గన్నవరపు నరసింహ మూర్తి గారూ, హరి గారూ, మంద పీతాంబర్ గారూ, అభినందనలు. ముగ్గురి పూరణలు నిర్దోషంగా, ఒకదానిని మించి ఒకటి అద్భుతంగా, ఉత్తమంగ ఉన్నాయి. ఈ సమస్యను పంపిన "హరి దోర్నాల" గారికి సంతృప్తి కలిగిందనుకుంటాను.
గన్నవరపు నరసింహ మూర్తి గారు, నేదునూరి రాజేశ్వరి గారు "ద-ధ"ప్రాస వేసారు. కొన్ని పూర్వకవుల ప్రయోగాలున్న మాట నిజమే కాని "ద-ధ"లకు ప్రాసమైత్రి కల్పించకుంటేనే మంచిది.
"వేధించకు నను సామీ
రిప్లయితొలగించండిఈ దాతలు పెరిగి రిపుడు యిధ్ధర యందున్ "
ఆ దారి భిక్షుకుండనె
ఆదాయపు పన్ను గట్టె నచ్చెరు వొందన్
ఓదార్పు యాత్రలనుచును
రిప్లయితొలగించండిగోదాలో దిగిన జగను కొంపల పైనన్
సోదా జరుగునని తలచి
ఆదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్.
పాదాలు లేక పరుగులు
రిప్లయితొలగించండిరాదారుల యందు ఏల రాజకుమారా
ఏదారిన పరుగిడెనో
ఆదాయపు పన్ను గట్టె అచ్చెరు వొందన్ !
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిహరి గారూ,
మంద పీతాంబర్ గారూ,
అభినందనలు. ముగ్గురి పూరణలు నిర్దోషంగా, ఒకదానిని మించి ఒకటి అద్భుతంగా, ఉత్తమంగ ఉన్నాయి. ఈ సమస్యను పంపిన "హరి దోర్నాల" గారికి సంతృప్తి కలిగిందనుకుంటాను.
ఏదో కలగన్నట్లా
రిప్లయితొలగించండిమైదన నల్లధనము తెలుపై మరపించెన్,
హ్లాదము చెందుచు నందరు
నాదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్.
ఇంకో పూరణ:
కాదా సామెత యన్నటు
జూదరులటు లెల్లనూళ్ళు జోడుగ సరద
న్నా దాదాలందరు నా
నాదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్.
సూచన: సరదు=పంచుకొను
ఏదో దారిని దోచిన
రిప్లయితొలగించండిరాదారిని వీడి ఇటుల రాసులు పేర్చన్ !
సాధారణ మని ధీమగ
ఆదాయపు పన్ను గట్టె నచ్చెరు వొందెన్ !
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
రాజేశ్వరి గారూ,
పూరణ నిర్దోషంగా బాగుంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారు, నేదునూరి రాజేశ్వరి గారు "ద-ధ"ప్రాస వేసారు. కొన్ని పూర్వకవుల ప్రయోగాలున్న మాట నిజమే కాని "ద-ధ"లకు ప్రాసమైత్రి కల్పించకుంటేనే మంచిది.
ఆ దామోదర మోడియు
రిప్లయితొలగించండిబాధా కరముగను నోట్లు బందుగ జేయన్
గోదావరి భూస్వామియు
ఆదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్
కాదరు వల్లీ స్మగులరు
రిప్లయితొలగించండిరోదించుచు జైలు జేరి రొప్పుచు కడకున్
బాదర బందియు తీర్చగ
నాదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్