27, అక్టోబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 135

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
పగటి పూట చంద్రునిఁ గనె పద్మనయన.

25 కామెంట్‌లు:

  1. ఇప్పుడే చంద్రశేఖరు గారితో బాతాఖానీ అయ్యాక సరదాగా వ్రాస్తున్నా

    రాతి రంతయు బారులో రభస మయెను
    చంద్రభాసుర సారాయి చవిగొనియెను
    మత్తు వదలగ మారాజు మరలె గృహము
    పగటిపూట చంద్రునిఁ గనె పద్మ నయన

    వివరణ : మూన్ షైను ( చంద్రభాసురము )అనేది ఒక రకము సారాయి .

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుడే చంద్రశేఖరు గారితో బాతాఖానీ అయ్యాక సరదాగా వ్రాస్తున్నా, చిన్న సవరణ

    రాత్రి యంతయు బారులో రభస మయెను
    'చంద్రభాసుర 'సారాయి చవిగొనియెను
    మత్తు వదలగ మారాజు మరలె గృహము
    పగటిపూట చంద్రునిఁ గనె పద్మ నయన

    వివరణ : మూన్ షైను ( చంద్రభాసురము )అనేది ఒక రకము సారాయి .

    రిప్లయితొలగించండి
  3. గగన మంటిన సౌధమ్ము సిగన నున్న,
    రవిని మరిపించే అంబాని భవన వెలుగు,
    రేయి వెళ్ళినా రేరాజు రేఖ వోలె,
    పగటి పూట చంద్రుని గనె పద్మ నయన!
    (శ్రీ ముఖేష్ అంబాని గారి భవనాన్ని
    మొన్ననే నెట్లో చూసాను చాల బావుంది)

    రిప్లయితొలగించండి
  4. కోరి యేగె పిల్ల కోతుల పడలేక,
    నగరమందు జూపగను,నక్షత్ర
    శాల,చూడచూడ,చాలచీకటిదోయ;
    పగటిపూట చంద్రునిగనె పద్మ నయన!

    రిప్లయితొలగించండి
  5. మహిత ఫణి ఫణ మణి ఘృణీ మండితు డయి
    చిరు విభావరి చంద్రికల్ శిరసు వెలుగ
    పెండ్లి కొడుకయి వచ్చిన ప్రియుని గాంచి
    పగటి పూట చంద్రుని గనె పద్మ నయన

    బ్లాగు టైటల్;సుజన-సృజన
    వెంకట రాజా రావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  6. ఉట్టి క్రిందటి ముద్దలు నూయలలును
    అంట పండిన గోరింట లట్ల తద్ది
    పగటిపూట,చంద్రుని గాంచె పద్మ నయన
    అర్చనలు జేసి రాతిరి యట్లు తినగ.

    రిప్లయితొలగించండి
  7. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ఈ పద్యాన్ని చదివి సమస్యను పంపిన మిత్రుడు చంద్రశేఖర్ ముఖం దరహాస భాసురమై "చంద్రభాసురం" కోసం వస్తారేమో మీ దగ్గరికి :-)

    రిప్లయితొలగించండి
  8. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో "మరిపించే" అన్నచో గాణదోషం, "భవన వెలుగు" అన్నచో సమాసదోషం సంభవించాయి.
    "రవిని మరపించు నంబాని భవన కాంతి (శోభ/రుచులు)" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  9. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మంచి విషయాన్నే ఎన్నుకున్నారు. కాని సమస్య తేటగీతి పాదం కాగా మీరు ఆటవెలదిలో పద్యం రాసారు. మీ భావంతో తేటగీతి పద్యం ...
    పిల్ల కోతులు పోరఁగా వెడలె నగర
    మందు నక్షత్రశాల కానందముగను
    చూడఁ జూడఁ జీకటిలోన చోద్య మొప్ప
    పగటి పూట చంద్రుని గనె పద్మనయన.

