5, అక్టోబర్ 2010, మంగళవారం

ప్రహేళిక - 1

ఈ ఊరు పేరేమిటి?
తే.గీ.
నాలు గక్షరమ్ముల పేరి నగర మేను;
గాలివార్త, పికంబు, సాంగ్రామికుండు,
పాను పరయఁగా త్ర్యక్షర పదము లందు
నడిమి యక్షరా ల్జదివిన నాదు పేరు.

(సాంగ్రామికుడు = సైన్యాధిపతి)
ఆ నగరం పేరేమిటో చెప్పగలరా?

11 కామెంట్‌లు:

  1. తీరుగ నెయ్యది సాగర

    తీర సహస్రావధావ ధీయుత క్రియకా

    ధారము యది తియ్యని కా

    జా రుచులది కాకినాడ సద్గుణగణ్యా!

    (పుకారు,కోకిల,సేనాని,పక)

    రిప్లయితొలగించండి
  2. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    నన్ను దిగ్భ్రాంతికి గురి చేశారు. మీరు ఇంత చక్కని పద్యాలు వ్రాయగలరని నేను అనుకోలేదు. ఆ కందం నడక అద్భుతం. మీరు సమస్యా పూరణలు ఎందుకు చేయరు?
    ప్రహేళికా సమాధానాన్ని పద్యంలో చెప్పిన మీ ప్రతిభకు నా నమస్సులు. వెంటనే ప్రచురించాలని ఉన్నా మిగిలిన వారికి ఒకరోజు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. మీ సమాధానాన్ని రేపు ప్రకటిస్తాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. నరసింహ మూర్తి గారూ,
    మీ సమాధానం సరైనదే. అభినందనలు. దానిని రేపు ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి
  4. పుకారు, కోకిల, సేనాని, పడక ల మధ్యాక్షరమాలిక "కాకినాడ"!

    రిప్లయితొలగించండి
  5. కాకి నంది వాడ కాలక్రమములోన
    కాకినాడ యనుచు ఘనత చెందె
    తెల్లదొరలు నాడు తిష్ఠ వేసిరిచట
    ఎరువు కంపనీలు ఇచట లెస్స

    రిప్లయితొలగించండి
  6. నచికేత్ గారూ,
    కాకినాడ పద్యం హృద్యంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    నారాయణ గారూ,
    నచిమేత్ గారూ,
    అందరికీ అభినందనలు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. రవీందర్ గారూ,
    "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. మీ సమాధానం సరైనది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. కోడీహళ్ళి మురళీమోహన్ గారి కందం చాలా బాగుంది. నచికేత్ గారు కాకినాడ పేరెలా వచ్చిందో చెప్పరు. ఒక సంవత్సరము కాకినాడలో ఉద్యోగం చేయడం వలన కాకినాడ అంటే నాకూ అభిమానమే. కొత్త వివరాలు తెలుసుకొన్నాను.

    రిప్లయితొలగించండి