25, అక్టోబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 133

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
సంయమీంద్రుండు గోరెను సంగమమును.

10 కామెంట్‌లు:

  1. విశ్వమోహన మూర్తియు విశ్వనాధు
    మనము నిల్పుచు సలిపెను మౌన వ్రతము
    ఆత్మ తత్వముఁ దెలియుచు నాద్యమందు
    సంయమీంద్రుండు గోరెను సంగమమును

    రిప్లయితొలగించండి
  2. సృష్టి మూలమెరింగి తా సృష్టి జేసి
    చూపినట్టి గాధేయుడు, శుభ్ర తపసి,
    మేటి భరత వంశజునకై మేనక గని
    సంయ మీంద్రు౦డు గోరెను సంగ మమును.

    రిప్లయితొలగించండి
  3. గమనిక: భావ స్పష్టత కోసం మూడవ పాదం కొంచెం మార్చి పంపుతున్నాను.
    సృష్టి మూలమెరింగి తా సృష్టి జేసి
    చూపినట్టి గాధేయుడు, శుభ్ర తపసి,
    మేటి భారత రచనకై మేనక గని
    సంయ మీంద్రు౦డు గోరెను సంగ మమును.

    రిప్లయితొలగించండి
  4. జ్ఞాన మూర్తుల, తత్వ విజ్ఞాన ధనుల,

    నుర్వి జనులకు ,అధికార గర్వితులకు,

    మంచి చెడులను, సూచించ నెంచి,తపసి ,

    సంయ మీoద్రుడు గోరెను సంగమమును!

    రిప్లయితొలగించండి
  5. మేలు ముత్యము మిస్సన్న మెచ్చుకోలు

    ఎదను మీటెను ఎంతయో ముదము గూర్చె,

    బదులు ఏమివ్వ గలవాడ , ప్రణతి

    సేతు, సాటి మిత్రులు జూడ చేతు లెత్తి!

    రిప్లయితొలగించండి
  6. ఆమె సాధ్వీలలామయౌ నామె భర్త
    సంయమీంద్రుండు, గోరెను సంగమమును
    మరచి యుచితానుచితము లమర విభుండు!
    బుద్ధి వక్రింప నిట్లెయౌ బుధుల కైన!

    రిప్లయితొలగించండి
  7. చెలగి సమరాన విశ్వ విజేత యయ్యు
    నౌర!కృష్ణుని పనుపున నర్జునుండు
    పరగ యతి యయ్యె పడతి సుభద్ర కొరకు
    సంయమీంద్రుండు గోరెను సంగమమును
    బ్లాగ్ టైటిల్:సుజన-సృజన
    వెంకట రాజారావు.లక్కాకుల

    రిప్లయితొలగించండి
  8. చెలగి సమరాన విశ్వ విజేత యయ్యు
    నౌర! కృష్ణుని పనుపున నర్జునుండు
    పరగ యతియయ్యె పడతి సుభద్ర కొరకు
    సంయమీంద్రుడు గోరెను సంగమమును

    రిప్లయితొలగించండి
  9. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి బావం. అభినందనలు.
    మూడవ పాదంలో "మౌన వ్రతము" అన్నప్పుడు సమాసపదం కనుక "వ్ర"కు ముందున్న "న" గురువు అవుతుంది.
    దానిని "మనము నిల్పుచు బూనెను మౌన దీక్ష" అంటే సరిపోతుంది.

    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. ధన్యవాదాలు.

    మిస్సన్న గారూ,
    ఉత్తమమైన పూరణ నందించారు. ధన్యవాదాలు.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    చక్కని పూరణను అందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. తనకు తెలియని కామశాస్త్రమ్ములోన
    నుభయభారతి ప్రశ్నింప నుత్తలపడి
    వెడలి తా పరకాయ ప్రవేశమొంది
    సమ్యమీంద్రుండు గోరెను సంగమమును!!!

    రిప్లయితొలగించండి