    రిప్లయితొలగించండి
  10. లక్కాకుల వెంకట రాజా రావు గారూ,
    అద్భుతమైన పూరణ. చక్కని ధారాశుద్ధి. ధన్యవాదాలు.
    "చిరు విభావరి" అనే దుష్ట సమాసం కంటె "స్థిర విభావరి" బాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. శంకరయ్య గారూ !
    " చిరు విభావరి " సమాస దోషమే . సవరణకు ధన్యవాదములు .ఐనా" స్థిర విభావరి "అన్నప్పుడు ముందరి పాదం లో చివరి అక్షరం గురువై ఛందో దోషం ఏర్పడుతుందేమో ! " వర విభావరి " అని సవరించు కొంటాను .
    మీ---వెంకట రాజా రావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  13. మీరు చెప్పిన పంకజాక్షి పగటి పూట చూస్తే -
    ఈ పంకజాక్షి ఏకంగా శయనమందిరంలోనే బెట్టుకుంది ..చూడండి ...

    చంద్రుడు రాకేశ్వరరావు, కామేశ్వర రావు గార్లకి ప్రియకవితా వస్తువు ( ఫేవరెట్)
    వారి పూరణలు చూడాలని ఉంది

    ధనికురాలుయగుటజేసి, దర్పమొంది,
    కృతక,వికృతములవియె ప్రకృతిగనెంచి
    శయనగృహమునచిత్రరచనలు సలిపి/ -
    పగటి పూట చంద్రునిఁ గనె పద్మనయన


    [ ఈ మధ్య పడకటింటి కప్పుకీ గోడలకీ ఆకాశాన్ని తలపించే రంగులు వేయించి భ్రమపెట్టటం మీకెరుకే అనుకుంటాను]

    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  14. మనసు నిండిన మారుని మమత తలచి
    తనదు హృదయపు పొంగులు తాళ లేక
    వలపు వాకిలి ముంగిట వెలయు గాన
    పగటి పూట చంద్రుని గనె పద్మ నయన .

    రిప్లయితొలగించండి
  15. పరిచయంబులు,ప్రణయంబు,పరిణయంబు,
    వరుసక్రమమున జరిగె శ్రీవాణి,చంద్ర
    ములకు,తొలిరేయి కోమలి కలలుపండ,
    పగటిపూట చంద్రునిగనె పద్మనయన!

    రిప్లయితొలగించండి
  16. మాష్టారు ఇచ్చిన సూచన మేరకి, మా మిత్రులు, సరసులు డా.మూర్తి గారికి సవినయ క్షమాపణలతో, హాస్యపూర్వకంగా,

    చంద్ర భాసుర మందుకై చనియె చంద్ర
    శేఖరు డావైద్య మిత్రుని, జేర సూది
    మందు నిచ్చిబదులుగ నిద్ర బుచ్చె
    చివ్వు నశశిలే చిత్వర నిల్లు జేరె
    పగటి పూట, చంద్రునిఁ గనె పద్మనయన,
    జూపె చుక్కల రోషనే త్రంపు కొసల!

    రిప్లయితొలగించండి
  17. చదవటానికి అనుకూలమైన చిన్న సవరణలతో,
    చంద్ర భాసుర మందుకై చనియె చంద్ర
    శేఖరు, డావైద్య మిత్రుని జేర సూది
    మందు నిచ్చిబదులుగ నిద్ర బుచ్చె
    చివ్వున శశి లేచి త్వర నిల్లు జేరె
    పగటి పూట, చంద్రునిఁ గని(నె) పద్మనయన,
    జూపె చుక్కల రోష నేత్రంపు కొసల!

    రిప్లయితొలగించండి
  18. శంకరయ్య గారు!
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు సమస్య తేటగీతి పాదం కాగా ఆటవెలదిలో పద్యం రాసారని మీరన్నాక, మీ తేటగీతి సమస్యా పాదాన్ని అక్షరం కూడా మార్చకుండా ఆటవెలదిలో పొదిగి పూరించాలన్న ఆలోచన వచ్చింది. చిత్తగించండి.

