నారాయణ గారూ, సీత శబ్దానికి ఉన్న నానార్థాలను చక్కగా వినియోగించుకొని సమస్య పూరించారు. బాగుంది. అభినందనలు. "వీథి"తరువాత అరసున్నా పెట్టారు కనుక "కలహము" గలహము అవుతుంది కదా.
రవి గారూ, పద్యం ధారాశుద్ధితో బాగుంది. అభినందనలు. మీరు "సీత" శబ్దనికి హల మనే అర్థాన్ని తీసుకున్నారా? ఆ శబ్దానికి "నాగటి చాలు" అనే అర్థం ఉంది. నాగలి అనే అర్థం లేదు.
కలికాలపు దాపున రో-
రిప్లయితొలగించండికలిగొని యాదవులు వీధిఁ కలహములాడన్
వెలివచ్చి చూసి, నిలుపక
బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.
('సీత'= సారాయి, మద్యము)
(యాదవ వంశ నాశనం జరుగుతున్నప్పుడు బలరామదేవుడు ఏంచేస్తున్నాడో తెలియదు.. కోపం తెచ్చుకొని, గొడవలను ఆపవలసిన సమయంలో ఆ నాయకుడే మద్యాన్ని చూసి నవ్వాడన్నది నా ఊహ..విలువలు క్షీణించటానికి ప్రతీక.)
తుల నాడిన వాడిని గని,
రిప్లయితొలగించండితల నంటెను చెప్పు తోడ తలవాయ,భద్రా
చలమున నవమిన నేటిస
బల!రాముడు సీత జూసి ఫక్కున నవ్వెన్!
"హలమా! వ్యవసాయముకై
రిప్లయితొలగించండిపొలమును దున్నకను, నాదు భుజమున తిరమై
నిలచితివేమ"ను తలపున
బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.
నారాయణ గారూ,
రిప్లయితొలగించండిసీత శబ్దానికి ఉన్న నానార్థాలను చక్కగా వినియోగించుకొని సమస్య పూరించారు. బాగుంది. అభినందనలు.
"వీథి"తరువాత అరసున్నా పెట్టారు కనుక "కలహము" గలహము అవుతుంది కదా.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిచక్కని చమత్కారంతో సమస్యను పూరించారు. అభినందనలు.
"తలవాయ భద్రా" అన్న చోట గణదోషం ఉంది. దానిని "తడయక భద్రా" అంటే సరిపోతుంది.
రవి గారూ,
రిప్లయితొలగించండిపద్యం ధారాశుద్ధితో బాగుంది. అభినందనలు.
మీరు "సీత" శబ్దనికి హల మనే అర్థాన్ని తీసుకున్నారా? ఆ శబ్దానికి "నాగటి చాలు" అనే అర్థం ఉంది. నాగలి అనే అర్థం లేదు.
నమస్కారమండీ, నా పూరణ :
రిప్లయితొలగించండిఇలలోన నొక్క సతి యని
వెలయంగా వ్రతము సలుపు విభుఁడును బిదపన్
పలుమాఱు పెండ్లి యాడఁగ
బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్
కలియుగ మునపలు సీతలు
రిప్లయితొలగించండివెలయంగా వేచి రంత విభవము తోడన్
కలవర పడికలలు గనిన
బలరాముడు సీత జూచి ఫక్కున నవ్వెన్ !
తలచుచు మది గాధేయుడు,
రిప్లయితొలగించండిబల యతిబల విద్యల గొన్న భరతాగ్రజుడే
వలపుల నిన్నుగెలుచు నీ
బల రాముఁడు, సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.
విలవిల లాడుచు రక్కసి
రిప్లయితొలగించండివిలపించుచు పారిపోవ విచలిత యయ్యెన్
యిలసుత! మ్రాన్పడి పోయె న-
బల! రాముడు సీత జూచి ఫక్కున నవ్వెన్.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం నిర్దోషంగా ఉంది. అభినందనలు.
నేదునూరి రాజేశ్వరి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
పూరణ చాలా బాగుంది. అభినందనలు.
"విద్యల్ గొన్న" అన్నచోట గణదోషం ఉంది. "విద్యల గొని/విద్యల గొను" అంటే సరిపోతుంది.
మిస్సన్న గారూ,
మీ పూరణ అద్భుతం. ధన్యవాదాలు.
అల - రావణ వధ పిమ్మట
రిప్లయితొలగించండిచలద్విమానాధిరోహ సంభ్రమమున మి
న్నుల - కపి కోలాహలము ప్ర
బల, రాముడు సీత జూచి ఫక్కున నవ్వెన్!
అల కృష్ణు కన్న యెవ్వరు ?
రిప్లయితొలగించండికల ఫలితము నెవరి జూచి కదిపెను త్రిజటే ?
చెలి చక్కలి గిలి కేమనె ?
బలరాముడు - సీతజూచి - ఫక్కున నవ్వెన్ !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రశ్నోత్తర రూప పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
నలుబది లక్షల కోతుల
రిప్లయితొలగించండిగలగల కిచకిచల నామె కలవర పడగా
వలపులు మీరంగ మహా
బల రాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొలనుకు గట్టున కూర్చొని
రిప్లయితొలగించండికలవరపడ జానకమ్మ కప్ప దుముకగన్
జలమున పడి నీదెడి బహు
బల రాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్