20, అక్టోబర్ 2010, బుధవారం

ప్రహేళిక - 15

ఈ కవి ఎవరు?
సీ.
కవి తల్లజుఁడు వ్రాయఁ గలిగెడి దేమగు?
నీరేడు లోకాల కేది నెలవు?
చేప కన్నులది సంస్కృతములో నేమగు?
మనల నెయ్యది గమ్యమునకుఁ జేర్చు?
మూతిపై మొలిచెడి పురుష చిహ్నం బేది?
ప్రతిరోజు కేది పర్యాయ పదము?
ఈరోజు, నేడన నితర పదం బేది?
తూకమ్ము వేయు వస్తు వది యేది?
తే.గీ.
కాల సర్పమున్ జూచినన్ గలుఁగు నేది?
లెక్కపెట్టుట కే పద మక్కర పడు?
నన్నిటికిఁ జూడ మూడేసి యక్షరములు;
నడిమి యక్షరా లొక కవి నామ మగును.
ఆ కవి పేరు చెప్పండి.

12 కామెంట్‌లు:

  1. జీవిక ,విశ్వము,మీనాక్షి,పథము ,మీసము,నిత్యము,ఈనాడు ,భయము,కోణము =

    విశ్వనాథ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  2. విశ్వనాథ సత్యనారాయణ.
    అన్నీ వ్రాసెందుకు సమయం పడుతుందని, సమాధానం మొదట రాశాను.

    రిప్లయితొలగించండి
  3. జీవిక ,విశ్వము,మీనాక్షి,పథము ,మీసము,నిత్యము,ఈనాడు, తరాజు ,భయము,కోణము =

    విశ్వనాథ సత్య నారాయణ

    రిప్లయితొలగించండి
  4. ----,విశ్వము, మీనాక్షి, రథము, మీసము, నిత్యము, ఈనాడు, తరాజు, భయము, గణన,

    రిప్లయితొలగించండి
  5. కవిత,ఈశ్వరు,మీనాక్షి,పథము,మీసము,నిత్యము,ఈనాడు,భారము,భయము,గణన = కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు

    రిప్లయితొలగించండి
  6. మళ్లీ సవరణ మొదటి పదం జీవిక కాదు కవిత మీకు అసౌకర్యం కలిగినా
    పోరపాటును ఆలస్య మైనా సరిదిద్దుకోవడం మంచిదే కదా .Better late than never

    రిప్లయితొలగించండి
  7. కవి రాసేది = కవిత్వం ,నెలవు = విశ్వము..చేప కన్నులు = మీనాక్షి.....గమ్యము = పధము.....పురుష చిహ్నము = మీసము ....ప్రతి రోజు = నిత్యము .....ఈరోజు నేడన = నానాడు....తూకమ్ము = తురాయి....సర్పము జూచిన = భయము ....లెక్కకు = గణన = మొత్తము అన్ని కలిపి ," వి శ్వ నాధ సత్య నా రా య ణ. "

    రిప్లయితొలగించండి
  8. కవిత,విశ్వము ,మీనాక్షి, పథము, మీసము, నిత్యము, ఈనాడు, తరాజు, భయము, గణన

    విశ్వనాథ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  9. అందరి సమాధానాలు సరిపోయాయి. వివరణ మాత్రం కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, మందాకిని గారు సరిగ్గా చేసారు. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి