9, అక్టోబర్ 2010, శనివారం

ప్రహేళిక - 5

ఇది ఏమిటి?
ఆ.వె.
ముక్కు, గర్వ, మమరపురి, శోణితంబు, ము
క్తాఫలంబు లరయ త్ర్యక్షరంబు
లట్టి పదముల ప్రథమాక్షరంబులఁ జూడ
మంగళమగు వాద్యముం గనెదము.

అదేమిటో చెప్పండి.

8 కామెంట్‌లు:

 1. నాసిక ,దంభము,స్వర్గము ,రక్తము ,ముత్యము
  నాద స్వరము

  రిప్లయితొలగించండి
 2. మంద పీతాంబర్ గారూ,
  మీ సమాధానం కరెక్ట్. అభినందనలు.
  కాని మీరు చెప్పిన రెండవ పదం అనుస్వారంతో ఉంది. అనుస్వారం లేని పదం కోసం ప్రయత్నించండి.

  రిప్లయితొలగించండి
 3. నాసిక, దర్పము, స్వర్గము, రక్తము, ముత్యము => నాదస్వరము.

  రిప్లయితొలగించండి
 4. నమస్కారములు శంకరయ్య గారు
  జవాబు = " నాదస్వరము " అనుకుంటున్నాను "

  రిప్లయితొలగించండి
 5. చంద్రశేఖర్ గారూ,
  మీ సమాధానం సరైనది. అభినందనలు.

  నేదునూరి రాజేశ్వరి గారూ,
  మీ సమాధానం సరైనది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. ప్రహేళిక-5 : సమాధానం:

  ముక్కు = నాసిక
  గర్వము = దర్పము
  అమరపురి = స్వర్గము
  శోణితంబు = రక్తము
  ముక్తాఫలంబు = ముత్యము

  "నాదస్వరము"

  రిప్లయితొలగించండి
 7. మిట్టపెల్లి అమలా,
  భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
  మీ ఇద్దరి సమాధానాలు సరైనవే. అభినందనలు.

  రిప్లయితొలగించండి