గన్నవరపు నరసింహ మూర్తి గారూ మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మిస్సన్న గారూ, మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
మంద పీతాంబర్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
నేదునూరి రాజేశ్వరి గారూ, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. కాని రెండవ పాదంలో యతి తప్పింది. దానిని ఇలా సవరించాను. "పస తెలియని బాలుఁ డంత పట్టెను గ్లాసున్"
చంద్రశేఖర్ గారూ, మంచి పూరణలు. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం ఉంది. "బట్టియు ఋజుతన్" అంటే సరిపోతుంది. "శ-స" ప్రాసను కొందరు అంగీకరిస్తారు. నిజమే. కాని అందరికీ ఆమోదయోగ్యం కాని ప్రాస అది.
మిసమిస వెలుగులు పొడవగ
రిప్లయితొలగించండివెస దెరచిన బానసాల వెసనము దోడన్
బిసరుహ వదనయు దూరగ
పసిబాలుడు మద్య మడిగె పాలొన్న ననెన్
నమస్కారమండీ, చిన్న సవరణ
రిప్లయితొలగించండిమిసమిస వెలుగులు పొడవడ
వెస దెరచిన బానసాల వెసనము దోడన్
బిసరుహ వదనయు దూరగ
పసిబాలుడు మద్య మడిగె పాలొన్న ననెన్
గురువుగారికి నమస్సులు.త్రాగుబోతు భర్తతో భార్య అన్న పల్కులివి.
రిప్లయితొలగించండిపొసగదు నీకున్నాకును
పసిబాలుడు మద్యమడిగె పాలొల్లననెన్
వ్యసనముకు బానిసై మా
యుసురును తీస్తుంటివింక యోరిమి చచ్చెన్.
ముసి ముసి నగవుల బుడతడు
రిప్లయితొలగించండిపసి వయసునె తన జనకుని పద్దతి గాంచెన్
దసరకు మాత్రమె తండ్రికి
పసి బాలుడు మద్యమడిగె పాలొన్నననెన్ !
(మద్యపానం ఆరోగ్యానికి హానికరం .చట్టబద్ద హెచ్చరిక)
అసుర పురిలోన జరిగిన ,
రిప్లయితొలగించండినిసి రాతిరి వేడుకలలొ నేమని చెప్పన్
అసురుల ఏలిక,నతి రూ
పసి,బాలుడు మద్య మడిగె పాలొన్న నన్ !
బుసలిడు ద్రవము గాంచిన
రిప్లయితొలగించండిపస తెలియని బాలుడంత గ్లాసందు కొనెనన్
కసిరెను తనయుని విసురుగ
పసి బాలుడు మధ్య మడిగె పాలొల్ల ననెన్ !
వెస కల్లు,పాల గాంచియు
రిప్లయితొలగించండిపసదెలియక పాత్రమెరుపు(బట్టి ఋజుత
న్విసమగు నాసీసా గని
పసిబాలుడు మద్య మడిగె పాలొన్న ననెన్
సూచన: ఋజుత = అమాయకత్వము.
ఇంకొక పూరణ: "శ" కి "స" కి ప్రాస మైత్రి వుంది కదా!
రిప్లయితొలగించండికుశుడను మునిబాలకుడట
కుశలత నతిధి న్ధవునకు గోరస మీయన్
కసరగ నివ్వెఱపడె తా
పసి బాలుడు, మద్య మడిగె పాలొన్న ననెన్.
అసలైన పాలు కావవి
రిప్లయితొలగించండిఅసరాగా నీళ్లు కలిపి యాశగ నమ్మన్
సిసలైన సరుకు జూసెను
పసి బాలుడు, మద్య మడిగె పాలొన్న ననెన్.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మిస్సన్న గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
మంద పీతాంబర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
నేదునూరి రాజేశ్వరి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
కాని రెండవ పాదంలో యతి తప్పింది. దానిని ఇలా సవరించాను.
"పస తెలియని బాలుఁ డంత పట్టెను గ్లాసున్"
చంద్రశేఖర్ గారూ,
మంచి పూరణలు. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం ఉంది. "బట్టియు ఋజుతన్" అంటే సరిపోతుంది.
"శ-స" ప్రాసను కొందరు అంగీకరిస్తారు. నిజమే. కాని అందరికీ ఆమోదయోగ్యం కాని ప్రాస అది.
అసురుల రాముడు చంపం
రిప్లయితొలగించండిగ,సురను గ్రోలగ తపసులు గడగడ మనుచున్
ముసిముసి నవ్వులతో తా
పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్
రసికుని యింటను పుట్టుచు
రిప్లయితొలగించండితసదియ తెలగాణమందు తండ్రిని గాంచన్
ముసిముసి నవ్వుల తోడన్
పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్