18, అక్టోబర్ 2010, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - 13

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
సీతా మానస చోరుఁ డెవ్వఁ డనినన్ శ్రీకృష్ణమూర్తే కదా!

9 కామెంట్‌లు:

 1. సీతాలచ్చికి ముద్దుబావ యతఁడే చిన్నారి ప్రాయమ్ముచే
  రైతాయెన్ తనువృత్తిధర్మమమరన్, రాణించె తాఁ మిన్నగాఁ.
  ప్రీతింబొంది వరించె సీత తమితో విద్యావిహీనుండయున్
  సీతా మానస చోరుఁ డెవ్వఁ డనినన్ శ్రీకృష్ణమూర్తే కదా!

  రిప్లయితొలగించండి
 2. త్రేతా కాలము నందు రాక్షసుల మర్దింపంగ, శ్రీరామునిన్
  బ్రీతిన్ గోరిరి భక్త యోగి గణముల్ "వేరొండు జన్మంబులోఁ
  జేతున్ మీకు మనోభిరామ ఫలమున్ స్త్రీలవ్వఁ" దాఁ బల్కె, యో
  సీతా! మానస చోరుఁడెవ్వడనినన్ శ్రీకృష్ణ మూర్తే గదా !

  రిప్లయితొలగించండి
 3. మాతా! రుక్మిణి! లక్ష్మివై కృతమునన్ మమ్మేలవే! సీతవై
  త్రేతంబందున పొందవే ధరణి సత్కీర్తిన్! యనన్, నారదా!
  సీతామానస చోరుడెవ్వడనినన్, శ్రీ కృష్ణమూర్తే గదా!
  ప్రీతిన్ రాఘవ మూర్తియై శివుని పెన్విల్ద్రుంచె నీకై యనెన్.

  రిప్లయితొలగించండి
 4. రవి గారూ,
  పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 5. మాతాజానకి నిన్ను నే ను గొలుతున్ మాపాలి దైవంబుగా

  నాతో డె ప్పుడు వీడ కుండుము సదా నా భాగ్య సంధాయినీ

  నీతో జెప్పెద జాంబవంతుని సుతన్ నీ రాము తో జెప్పవే

  సీతా !మానస చోరు డెవ్వడనినన్ శ్రీ కృష్ణ మూర్తే గదా !

  రిప్లయితొలగించండి
 6. మూతల్ బెట్టిన కుండలన్ని కదిపెన్ మ్రుచ్చిల్లినా రయ్యయో !
  ప్రీతిన్ మీగడ పాలు వెన్నలెవరో ? రేయంత కాపాడినన్!
  చేతన్ బట్టగ నింత లేదు యిదుగో చెప్పమ్మ ఓ రాధికా !
  సీతా !మానస ! చోరుఁ డెవ్వఁ డనినన్: "శ్రీకృష్ణమూర్తే కదా!"

  రిప్లయితొలగించండి
 7. మంద పీతాంబర్ గారూ,
  ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. భ్రాతన్ గూడుచు రావణాసురుని నిర్బంధించి చెండాడుటన్
  కోతుల్ మూకను దెచ్చి పోరిడిన శ్రీ కోదండ రాముండెపో
  సీతా మానస చోరుఁ డెవ్వఁ డనినన్;..శ్రీకృష్ణమూర్తే కదా
  ఖ్యాతింజెందిన గీత నుడ్వి నరునిన్ కవ్వించి పోరించెగా :)

  రిప్లయితొలగించండి