్యులు
    ఫణిపతి హాలాహలంబు పానము జేసెన్
    ప్రణవమున శాంతియు ప్రమథ
    గణనాయకు గళమునందు గరళము నిండెన్
    (ప్రణవము = అక్షరము = సర్వ ప్రపంచము)

    రిప్లయితొలగించండి
  4. మణి శోభిల్లెను గోపీ
    గణనాయకు గళమునందు, గరళము నిండెన్
    గణపతి తండ్రికి, చింతా
    మణి సురపతి కయ్యె సింధు మంధన వేళన్!

    రిప్లయితొలగించండి
  5. ఇప్పుడే వచ్చాను ,దారిలో స్పురించింది మళ్లీ ఓ పూరణ.
    గణపతుల నంప,విద్యుత్
    మణి కాంతుల మధ్య జలము మలినము కాగన్
    ఫణి భూషణు సుతు మనుగగ
    గణ నాయకు గళమునందు గరళము నిండెన్ !
    ( హుస్సేన్ సాగర్ (వినాయక సాగర్) లో ఎవరు మునిగినా అంతే గదా)

    రిప్లయితొలగించండి
  6. గణముల కధిపతి కోరిన
    గణుతించుచు పణము గెలువ గణ్యుడవౌదువ్ !
    ఫణిపతి పలుకులు సోకిన
    గణనాయకు గళమునందు గరళము నిండన్ !

    రిప్లయితొలగించండి
  7. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మంద పీతాంబర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా రెండవ పూరణ అద్భుతం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. నారాయణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    ఈ రోజు వచ్చిన పూరణలలో మీ పద్యం అత్యుత్తమంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. నేదునూరి గాజేశ్వరి గారూ,
    మీ పద్యం నిర్దోషంగా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. వణిజుల వ్యాపారమ్ములు,
    గణనమ్ములు మాని, బందు గావింపు మనన్!
    వణకక, పొమ్మన; రౌడీ
    గణ నాయకు గళమునందు గరళము నిండెన్ !!

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రౌడీ గణనాయకుడు ... బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. తృణమో పణమో ననుచు ల
    వణము కలిపిన జలమునిడ భక్తుడు కరవున్
    గణగణ గంటల తోడన్...
    గణనాయకు గళమునందు గరళము నిండెన్ :)

    రిప్లయితొలగించండి
  15. కం.
    గుణ హీనుడు, నగు దుర్జన
    గణనాయకు గళమునందు గరళము నిండెన్!
    ఫణి కంటెను పాపాత్ముడు
    క్షణికావేశమ్ము, నేర చరితుండతడున్!!

    రిప్లయితొలగించండి
  16. గణగణగంటలుమ్రోగక
    అణువణువుకరోననిండనవనీస్థలిలో
    వణకెడిజనులనుగాంచిన
    గణనాయకుగళమునందుగరళమునిండెన్.

    రిప్లయితొలగించండి