28, అక్టోబర్ 2010, గురువారం

ప్రహేళిక - 19

ఈ పదాలు ఏమిటో చెప్పండి
సీ.
కనులకు పెను వేదనను గూర్చు జబ్బేది?
శృంగారచేష్టకు గుర్తదేది?
వచ్చియు రానట్టి వరనిద్ర యేదది?
షడ్రుచు లం దామ్ల సామ్య మేది?
కాలి చివరి గుదికా లన నెయ్యది?
విస్తృతార్థ పదము విధ మదేమి?
మార్దవంబగు నూత్న మణికాంతి నేమండ్రు?
కోరికలను దెల్పుకొను మనండి.
తే.గీ.
అన్నిటికి జూడ మూడేసి యక్షరమ్ము
లీవ లావలనుండి పఠించి చూడ
నొక్క విధముగ నుండును చక్కగాను
యోచనము జేసి చెప్పఁగ నొప్పు నిపుడు.
ఆ పదా లేమిటో చెప్పండి.

9 కామెంట్‌లు:

  1. కలక ,చుంబించు /(సరస),కునుకు,పులుపు,మడిమ,గనగ,(ముదము)/ముత్యము,కోరుకో .

    రిప్లయితొలగించండి
  2. కలక, చుంబించు, కునుకు,పులుపు, మణిమ, మునుము,ముత్యము, కోరుకో.

    రిప్లయితొలగించండి
  3. కలక;కులుకు;కునుకు; పులుపు;మడమ;_ _ _; _ _ _;కోరుకో

    రిప్లయితొలగించండి
  4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంగురువారం, అక్టోబర్ 28, 2010 7:57:00 PM

    కలక, కులుకు, కునుకు, పులుపు , మడమ, ? , ముత్యము, కోరుకో
    విస్తృతార్థ పద విధం గుర్తుకు రావటం లేదు, గురువు గారూ
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  5. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంగురువారం, అక్టోబర్ 28, 2010 8:28:00 PM

    కలక, కులుకు, కునుకు, పులుపు , మడమ, ? , ముత్యము, కోరుకో
    విస్తృతార్థ పద విధం గుర్తుకు రావటం లేదు, గురువు గారూ
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  6. కనులకు పెను వేదనను గూర్చు జబ్బేది? - కలక
    శృంగారచేష్టకు గుర్తదేది? - సరస
    వచ్చియు రానట్టి వరనిద్ర యేదది? - కునుకు
    షడ్రుచు లం దామ్ల సామ్య మేది? - పులుపు
    కాలి చివరి గుదికా లన నెయ్యది? - మడమ
    విస్తృతార్థ పదము విధ మదేమి? - విరివి
    మార్దవంబగు నూత్న మణికాంతి నేమండ్రు? - మిసిమి
    కోరికలను దెల్పుకొను మనండి. -కోరుకో

    రిప్లయితొలగించండి
  7. 1.కలక.2.సరస.3.కునుకు 4. పులుపు.5.మడమ 6.విరివి.7.ముత్తెము [ ముత్యము ] 8. కోరుకో

    రిప్లయితొలగించండి