గురువుగారూ ఆరోగ్యానికి ఆదిత్యుణ్ణీ, సిరిసంపదలకు శివుణ్ణీ, మోక్షానికి ముకుందుణ్ణీ ప్రార్ధించాలని పెద్దలు చెప్పగా విన్నాను. అందుకు అలా వ్రాశాను. నమస్సులు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, నిజమే. "భీతిని వీడి గురుసతిని" అన్నప్పుడు గణదోషం లేదు. నేను తప్పుగా ఎలా భావించానో? క్షమించాలి. రెండవ పాదాన్ని సవరించాక ఇప్పుడు బాగుంది.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు. సాధారణంగా పద్యాలను గ్రాంధిక భాషలో వ్రాస్తాం. పదాంతంలో అనుస్వారం వ్యావహారికం. గ్రాంధికంలో "ము, ంబు" ప్రత్యయాలుండాలి. మీ పద్యం రెండవ పాదం చివర "భాగం" అన్నారు. దానిని "భాగం బీ తీరు" అంటే సరిపోతుంది.
యతి గురించి పదం వేసేటప్పుడే ఆలోచించాను. చివరకు "నీతడు" లో "న + ఈ" మరి "దేవేంద్రుడు" లో "ద +ఏ" వుండటంవల్ల "ఈ", "ఏ" లకు యతి కలుస్తుందని అనుకొంటూనే వేశాను. దయచేసి వివరించగలరు.
గురువుగారూ ఆరోగ్యానికి ఆదిత్యుణ్ణీ, సిరిసంపదలకు శివుణ్ణీ, మోక్షానికి ముకుందుణ్ణీ ప్రార్ధించాలని పెద్దలు చెప్పగా విన్నాను. అందుకు అలా వ్రాశాను. నమస్సులు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ ’తెలగాణ’కు మద్దతు
రిప్లయితొలగించండినే తెలుపుచునుంటి నన్న నేతయె, మార్చెన్
తా తదుపరి మాట! ఎటుల
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్?
నమస్కారములండీ మాస్టారూ, సేతువుకి వారధి అని అర్ధము తెలుసు, సముద్రము అని కూడా అర్ధము ఉందా ?
రిప్లయితొలగించండిమూర్తి గారూ,
రిప్లయితొలగించండిసేతువుకు సముద్రమనే అర్థం లేదు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం ఉంది.
"భీతిని విడి గురుపత్నిని" అంటే సరిపోతుంది.
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిపూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
వైతాళికుడెవ్వడు,గన,
రిప్లయితొలగించండిబేతాళుడె,నీతుల పలురీతుల గోతిన్
పాతర జేసెడి ఘనుడే,
నైతిక విలువలను వీడి నాయకుడయ్యెన్ !
సీతను దెచ్చుట తప్పని
రిప్లయితొలగించండినేతకు బోధించె కాని నిష్ఫల మయ్యెన్
నేతయె లంకకు తుదకు అ-
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అభినందనలు.
కాని రెండవ పాదంలో యతి తప్పింది.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
మాస్టారూ, ధన్యవాదములు. అప్పుడు ముందు పంపిన పద్యాన్ని ఉపసం హరించు కొంటాను.
రిప్లయితొలగించండిమొదటి పాదములో, భీతిని వీడి గురుసతిని అని వ్రాసాను. గణాలు సరిపోవాలే.
మీరు భీతిని విడి గురుపత్నిని గా సరిదిద్దారు అది కూడా సరిపోతుంది. ధన్యవాదములు
ఆ తండ్రి పదవి మాటున
రిప్లయితొలగించండిభూతల వనరులను పొంది, భూములు కబ్జా
పాతెను, గోతులు తీసెను,
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.
