చెప్పుకోండి చూద్దాం
సీ.గణగణ మని మ్రోగఁగల వస్తు వది యేది?
భూమికి వెలకు పదం బదేమి?
మీనంబులను బట్ట మేటి సాధన మేది?విష్ణ్వింద్రులకు నొక్క పేరదేమి?
నగజాత పతి వాహనం బనఁగ నెయ్యది?నది కటునిటు నుండునది యదేమి?
భగవంతునిఁ దలంచి భక్తు లే మొనరింత్రు?ఇడుములో "ఇ"ని తీయ నేమి మిగులు?
తే.గీ.అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు;
వరుస ప్రథమాక్షరమ్ముల నరసి చూడ
ఆంజనేయుఁడొ భీముఁడో యై తనర్చుఁ
నట్టి దెద్దియో తెలుపుడీ యనఘులార!
సమాధానం చెప్పండి.
గంట,ధర,వల,హరి,నంది,దరి,నుతి,డుము
రిప్లయితొలగించండిగంధవహ నందనుడు
గంట, ధర, వల, హరి, నంది, దరి, నుతి, డుము ల మొదటిపదాలను కూర్చితే వచ్చే సమాధానం 'గంధవహనందనుడు' అవుతుంది.
రిప్లయితొలగించండిగంట; ధర; వల; హరి; నంది; దరి; నుతి; డుము;
రిప్లయితొలగించండిసమాధానము: గంధవహ నందనుడు
వివరణ: గంధవహుడు = వాయుదేవుడు; గంధవహనందనుడు అనగా వాయుపుత్రుడు - ఆంజనేయుడు లేక భీముడు
(గంట, ధర, వల, హరి, నంది, దరి, నుతి, డుము)
రిప్లయితొలగించండి- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
గంట,ధర,వల,హరి,నంది,దరి ,నుతి ,డుము = గంధవహ నందనుడు.
రిప్లయితొలగించండిగంట, ధర, వల, హరి, నంది, దరి, నుతి, డుము
రిప్లయితొలగించండిగంధవహ నందనుడు
గంట,ధర,వల,హరి,నంది,దరి,నుతి,డుము= గంధవహనందనుడు.
రిప్లయితొలగించండిగంట, ధర, వల, హరి, నంది, తీరం, మొక్కు, డుము--- పవనకుమారుల పేరు ఏమిటో మాత్రం తెలీలేదు.
రిప్లయితొలగించండి.శంకరయ్య మాస్టరు గారూ ! మీరు ప్రహేళికను అవలీలగా వ్రాస్తున్నారు గానీ ,నా మట్టి బుఱ్ఱకు నిఘంటువులు సరిపోవటల్లేదు." మీ .ప్రహేళిక ,గడి .పూరణలు ," మంత్రించి నట్టుగా కట్టేస్తున్నాయి.నాలుగులొ మూడు తప్పులున్నా ఈ మూడూ కందము,వెలది ,గీతి . నేర్చు కో గలిగినందుకు చాలా ఆనందముగా ఉంది .[ ధన్య వాదములు.+ కృతజ్ఞతలు. ]" " హేట్సాఫ్ .
రిప్లయితొలగించండి