6, అక్టోబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 116

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ఱ గదా !
( దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు )

15 కామెంట్‌లు:

  1. చంద్ర శేఖర్ గారు ! ముందు నేనే ఫెయల్ అయ్యాను. 3,పాదాలు .తప్పు రాసి.పొన్లెండి పునాది గట్టి పడుతుంది.

    రిప్లయితొలగించండి
  2. కానము గద ఎందైనను
    కనుబొమలకు మీసములన, కన్నెర్రగ దా
    వనరుచు, బొమ్మను విసిరెను
    తనయుని దుందుడుకుతనము తండ్రిని వేచన్.
    వనరుచు=ఏడుస్తూ, వేచుట=వేధించుట, బాధ పెట్టుట.

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు, నా పూరణ :

    శరము లందుట జిక్కిన జాగిలమును
    గనుచు సంభ్రమ మొందెను గవ్వ డపుడు
    ఏకలవ్యుని గాంచగ నీర్ష్య గలిగె
    కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ర గదా

    రిప్లయితొలగించండి
  4. కనుబొమలు పుట్టు ముందుగ
    వెనుకన మీసములు వచ్చు పెదవుల మీదన్
    చనువున మీసము నిమురగ
    కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ఱ గదా!

    రిప్లయితొలగించండి
  5. విను ముందుండిన చెవులకు
    వెనుక దిగిన కొమ్ములనిన వెలపరమెట్లో
    తన యునికి మసకబారుట
    కనుబొమలకు మీసములన కన్నెర్ర గదా

    విను వృద్ధ రాజకీయులు
    మనుగడపై భీతితోడ మననీయరు బా-
    బూ! నవయువ నేతృత్వము
    కనుబొమలకు మీసములన కన్నెర్ర గదా!

    రిప్లయితొలగించండి
  6. శంకరయ్య మాస్టారుకి క్షమాపణలు. మా తెలుగు మాస్టారు శ్రీ పేరి కామేశ్వర శర్మ గారయితే "ఒరే గన్నవరపూ యిలా రా అని ఒక మొట్టికాయ యిచ్చే వారు. రాత్రి నిద్ర మత్తులో సమస్య చూసాను. కందమనే అనుకొన్నాను. ఉదయం నిద్రమత్తులోనే ఏకలవ్యుని ఆలోచిస్తూ మూడు తేటగీతి పదాలు వ్రాసి తొందఱగా వ్రాసి పనికి పరుగెట్టా. తర్వాత తప్పు తెలుసుకొన్నాను. ఆదే కందములో వ్రాసి పంపిస్తున్నా. ఈ పొరబాటు చేయ కుండా ఉండాలంటే ఒకటే బండ గుర్తు. గురువుతో అంతమయితే అది కందము కావచ్చు. తేటగీతి ఆటవెలదులు లఘువుతో అంతమవుతాయి.
    నా పూరణ:

    ఘను డేకలవ్యు డేయగ
    శునకముపై శరము లొప్ప సురపతి సుతుడున్
    గని నొందె నసూయ మిగుల
    కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ర గదా !

    రిప్లయితొలగించండి
  7. కనుబొమకు లేదు రోషము -
    కనులే దుష్కృత్యము గన, కదలక నిలుచున్!
    మను రోషముతో మీసము -
    కనుబొమలకు మీసములన కన్నెర్ర గదా !

    రిప్లయితొలగించండి
  8. గొన సంపగి పూనూనియ
    లను మీసాలకు, యకరములమ్మిన యాసా
    మినిజూడన్నా పైగల
    కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ఱ గదా !

    సామెత: "మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె" అందరికి తెలిసిందేగా.

    రిప్లయితొలగించండి
  9. మరో పూరణండీ :

    అనుభవమే మనకెప్పుడు
    తన నెప్పుడు తరుగ కుండ తనివిన జూచిన్
    ఘన సుందరితో నెదురుగ
    గను బొమలను మీ సములనఁ గన్నెఱ్ర గదా !

    రిప్లయితొలగించండి
  10. మరొక పూరణ:
    తనరచె ప్రౌఢలు పెళ్ళికి
    ఘనభ్రూవుల తీర్చిదిద్ది గన నందరునా
    నునుమీసముల( మెచ్చిరహో
    కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ఱ గదా !
    సూచన: భ్రూవు=కనుబొమ; తనరచె = అతిశయముతో

    రిప్లయితొలగించండి
  11. కనుమిది నతివకు మీసములన
    వినినంతనె తరచి తెలియ వింతగ దోచున్
    కన్నది విన్నది నిజమని
    కనుబొమలకు మీసములన గన్నెఱ్ఱ గదా ?

    రిప్లయితొలగించండి
  12. నారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ అభినందనలు.

    నరసింహ మూర్తి గారూ,
    సమస్య పాదాన్ని కొద్దిగా మారిస్తే అది పూర్తిగా తేటగీతి అవుతున్నది.
    "కనుబొమలకు మీసములనఁ గన్ను లెఱ్ఱ"
    కవ్వడి + అపుడు = కవ్వడపుడు ఇక్కడ సంధి జరుగదు. యడాగమం వస్తుంది.
    "కవ్వడి యపు
    డేకలవ్యుని ...." అంటే సరిపోతుంది.
    మీ కంద పద్యం నిర్దోషంగా బాగుంది. అభినందనలు.

    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    అద్భుతమైన పూరణతో అలరించారు. ధన్యవాదాలు.

    చంద్రశేఖర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.

    రాజేశ్వరి గారూ,
    మొదటి పాదంలో గణదోషం ఉంది.
    "కన నతివకు మీసము లన"
    అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  13. పెనిమిటికి రాణి మగనికి
    చను పాలకు డబ్బపాలు సరిపో గలవా
    ఇనుమునకు కనక పూసలు
    కను బొమలకు మీసము గన్నెర్ర గదా.

    రిప్లయితొలగించండి
  14. మనలను త్రిప్పరు నెవ్వరు
    ఘనముగ గొరుగరుగ రోజు గంటలు గంటల్
    మనలను ముద్దిడ రనుచున్
    కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ఱ గదా ! 

    రిప్లయితొలగించండి
  15. అనువుగ త్రిప్పుట కుండక
    కనకనె ముద్దులు పెదవిని కన్నియ లొల్లన్
    కినుకను గొరుగుట కొప్పక
    కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ఱ గదా!

    రిప్లయితొలగించండి