ధీరుల దరిన జేరిన ,తీరు టెట్లు కలలు? కడుపు నిండదు,కాసు లేల రాలు? నీతి విలువలు దిగజారె ! రీతి మారె! జార చోరుల కీర్తించు వారె ఘనులు! (ముందు పోస్ట్ జేసినదానిలో మూడవ పాదము టైపు చేయడములో పొరపాటు జరిగి నట్లుంది సరి చేసి మళ్లీ పోస్ట్ చేస్తున్నాను.)
మంద పీతాంబర్ గారూ, సవరించిన తర్వాత మీ పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. ఇక రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
మిస్సన్న గారూ, ఉత్తమమైన పూరణ. అభినందనలు.
నచికేత్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో "సొంత ప్రచార" అన్నచోట గణదోషం ఉంది. "సొంతపు ప్రచార" అంటే సరిపోతుంది.
లక్కాకుల వెంకట రాజారావు గారూ, అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, సవరించాక మీ పద్యం ఆణిముత్య మయింది. చాలా బాగుంది. అభినందనలు.
నారాయణ గారూ, మీ శ్రమ ఫలించింది. పద్యం నిర్దోషంగా ఉంది. అభినందనలు. ఇక మీ సందేహానికి సమాధానం .... అక్కడ ప్రాసయతి ఉంది. ప్రాసలో హల్లు ప్రధానం. అచ్చు ఏదైనా ఉండవచ్చు.
నేదునూరి రాజేశ్వరి గారూ, చక్కని బావంతో మంచి పద్యం చెప్పారు. అభినందనలు. అయితే రెండవ పాదంలో యతి తప్పింది. "పాప పుణ్యము లనుమాట పట్ట దిపుడు" అంటే సరిపోతుంది.
ధీరుల దరిన జేరిన ,తీరు టెట్లు
రిప్లయితొలగించండికలలు? కడుపు నిండదు,కాసు లేల రాలు?
నీతి విలువలు దిగజారే ! రీతి మారే!
జార చోరుల కీర్తించు వారె ఘనులు!
ధీరుల దరిన జేరిన ,తీరు టెట్లు
రిప్లయితొలగించండికలలు? కడుపు నిండదు,కాసు లేల రాలు?
నీతి విలువలు దిగజారె ! రీతి మారె!
జార చోరుల కీర్తించు వారె ఘనులు!
(ముందు పోస్ట్ జేసినదానిలో మూడవ పాదము టైపు చేయడములో
పొరపాటు జరిగి నట్లుంది సరి చేసి మళ్లీ పోస్ట్ చేస్తున్నాను.)
గోప బాలురతో గూడి కొల్లగొట్ట
రిప్లయితొలగించండిచిన్ని కన్నయ్య సర్వము, చిత్త మంత-
జార, చోరులఁ గీర్తించువారె! ఘనులు
గోప కన్నెలు పున్నెము గొప్పదగుట!
చోరులధికార పీఠంబు కూరుచుండ
రిప్లయితొలగించండివంది మాగధుల్ పదవులన్ పంచుకొనగ
సొంత ప్రచార సాధనాల్ వంత పాడ
జార చోరులఁ గీర్తించువారె ఘనులు!!
ఏర ! బల భద్ర ! కృష్ణయ్య ! యెటకు బోతి
రిప్లయితొలగించండిరనుచు నా యశోద వెదుక నదిగొ వచ్చె
పెరుగు వెన్నలు పాలు వాతెరల నుండి
జార - చోరుల గీర్తించు వారె ఘనులు
వెంకట రాజా రావు . లక్కాకుల
బ్లాగు టైటల్ :సుజన-సృజన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపంపిన పద్యములో ప్రాస యతి ( మూడవ పాదములో సరిపోదు. సవరించి వ్రాసాను )
రిప్లయితొలగించండివెన్నరాశులు మ్రుచ్చిలు వెన్నుడొకని
గొల్ల నెలతలఁ గ్రీడించు గొల్లడొకని
ప్రస్తుతింపగ వచ్చెనె భాగవతము
జార చోరులఁ గీర్తించు వారె ఘనులు .
గిరిని కొనగోట నిలిపిన హరిని గనిరి,
రిప్లయితొలగించండిఉల్లముల నెత్తుకెళ్ళిన గొల్లడనిరి,
వెన్నదొంగని బిలిచిరి చిన్నజేసి,
జారచోరుల కీర్తించువారె ఘనులు!
చాలా చక్కని పూరణలు! వీటిముందు నా పూరణ ఏపాటిది?
రిప్లయితొలగించండిఅయినా, ఏదో శ్రమపడి పూరించాను గనుక- పంపుతున్నాను..
చెలువమున పదహారువేఁజెలువల జత
గూడి అప్పడతుల మది గోర్కె మీర
బొడచె గద, హరి? యా గొంతెపుదొరవంటి
జారచోరుల గీర్తించువారె ఘనులు.
శంకరయ్యగారూ, చిన్న అనుమానం.. జా-వా లకు యతి సరిపోతుందా? లేక ర-రె లకు ప్రాసయతి కూడుతున్నదా, ఇక్కడ?
రిప్లయితొలగించండినీతి నియమము కనుగొన నెలవు లేదు
రిప్లయితొలగించండిపాప పుణ్యము లనుమాట మరచి రంత
జాలి కరుణలు కనుపించు జాడ లేదు
జార చోరుల గీర్తించు వారె ఘనులు.
వెన్నరాశులు సమాసము సరి కాక పోవచ్చును
రిప్లయితొలగించండివెన్న,పెరుగులు మ్రుచ్చిలు వెన్నుడొకని
గొల్ల నెలతలఁ గ్రీడించు గొల్లడొకని
ప్రస్తుతింపగ వచ్చెనె భాగవతము
జార చోరులఁ గీర్తించు వారె ఘనులు.
ఈ దినము కృష్ణుణ్ణి తెగ తలచుకొన్నాము, మనకందఱికీ పుణ్యమే. శంకరయ్య మాస్టారుగారి సలహాలకు సదా కృతజ్ఞుణ్ణి.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిసవరించిన తర్వాత మీ పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. ఇక రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.
నచికేత్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో "సొంత ప్రచార" అన్నచోట గణదోషం ఉంది.
"సొంతపు ప్రచార" అంటే సరిపోతుంది.
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
సవరించాక మీ పద్యం ఆణిముత్య మయింది. చాలా బాగుంది. అభినందనలు.
నారాయణ గారూ,
మీ శ్రమ ఫలించింది. పద్యం నిర్దోషంగా ఉంది. అభినందనలు.
ఇక మీ సందేహానికి సమాధానం ....
అక్కడ ప్రాసయతి ఉంది. ప్రాసలో హల్లు ప్రధానం. అచ్చు ఏదైనా ఉండవచ్చు.
నేదునూరి రాజేశ్వరి గారూ,
చక్కని బావంతో మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
అయితే రెండవ పాదంలో యతి తప్పింది.
"పాప పుణ్యము లనుమాట పట్ట దిపుడు" అంటే సరిపోతుంది.
తస్కరుండా శివుడు దోచు తమము నీదు
రిప్లయితొలగించండిజారుడా గోపి చెరచు నజ్ఞాన బంధ
నములు, నయముగ కడదాక నట్టి శ్రేష్ఠ
జార చోరులఁ గీర్తించువారె ఘనులు.