18, అక్టోబర్ 2010, సోమవారం

ప్రహేళిక - 13

ఏ రాగమో యిది?
తే.గీ.
జుట్టుముడి, జాలకము, వన్నె, జోగి, యగ్గి
ద్వ్యక్షర పదాలు; వాని యాద్యక్షరములఁ
జదువ సంగీతమున నొక్క చక్కనైన
రాగమై యొప్పుఁ దెల్పుడా రాగ మేదొ.

ఆ రాగం పేరు చెప్పండి.

7 కామెంట్‌లు:

 1. శిఖ, వల, రంగు, జటి, నిప్పు
  శివరంజని

  రిప్లయితొలగించండి
 2. జుట్టుముడి = శిఖ
  జాలకము = వల
  వన్నె = రంగు
  జోగి = జటి
  అగ్గి = నిప్పు
  వెరసి వీటిఆద్యక్షరములలో కానవచ్చునది ~ శివరంజని రాగం

  రిప్లయితొలగించండి
 3. శిఖ; వల; రంగు; జటి; నిప్పు
  సమాధానము: శివరంజని రాగము.

  రిప్లయితొలగించండి
 4. జుట్టుపిలక = శిఖ,జాలకము = వల, వన్నె = రంగు, జోగి = జటి, అగ్ని = నిప్పు
  సమాధానము = శివరంజని

  రిప్లయితొలగించండి
 5. జుట్టు ముడి = శిఖ,సిగ ,ముడి. ...జాలకము = మొగ్గ ,వల ,పక్షిగూడు.,కిటికి .....వన్నె = రంగు,వర్ణము ,అందము ,కాంతి. ....జోగి = యోగి. ఇలా . చివరికి " శివరంజని " అనుకుంటున్నాను. మొన్న " చిన్నయ సూరి " రాయబోయి " పాణిని రాసాను పోస్ట్ చేసాక గుర్తు వచ్చింది.మరిది ఏమౌతుందో ?

  రిప్లయితొలగించండి
 6. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మంద పీతాంబర్ గారూ,
  నెదునూరి రాజేశ్వరి గారూ,
  అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి