8, అక్టోబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 4

ఏమిటిది?
ఆ.వె.
వందనమ్ము, రొంపి, పదియవ తిథియు,నా
హ్లాద మనఁ బదములు త్ర్యక్షరములు;
మొదటి యక్షరముల ముదమునఁ జదివిన
వర్షముఁ గురిపించు పదము దెలియు.

అదేమిటో చెప్పండి.

9 కామెంట్‌లు:

  1. అభివాదములతో, బురదలో కాలు వేయడం దశ పర్యాయాలు చేస్తూనే వుంటా కాబట్తి ముదముతో నేనిచ్చే సమాధానము అంబుదము. కాకపోతే అభివాదములో 'అ 'వే దొరికింది అం కాదు.

    రిప్లయితొలగించండి
  2. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    కడుంగడు చమత్కారంబుగ సమాధానం బిచ్చి ప్రశంసాపాత్రు లైతిరి. కాని చిన్న లోపము గలదు. ఏమైననేమి? మీకు "అంజలి" ఘటించుచుంటిని.

    రిప్లయితొలగించండి
  3. అంజలి-బురద-దశమి-ముదము => అంబుదము

    రిప్లయితొలగించండి
  4. చంద్రశేఖర్ గారూ,
    మీ సమాధానం 100% కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. నమస్కారములు
    శంకరయ్య గారూ ! ప్రతి సారి అర్ధాలు రాసుకున్నా కూర్పు సరిగా రావటల్లేదు.అందుకని
    వందనము = నమస్కారము ,రొంపి = బురద ,పదవ తిధి = దశమి.,ఆహ్లాదము = సంతోషము " వీటి నుంచి మొదటి అక్షరాలు కలిపితే " న బుధసం " అని వచ్చింది. ఇక " నభము = ఆకాశము వర్షా కాలము అనగా " నబుధము ' అని జవాబు కుదురుతుందా ? తెలుప గలరు

    రిప్లయితొలగించండి
  6. మాష్టారూ,
    ప్రహేళిక శీర్షిక పర్యాయ పదాల పరిజ్ఞానానికి పదును పెడుతోంది. దయచేసి continue చేయండి. ఇంకొక విన్నపము. నిన్నలాగా ఎప్పుడయినా కష్టమైనది ఇస్తే next day గానీ, లేక అప్పుడే గానీ ఒక clue ఇవ్వండి. తరువాత రోజుకి సమాధానాలు వస్తాయి. ఉదాహరణకి "విమానం" వచ్చినపుడు "సున్నాలతో కలిపి ఒక అక్షరంగా చూడండి" అనే సూచన. వుంటా.

    రిప్లయితొలగించండి
  7. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    మీ సమాధానం సరైనది. అభినందనలు.

    రాజేశ్వరి గారూ,
    మొదటి అక్షరం పొరబడ్డారు.

    రిప్లయితొలగించండి