15, అక్టోబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 11

ఈ గ్రంథం ఏమిటి?
ఆ.వె.
ధవుఁడు, మాల, బరువు, తరళమ్ము, తృప్తి, వా
ర్ధక్య మను పదములు త్ర్యక్షరములు;
మొదటి యక్షరములఁ జదివినఁ దెలిసెడి
గ్రంథమేదొ తెలుపఁ గలరె మీరు?

ఆ గ్రంథం పేరు చెప్పండి.

13 కామెంట్‌లు:

 1. ధవుడు - మగడు (లేక) మన్నీడు;
  మాల - హారము
  బరువు - భారము
  తరళము - రత్నము
  తృప్తి - తనివి
  వార్ధక్యము - ముదిమి
  సమాధానము: మహాభారతము

  రిప్లయితొలగించండి
 2. ధవుడు = మగడు, మాల = హారము, బరువు = భారము, తరళము = రంజిల్లు , తృప్తి = తనివి,వార్ధక్యము = ముదిమి
  సమాధానము = మహాభారతము

  రిప్లయితొలగించండి
 3. చంద్రశేఖర్ గారూ,
  అభిననందనలు. మీ సమాధానం 100% సరిపోయింది.

  రిప్లయితొలగించండి
 4. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  స్థూలంగా మీ సమాధానం సరైనదే. అభినందనలు.
  కాని "తరళము"నకు మీరిచ్చిన అర్థం అది కాదు.

  రిప్లయితొలగించండి
 5. నాకు తట్టే మరో పదము తరళానికి రత్నము యేమో భారతములో ర కి సరిపోవాలి కదండీ. రేపు మీరు చెప్తారుగా, నేర్చుకొంటాను.

  రిప్లయితొలగించండి
 6. ధవుఁడు = మగడు / మనుష్యుడు
  మాల = హారము
  బరువు = భారము
  తరళమ్ము = (హారమధ్య) రత్నము
  తృప్తి = తనవి
  వార్ధక్యము = ముసలితనము
  వీటి ఆద్యక్షరాలలో కన్పించే గ్రంధము = మహాభారతము

  రిప్లయితొలగించండి
 7. మగడు, హారము ,భారము ,రత్నము తనివి,ముదిమి.=మహా భారతము .

  రిప్లయితొలగించండి
 8. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  అన్వేషి గారూ,
  చంద్రశేఖర్ గారూ,
  మంద పీతాంబర్ గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ అందరి సమాధానం సరిపోయింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. -----, హారము, భారము, రత్నము, తనివి, ముదిమి
  మహాభారతము అనిపిస్తోంది. కానీ మొదటి మ ఎలా వస్తుందో తెలీలేదు.

  రిప్లయితొలగించండి
 10. మనుజుడు,హారము,భారము,రత్నము,తనివి,ముసలి తనము. = " మహా భారతము " అనుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 11. మందాకిని గారూ,
  మొదటి పదం "మగడు". ఇప్పుడు మొదటి అక్షరం "మ" ఎలా అయిందో తెలిసింది కదా!

  రిప్లయితొలగించండి