విషయ వాసనలను విడువక పొగచూరె మనసు పొరలు, హనుమ నడిగి రామ రసముదెచ్చి దాని రయమునబలుమార్లు దోమ కేమి తెలియు (తెలుసు) రామభక్తి? (దోమక + ఏమి=దోమకేమి) మనవి: "అగ్ని తోడ...", "...రామభక్తి" రెండు పూరణలు శ్రీ రామాయణాంతర్గతము గా పూర్తి చేయటం తృప్తి గా వుంది. అయోధ్య తీర్పు సమయం కూడా దానికి బలం చేకూర్చింది.
మక్షికముల గూడి మతము బెట్టె - మీ సవరణ బాగుంది. ఖండాంతరము, దేశాంతరము అయిపోయాము. లేకపోతే, నేనూ చంద్రశేఖర్ గారూ, తెలుగు యాంకీ గారూ ప్రతి ఆదివారం మీ ఇంటి మీద వాలి శిష్యరికము చేసి యెన్నో నేర్చుకొనేవారము. ఇప్పుడు కూడా యిది అదృష్టముగానే భావిస్తాము.
చంద్రశేఖర్ గారూ, మీ పూరణ అద్భుతంగా ఉంది. తెలుగులో చెప్తున్నప్పుడు ఇంగ్లీషు పదాలను ఉపయోగించడం నాకు ఇష్టం ఉండదు. కాని ఇప్పుడు తప్పలేదు. "హాట్స్ ఆఫ్ టు యు!"
శంకరయ్యగారూ నమస్కారము. నా పూరణ :
రిప్లయితొలగించండిభక్తి లేక ప్రజలు భజన లెన్నియొ చేసి
రక్తి నెంతయొ పొంద రామ రామ
భక్తి లేని ప్రజల రక్తంబు దా గ్రోలు
దోమ కేమి తెలుసు రామ భక్తి !
నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండినే నూహించిన విధంగానే పూరించారు. బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో "రక్తి నెంతయొ" అనే కంటె "రక్తి నెంతొ" అంటే గణాలు సరిపోతాయి.
లేడు రాముడసలు కాడు దైవంబంచు
రిప్లయితొలగించండికాకి గోల చేయు కాపురుషుడు
భారతీయ తత్త్వ మెరుగునే యల్పుడు
దోమ కేమి తెలుసు రామ భక్తి
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఉదాత్తమైన భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
మూడవ పాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసాక్షరానికి ముందు గురువుంటే ప్రాసయతి స్థానంలోను గురువే ఉండాలి.
ఆ పాదాన్ని ఇల సవరించాను.
"భారతీయ తత్త్వ పథ మెఱుంగని కొంచె"
(కొంచె = మూర్ఖుడు)
రామ నవమి నాటి రాత్రి భజన సేయ
రిప్లయితొలగించండిమంది గూడిరంట మందిరాన
పులులవోలె దూకెను పులీగలొకకోటి
దోమకేమి తెలుసు రామ భక్తి?
గమనిక: రాయలసీమ మాండలికంలో పులీగలు=దోమలు.
నమస్కారము ,మరో పూరణండీ :
రిప్లయితొలగించండిమనిషి కంటె ముందు మహిలోన దానుండి
మక్షికమ్ము గూడి మతము బెట్టె
మనుజ వైరముండి మసలును భువిలోన
దోమ కేమి తెలుసు రామ భక్తి
నారాయణ గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. కాని మూడవ పాదంలో యతి తప్పింది. ఒకసారి మళ్ళీ చూడండి. మీరు సవరిస్తే సరి. లేకుంటే రేపు ఉదయం నేను సవరిస్తాను.
నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది. అభినందనలు.
"మక్షికమ్ము" అనే కంటే "మక్షికములు" అంటే బాగుంటుందేమో?
విషయ వాసనలను విడువక పొగచూరె
రిప్లయితొలగించండిమనసు పొరలు, హనుమ నడిగి రామ
రసముదెచ్చి దాని రయమునబలుమార్లు
దోమ కేమి తెలియు (తెలుసు) రామభక్తి? (దోమక + ఏమి=దోమకేమి)
మనవి: "అగ్ని తోడ...", "...రామభక్తి" రెండు పూరణలు శ్రీ రామాయణాంతర్గతము గా పూర్తి చేయటం తృప్తి గా వుంది. అయోధ్య తీర్పు సమయం కూడా దానికి బలం చేకూర్చింది.
మక్షికముల గూడి మతము బెట్టె - మీ సవరణ బాగుంది. ఖండాంతరము, దేశాంతరము అయిపోయాము. లేకపోతే, నేనూ చంద్రశేఖర్ గారూ, తెలుగు యాంకీ గారూ ప్రతి ఆదివారం మీ ఇంటి మీద వాలి శిష్యరికము చేసి యెన్నో నేర్చుకొనేవారము. ఇప్పుడు కూడా యిది అదృష్టముగానే భావిస్తాము.
రిప్లయితొలగించండిభక్త జను లంత భజనలో మునుగంగ
రిప్లయితొలగించండిసందు దొరికె నంచు విందు గ్రోల
మశక మొకటి జేరి మందిని విసిగించ
దోమ కేమి తెలుసు రామ భక్తి .?
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. తెలుగులో చెప్తున్నప్పుడు ఇంగ్లీషు పదాలను ఉపయోగించడం నాకు ఇష్టం ఉండదు. కాని ఇప్పుడు తప్పలేదు. "హాట్స్ ఆఫ్ టు యు!"
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిపూరణ చాలా బాగుంది. అభినందనలు.
"భక్త జలు లంత" అన్నప్పుడు గణదోషం ఉంది. దానిని "భక్త బృంద మంత" అని సరిచేస్తే ఎలా ఉంటుందంటారు?
ధన్యోస్మి, మాష్టారు గారు. హనుమ అనుగ్రహం వల్లనే పద్యం అట్లా వచ్చిందని మనసారా నమ్ముతున్నాను.
రిప్లయితొలగించండిక్షమించాలి..
రిప్లయితొలగించండి"పులుల వోలె దూకెపొ పులీగలొకకోటి" అనవచ్చేమో..?
నారాయణ గారూ,
రిప్లయితొలగించండిఅనవచ్చు. సరిపోతుంది.
తనది కానిదైన తానిషా సొమ్మంత
రిప్లయితొలగించండికర్చుపెట్టి జైలు గదిన నున్న
రామదాసు నెంతొ రక్తితో కుట్టిన
దోమ కేమి తెలుసు రామభక్తి?