19, అక్టోబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 127

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ.

10 కామెంట్‌లు:

  1. పరమ గురువు నిత్యానంద బాబ యైన
    కల్కి భగవానుడని చెప్పు కపటుడైన
    తనకు కోర్కెలు కలిగి సందడిని చేయ
    యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ.

    రిప్లయితొలగించండి
  2. యతి విటుడు గాక పోవునే? యతివ బిలువ
    చనడె? యని అతి ఉత్సుకతో నటిన్‌ బ-
    నుప విమతులు; తుకారాముడా పడతిని
    తల్లిగ దలంచి మోక్ష పథమిడి బంపె.
    (లక్షణాలు నెరవేరినప్పటికీ ఈ పద్యం గద్యంలా తోస్తున్నదెందుకో..?)

    రిప్లయితొలగించండి
  3. నిడుద జటలు పెంచి జపము నిండు మునగి
    మేను నిండుగ బూదిని మేలు పులమి
    విరుల శరముల కరిగెను పురహరుడును
    యతి విటుఁడు గాక పోవునె యతివ పిలువ

    రిప్లయితొలగించండి
  4. యవన ప్రాయపు వాంఛలు ఎవరికైన

    మతుల బోగొట్టు, మగువల మనసు దోయ

    వెతలు బలు రీతి బడుదురు, వెకలి ప్రేమ

    యతి, విటుడు గాక పోవునే యతివ బిలువ!

    రిప్లయితొలగించండి
  5. ఐహికాసక్తులను వీడి యహరహమ్ము
    నియతి నాముష్మికము వైపు పయన మౌను
    యతి! విటుడు గాక, పోవునే యతివ బిలువ
    చాటుమాటున సాగించు సరస ములకు?

    రిప్లయితొలగించండి
  6. ఎంత వారలయిన నేమి కాంతదాసు
    లేయ నెగదమన త్యాగరాయ స్వామి
    నుడువ వేరొండుగల దేమి నూరు మార్లు
    యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ.

    రిప్లయితొలగించండి
  7. మగువ మోహిని మత్తిల పరమ శివుని
    తపము చెరచుదు రచ్చర లేమ లంత.
    నెలత వలచిన కాదను నరుడు గలడె ?
    యతి విటుడు గాక పోవునె యతివ బిలువ ?

    రిప్లయితొలగించండి
  8. నారాయణ గారూ,
    ఉదాత్తమైన సందర్భాన్ని ఎంచుకొని సమస్యను పూరించారు. అభినందనలు.
    కాని 2,3 పాదాలలో ప్రాసయతి తప్పింది. ప్రాసాక్షరానికి ముందు గురు లఘువులలో ఏది ఉంటే ప్రాసయతి స్థానంలోను అదే ఉండాలని నియమం.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మంచి బావంతో పద్యం వ్రాసారు. అభినందనలు.
    కాని మొదటి పాదంలో "యవన" పద ప్రయోగం యౌవనమనే అర్థం కాకుండా "యవన దేశపు" అనే అర్థాన్ని ఇస్తుంది.
    "యవ్వనపు ప్రాయమున వాంఛ లెవ్వరికిని" అంటే సరిపోతుంది.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమం. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మంచి విషయాన్నే ఎత్తుకున్నారు. కాని మూడు పాదాల్లోను యతి తప్పింది. వీలైతే సాయంత్రం వరకు దీనిని సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  9. కాంతలను రోసి సన్యాసి గాక సాటి
    కాంతనే గోరి వచ్చెనోయతి రూపు
    నా కిరీటి మరేమాయ నడగ నేల
    యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ.

    మనవి: శ్రీ కృష్ణార్జున యుద్ధంలో సుభద్ర కోసం వచ్చిన అజభీదఫఫా స్వాముల వారిని గుర్తు చేసుకొందాం.

    రిప్లయితొలగించండి