2, అక్టోబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 112

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను చంద్రశేఖర్ గారు పంపించారు ...
కాని విద్యలఁ జదువుట మానరాదు.

15 కామెంట్‌లు:

 1. నమస్కారమండీ, నా పూరణ :

  విత్త మొక్కటె లక్ష్యమై వింత జగతిఁ
  వంచ నందుట మించరె వారిఁ వీరు
  సరస విద్యల పాటియ సంచరింప
  కాని విద్యలఁ, జదువుట మాన రాదు.

  రిప్లయితొలగించండి
 2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశనివారం, అక్టోబర్ 02, 2010 10:26:00 AM

  అందరికీ మహాత్ముని పుట్టిన రోజు శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. మాన వచ్చును బూజలు; మంత్ర తంత్ర
  యంత్రములను దొరగవచ్చు; అంగభూష-
  జింజిరులను ఊరక విడచి చనవచ్చు
  గాని, విద్యల జదువుట మానరాదు.

  రిప్లయితొలగించండి
 4. విద్యలొసగును వినయంబు వినయమిడును
  మంచి తేజస్సు సంపద మానవతయు
  కాన ధరలోన నెంత ప్రకాండులైన
  కాని, విద్యల చదువుట మానరాదు

  రిప్లయితొలగించండి
 5. విద్యలూరక జెప్పుట వింత లాయె
  విద్యలయ్యె వింత విపణివీధి సరకు
  విద్య గొన డబ్బుగావలె వేల వేలు
  కాని విద్యలఁ జదువుట మానరాదు
  ఫలిత మింతని వర్ణింప పట్ట లేము.

  రిప్లయితొలగించండి
 6. విద్య లూరక జెప్పుట వింత లాయె
  విద్య లయ్యెవిం తవిపణి వీధి సరకు
  విద్య గొనడబ్బు గావలె వేల వేలు
  కాని విద్యలఁ జదువుట మానరాదు
  ఫలిత మింతని వర్ణింప పట్ట లేము

  రిప్లయితొలగించండి
 7. నరసింహ మూర్తి గారూ,
  మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
  మీ అవసరం లేని స్థానాలలో అరసున్నాలు పెడుతున్నారు. వాటిని తప్పుగా వ్రాయడం కంటే అసలు వ్రాయకపోవడం ఉత్తమం.
  ఈ అర్ధానుస్వారాలను ఎక్కడెక్కడ, ఎలా ఉపయోగించాలో త్వరలోనే ఒక టపా పెడతాను.

  రిప్లయితొలగించండి
 8. నారాయణ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. "జింజిరులు" పదప్రయోగం అపూర్వం. మీవల్ల ఒక కొత్త పదాన్ని తెలుసుకున్నాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. మిస్సన్న గారూ,
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. ఇంతకాలం ఎలా మిస్సయ్యారు?
  మీ పూరణ నిర్దోషంగా, అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. చంద్రశేఖర్ గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. కాని దన్నది జగతిని లేనె లేదు
  వృత్తి విద్యలు నేర్చుట బ్రతుకు తెరువు
  హేచ్చు తగ్గులు మరచుట హితము గోరి
  కాని విద్యల జదువుట మాన రాదు .

  రిప్లయితొలగించండి
 12. ధన్యుడిని శంకరయ్యగారూ, ఆ శ్రేయస్సు "బియన్‌రెడ్డి" గారి పర్యాయపద నిఘంటువుది- నాది కాదు. ప్రాసకు సరిపోయే పదం దొరక్క, చివరికి వారి సంకలనాన్ని ఆశ్రయించి, ప్రయోగించేశాను. :)

  రిప్లయితొలగించండి
 13. గురువుగారూ మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. యన్త్రము పాడవడముచేత మిస్సయ్యాను. నమస్సులు.

  రిప్లయితొలగించండి
 14. తెలుగు భాషయె లెస్సని పలుకు చుండి
  వేద వేదాంతమె చదివి విఱ్ఱ వీగి
  బావి లోని కప్పలవలె బ్రతికి...; మనవి
  కాని విద్యలఁ జదువుట మానరాదు

  రిప్లయితొలగించండి