24, అక్టోబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 132

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దైవ మున్నదె సుతునకు తల్లికంటె.

13 కామెంట్‌లు:

 1. మాటలు, పద్యాలు చాలవు. మాతృమూర్తులకు నమస్కారములు.

  ప్రాణ మిచ్చును దనువుకు త్రాణ తిచ్చు
  ప్రోది గూర్చును నుదరము, మేది నందు
  జన్మ నిచ్చును బెంచును శ్రమకు నోర్చు
  దైవ మున్నదె సుతునకు తల్లి కంటె

  రిప్లయితొలగించండి
 2. శ్రీ శంకరయ్య గారికి నమస్కారం. మీ మాతృమూర్తి దివ్య స్మృతికి,
  వెతల నెన్నింటి కోర్చెనో వెలుగు నీయ,
  బ్రతుకు తీపిగా జేసెను భవ్య రీతి,
  ఎల్ల లోకము లందున వెతుక,వేరె
  దైవమున్నదె సుతునకు తల్లి కంటె!

  రిప్లయితొలగించండి
 3. 'మాతృ దేవో భవ'యనెడి మంత్రమదియె
  చాలు వేద శాస్త్రాలవి చదవ నేల
  చెప్పగలగదే పదమైన నింత కన్న
  దైవ మున్నదె సుతునకు తల్లికంటె!

  రిప్లయితొలగించండి
 4. దైవ మున్నదె సుతునకు తల్లి కంటె
  దైవమే లేదు సుతునకు తల్లి దక్క
  దైవ మెంతది సుతునకు తల్లి ముందు
  నిజము ముమ్మాటికిని యిది నిజము నిజము

  రిప్లయితొలగించండి
 5. దైవ మన్నను ప్రత్యక్ష దైవ మేను
  దైవ మేదైన కలదిల నేరి కైన ?
  ప్రాణ మిచ్చును పణముగ ప్రీతి తోడ
  దైవ మున్నదె సుతునకు తల్లి కంటె ?

  రిప్లయితొలగించండి
 6. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ధన్యవాదాలు.
  మీ పద్యంలో "త్రాణతిచ్చు, మేదినందు" ప్రయోగాలు వ్యాకరణ రీత్యా దోషాలు. నా సవరణ .....
  ప్రాణ మిచ్చును దనువుకు త్రాణము నిడు
  ప్రోదు గూర్చును నుదరము భూమిపైన .............

  రిప్లయితొలగించండి
 7. మంద పీతాంబర్ గారూ,
  మంచి భావంతో పద్యాన్ని చెప్పారు. ధన్యవాదాలు.
  మూడవ పాదంలో యతి తప్పించి. దానికి నా సవరణ .........
  "అన్ని లోకమ్ము లందున నరయ వేఱె"

  రిప్లయితొలగించండి
 8. చంద్రశేఖర్ గారూ,
  నిర్దోషంగా చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. మిస్సన్న గారూ,
  పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. నేదునూరి రాజేశ్వరి గారూ,
  మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
  కాని రెండవ, మూడవ పాదాలలో యతిదోషం ఉంది. నా సవరణతో మీ పద్యం ....
  దైవ మన్నను ప్రత్యక్ష దైవమె కద
  దైవ మేది యెవ్వరికైన ధరణిపైన
  ప్రాణమును ప్రీతితో బెట్టు పణముగాను
  దైవ మున్నదె సుతునకు తల్లి కంటె.

  రిప్లయితొలగించండి
 11. నెలత - నెల తప్పి తొమ్మిది నెలలు మోసి
  రక్త మాంసమ్ములను పంచి రక్ష సేసి
  పాప గాపాడు తన కనుపాప వోలె!!!
  దైవమున్నదె సుతునకు తల్లి కంటె?

  రిప్లయితొలగించండి
 12. దైవ మన్నది కనరాదు దేవులాడ,
  దేవు డిచ్చెను మనిషికి దేహి యన, య
  దే వరము తల్లి, వలదు సందేహ మనియె;
  దైవమున్నదె సుతునకు తల్లి కంటె?

  రిప్లయితొలగించండి
 13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి