31, అక్టోబర్ 2010, ఆదివారం

ప్రహేళిక - 22

ఎవరీ వ్యక్తి?
ఈనాటి ప్రహేళికను పంపించిన వారు మంద పీతాంబర్ గారు. వారికి ధన్యవాదాలు.
సీ.
ఫల్గుణుని ధ్వజముపై నుండు నేరాజు?
పోతన రాజైన ఖ్యాతి యేది?
విద్యతో పాటేది విధిగ నుండవలెను?
సరస మాడెడివాని సంజ్ఞ యేది?
స్తంభోద్భవుండైన శౌరి రూపం బేది?
అన్ని ప్రాణుల కేది యవసరమ్ము?
అలసిన డెందము లానందపడు నెట?
శాంతి చిహ్నఁపు పక్షి జాడ యేది?
తే.గీ.
నాలు గక్షరమ్ముల పద నర్తనమున
క్రమముగా ద్వితీయాక్షర గతిని గనిన
తెలుగు నామమ్ము ఢిల్లీకి తేజ మొసఁగ
ముఖ్యమంత్రి, ప్రధానియౌ ముఖ్యుఁ డెవఁడు?
ఆ ముఖ్యుడైన వ్యక్తి ఎవరో చెప్పండి.

10 కామెంట్‌లు:

  1. ఫల్గుణుని ధ్వజముపై నుండు నేరాజు? -కపిరాజు
    పోతన రాజైన ఖ్యాతి యేది? - కవిరాజు
    విద్యతో పాటేది విధిగ నుండవలెను? - వినయము
    సరస మాడెడివాని సంజ్ఞ యేది? - సరసోక్తి(?)
    స్తంభోద్భవుండైన శౌరి రూపం బేది? - నరసింహ
    అన్ని ప్రాణుల కేది యవసరమ్ము? - ఆహారము
    అలసిన డెందము లానందపడు నెట? - విరామము(?)
    శాంతి చిహ్నఁపు పక్షి జాడ యేది? - పావురము

    నాలు గక్షరమ్ముల పద నర్తనమున
    క్రమముగా ద్వితీయాక్షర గతిని గనిన
    తెలుగు నామమ్ము ఢిల్లీకి తేజ మొసఁగ
    ముఖ్యమంత్రి, ప్రధానియౌ ముఖ్యుఁ డెవఁడు? - పి.వి.నరసింహారావు.

    రిప్లయితొలగించండి
  2. కపిరాజు, కవిరాజు,వినయము,(?)తురగము, నృసింహుడు, ఆహారము, విరామము, పావురము

    పి.వి.నరసింహా రావు గారు

    రిప్లయితొలగించండి
  3. శ్రీ పివినరసిం హరావు గారు
    కవిత్వము,కపిరాజు, వినయము ,?నృసిం హము,?,?,పావురము

    రిప్లయితొలగించండి
  4. శ్రీ పి.వి. నరసిం హారావు గారు
    కపిరాజు
    కవిత్వము
    వినయము
    ?
    నృసిం హము
    ఆహారము
    విరామము
    పావురము

    రిప్లయితొలగించండి
  5. శ్రీ పి.వి. నరసిం హారావు గారు
    కపిరాజు
    కవిత్వము
    వినయము
    ?
    నృసిం హము
    ఆహారము
    విరామము
    పావురము

    రిప్లయితొలగించండి
  6. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంఆదివారం, అక్టోబర్ 31, 2010 8:49:00 AM

    పి. వి. నరసింహా రావు
    (కపిరాజు, ?, వినయము, సరసుడు, నృసింహుడు, ఆహారము, విరామము, పావురము)
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  7. కపిరాజు, కవిరాజు, వినయము, సరసము, నృసింహము, ఆహారము, విరామము, పావురము = పి వి నరసింహారావు

    రిప్లయితొలగించండి
  8. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంత్రిప్రెగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    మందాకిని గారూ,
    మీ అందరి సమాధానాలు స్థూలంగా కరెక్టే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మైథిలీరాం గారూ,
    అనఘ గారూ,
    "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.
    మీ సమాధానాలు స్థూలంగా కరెక్టే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. కపిరాజు; కవిరాజు; వినయము; సరసత; నృసింహము; ఆహారము; విరామము; పావురము.
    సమాధానము:పి-వి-న-ర-సిం-హా-రా-వు.

    రిప్లయితొలగించండి