    పట్టపగలు చెలియ, పట్టాభిషిక్తుడై
    మురియుచున్న ప్రియుని మోము గాంచ -
    " పగటి పూట చంద్రుని గనె పద్మనయన "
    అనుచు పలికిరప్పు డచటి జనులు !

    రిప్లయితొలగించండి
  19. >>చంద్రుడు రాకేశ్వరరావు, కామేశ్వర రావు గార్లకి ప్రియకవితా వస్తువు(ఫేవరెట్) వారి పూరణలు చూడాలని ఉంది

    అవును, అనేక విధాలుగా చంద్రుడు నాకు ప్రియ(కవితా)వస్తువు!

    సిగ్గు బరువున వంగిన శిరసుతోడ
    పెండ్లిపీటల కూర్చున్న పృథ్విజ, అర
    మోడ్పు కన్నుల తుదలందు మొదటిసారి
    పగటిపూట చంద్రుని గనె పద్మ నయన

    రిప్లయితొలగించండి
  20. కవి మిత్రులకు, అభినందనలు. నేను ఈ సమస్య పంపటానికి కొంచెం background వున్నది. మాకు (USA లో)శరదృతువు, హేమంత ఋతువులలో చంద్రుడు, సూర్యుడు పగలు 11:00am to Noon వరకు ఆకాశంలో కనిపిస్తారు. శ్రీ రామ జయ పంచకం చదువుకొంటూ, "...చంద్రార్క మరుద్గణేభ్య:..." అంటూ ఇద్దరినీ చూస్తూ ప్రార్ధన చేస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన. మీ స్పందనకి చాలా ఆనందించాను.ధన్యవాదములతో,
    మీ,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  21. చంద్రభాసురం గురించి ఇప్పుడే తెలిసింది.. మూర్తిగారికి నమస్కృతులతో నా పూరణ:
    చంద్రభాసుర సారాయి చల్లబరచ,
    మనసు ఊయలలూగగ, తనువు తూల,
    వరలు సొక్కుల, ఇలుసేర వచ్చు ప్రియుని-
    పగటి పూట చంద్రుని, గనె పద్మనయన.

    రిప్లయితొలగించండి
  22. చిన్న సవరణ- ఇలా బాగుంటుందేమో..
    చంద్రభాసుర సారాయి చౌకలింప,
    మనసు ఊయలలూగగ, తనువు తూల,
    వరలు సొక్కుల ఇలుసేర వచ్చు ప్రియుని,
    పగటిపూట చంద్రుని, గనె పద్మనయన.

    రిప్లయితొలగించండి
  23. రాజా రావు గారూ,
    ముందు పాదం చివర "అయి" అని తెలుగు పదం ఉంది. తర్వాతి పాదం సంయుక్తాక్షరంతో ప్రారంభమైనా ముందటి అక్షరం గురువు కాదు.

    రిప్లయితొలగించండి
  24. ఊకదంపుడు గారూ,
    ధన్యవాదాలు.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    సరదాకు రాసిన మీ పద్యం బాగున్నా, కొన్ని దోషాలున్నాయి.

    డా. ఆచార్య ఫణింద్ర గారూ,
    నిజమే సుమా! నేను గమనించనే లేదు. ధన్యవాదాలు.

    భైరవభట్ల కామేశ్వర రావు గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. కొడుకు పుట్టిన 'చంద్రుడు ' , కొమరితయిన
    'చంద్రముఖి ' యని పేర్వెట్ట జంట తలిచె
    నెలలు నిండంగ - వారల కలలు పండ
    పగటి పూట ' చంద్రుని ' గనె పద్మనయన!!

    రిప్లయితొలగించండి