7, అక్టోబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 117

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!
( దీనిని పంపించిన నచికేత్ గారికి ధన్యవాదాలు )

10 కామెంట్‌లు:

  1. జాదిలి యాటల మాదిరి
    ఖేదము నటియిం చువాని కిదియవ సరమా?
    భేదమ డగంగ నేలా
    ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!
    సూచన: జాదిలి=గారడివాడు

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు, నా పూరణ

    గోదావరి జలములలో
    పో దారిని పట్టినతని పోయిన జాడల్
    కాదనక చూచి రమ్మన
    ఓదార్పులు సేయు వావి కోరిమి లేదే

    రిప్లయితొలగించండి
  3. ఓదార్చెద నేనంచును
    ఓదారుపు యాత్ర చేయ నొక్కడు వెడలెన్
    'ఓదార్పు' పదవి కైనను
    ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!

    రిప్లయితొలగించండి
  4. ఆదా సేయగ కావలె
    ఆదాయపు వనరులు పలు ,అంధుడు ఏలా
    ఆధారము లేక నడుచు
    ఓదార్పులు సేయువాని కోరిమి లేదే !

    రిప్లయితొలగించండి
  5. ఓదార్పను నాటకమును
    తాదలచిన పదవినొంద తలపెట్టె జగన్
    కాదది పదవికి నిచ్చెన
    ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!

    రిప్లయితొలగించండి
  6. రాదారి పోవువానిని
    నాదారికి రమ్మటంచు నయముగపిలువన్
    నీ దారి నాకు పొసగదు
    ఓదార్పులుసేయు వాని కోరిమి లేదే ?

    రిప్లయితొలగించండి
  7. చంద్రశేఖర్ గారూ,
    నరసింహ మూర్తి గారూ,
    హరి గారూ,
    పీతాంబర్ గారూ,
    నచికేత్ గారూ,
    రాజేశ్వరి గారూ,
    అందరి పూరణలు నిర్దోషంగా, బాగున్నాయి. నేను సవరించదగ్గ పొరపాట్లు ఎవరూ చేయలేదు. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. "నాదీ గుఱ్ఱమ్మోడెన్!
    నాదీ ప్రేయసి పరారు! నా భార్య కనెన్!"...
    రోదన విని విని విని విని...
    ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!

    రిప్లయితొలగించండి
  9. వేదాయపాలె పెన్నిక
    బీదాడయి నోడి నేడ్వ బిందెల తోడన్
    గోదారి కళ్ళ నీటిని
    నోదార్పులు సేయువాని కోరిమి లేదే! :)

    రిప్లయితొలగించండి