భీతిని విడి గురుపత్నిని
రిప్లయితొలగించండిపాతకమని యెంచకుండ పైకొని దారన్
ప్రీతిగ మిన్నంటె శశియు
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండినిజమే. "భీతిని వీడి గురుసతిని" అన్నప్పుడు గణదోషం లేదు. నేను తప్పుగా ఎలా భావించానో? క్షమించాలి. రెండవ పాదాన్ని సవరించాక ఇప్పుడు బాగుంది.
నచికేత్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
పాతెను లోతుగ నిజమును
రిప్లయితొలగించండిపాతకముల పొంది డబ్బు పంచెను ప్రజకున్
వాతలు పెట్టగ నాపై
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్
గురువుగారూ! బుర్రకు మరింత పదును పెట్టే వారాంతపు సమస్యకై ఆసక్తిగా యెదురు చూస్తున్నాము.వందనాలు.
రిప్లయితొలగించండిజాతికి బ్రాణమ్ముల నిడు
రిప్లయితొలగించండిదాతలకై ధార వోయు ధరణిక భాగం ?
ఈ తీరు మసలు దైత్యుడు
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.
కార్గిలు మృతవీరుల కుటుంబాల కిచ్చిన భూమిలో భాగం కోరడం అన్యాయము
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఉత్తమమైన పూరణ. అభినందనలు.
వారాంతపు సమస్యా పూరణకై మీ ఉత్సాహం ప్రశంసనీయం. వీలైతే రేపు "వారాంతపు సమస్య"ను ఇస్తాను.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
సాధారణంగా పద్యాలను గ్రాంధిక భాషలో వ్రాస్తాం. పదాంతంలో అనుస్వారం వ్యావహారికం. గ్రాంధికంలో "ము, ంబు" ప్రత్యయాలుండాలి. మీ పద్యం రెండవ పాదం చివర "భాగం" అన్నారు. దానిని "భాగం బీ తీరు" అంటే సరిపోతుంది.
ధన్యవాదములు. అందుకే గురువు లేని విద్య రాణించదు అంటారు. ఆ స్థానంలో యుండి మీరు మా బోటి వారలకు వయోజన వి(ప)ద్యా కేంద్రాన్ని నడుపుతున్నారు. ధన్యవాదములు
రిప్లయితొలగించండితా తప్పెరింగిన బలి య (అ)
రిప్లయితొలగించండినైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యె
న్నంత హరి యనుగ్రహమున
నీతడు సావర్ణి మనువున దేవేంద్రుడగున్ !
మాష్టారుగారు, నాల్గవ పాదంలో గణదోషం సవరించి పంపుతున్నాను. ముందు పంపినవి తీసేయండి.
రిప్లయితొలగించండితా తప్పెరింగిన బలి య (అ)
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యె
న్నంత హరి యనుగ్రహమున
నీతడు సావర్ణి మనువు దేవేంద్రుడగున్ !
కవిమిత్రులకు,
రిప్లయితొలగించండిఆంద్ర రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
సర్వేజనాస్సుఖినో భవంతు.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమంచి విషయాన్నెత్తుకొని సమస్యను పూరించారు. అభినందనలు.
కాని నాల్గవ పాదంలో యతి తప్పింది.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీకు కూడ శుభాకాంక్షలు.
యతి గురించి పదం వేసేటప్పుడే ఆలోచించాను. చివరకు "నీతడు" లో "న + ఈ" మరి "దేవేంద్రుడు" లో "ద +ఏ" వుండటంవల్ల "ఈ", "ఏ" లకు యతి కలుస్తుందని అనుకొంటూనే వేశాను. దయచేసి వివరించగలరు.
రిప్లయితొలగించండిఘాతుక చర్యలు జేసియు
రిప్లయితొలగించండిభీతిల్లక హిట్లరునకు భీభత్సమునన్
రీతిగ గెలిచిన స్టాలిను
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రీతిగ పెండ్లాడి భువిని
రిప్లయితొలగించండినేతను నేనే యనుచును నెత్తిని నేలన్
పాతర బెట్టుచు మామను
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్