5, అక్టోబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 115

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
అయ్యలకే గాని మీస మందరి కేలా?
( కవి చౌడప్ప పద్య పాదాన్ని సమస్యగా ఇవ్వమని నేదునూరి రాజేశ్వరి గారు సూచించారు )

11 కామెంట్‌లు:

 1. కొయ్యకు కోతలు గొప్పగ
  చెయ్యిస్తివి కాతునంచు చివరకు చాల్లే
  రొయ్యకు లేవా మూరెడు
  అయ్యలకే గాని మీసమందరి కేలా

  రిప్లయితొలగించండి
 2. నమస్కారం మాస్టారూ, నా పూరణ :

  భర్త గురించి,

  గయ్యాళి భార్య నుడువులు
  "కయ్యములను గారుపిల్లి కాడే సింగం
  పొయ్యిన బడె పురుషత్వము
  అయ్యలకే గాని మీస మందఱి కేలా?"

  రిప్లయితొలగించండి
 3. మరో పూరణండీ ;

  కుయ్యరె కూతలు ఘనముగ
  వెయ్యరె వేషంబు నేడు వేండ్రము పెరుగన్
  అయ్యలు నయ్యిన నమ్మలు
  అయ్యలకే గాని మీస మందరి కేలా ?

  రిప్లయితొలగించండి
 4. గయ్యాళి భార్య నంచును
  నెయ్యముగా తెచ్చితీవు నయముగ సవతిన్
  దెయ్యము నై కసి తీర్చెద
  అయ్యలకే గాని మీస మందరికేలా ?

  రిప్లయితొలగించండి
 5. వింత వివాహాల సందర్భమున :

  అయ్యకు నయ్యే వధువట
  అయ్యకు పుస్తయ్య గట్ట నయ్యెను పెళ్ళిన్
  వియ్యాల వారి విందున
  అయ్యలకే గాని మీస మందఱి కేలా ?

  రిప్లయితొలగించండి
 6. నమస్కారములు శంకరయ్య గారు ! ఒక సందేహం .
  నిన్నటి పూరణలలొ నేను మొదట పంపినది
  చెక్కిలి మీటెను సుందరి
  మిక్కిలి సంతసము నొందె మానస మందున్`
  చక్కని జోడీ కుదరగ వెం
  కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్ ....ఈ పూరణలొ పై మూడు పాదములు ప్రాస " క్క " వచ్చింది అది నేను ముందు చూసుకో లేదు.అందుకని తప్పేమొ అని ప్రచురించ వద్దని అడిగాను ఇక
  చంద్ర శేఖర్ గారి రెండవ పూరణ లో " తప్పగ , మిక్కిల్ ,చక్కని ,కప్పకు " అని ఇచ్చారు. మరి అలా కుడా వ్రాయ వచ్చునా ? ఐతె మరి నా పూరణ కుడా రైటే ఐఉండాలి.తెలుప గలరు

  రిప్లయితొలగించండి
 7. వెయ్యి పలుకులేటికి? నే-
  నియ్యనణా మీసమునకు- నిచ్చలు; కాదే-
  నయ్యది బూర్తిగ గొరుగుము
  అయ్యలకే గాని మీసమందరికేలా?
  (మంగలివాడితో గొడవపడుతూ ఒక పొదుపరి అంటున్నాడు..)

  రిప్లయితొలగించండి
 8. మిస్సన్న గారూ,
  మూడు పూరణ లందించిన గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  నేదునూరి రాజేశ్వరి గారూ,
  నారాయణ గారూ,
  మీ అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. నేదునూరి రాజేశ్వరి గారూ,
  మీరు చెప్పేదాకా చంద్రశేఖర్ గారి పద్యంలోని ప్రాస దోషాన్ని నేను గమనించలేదు. అది తప్పే.

  రిప్లయితొలగించండి
 10. రాజేస్వరిగారూ, మంచి పట్టే పట్టారు. మాష్టారు ఏదో 35/100 marks వేసి pass చేయిస్తే, మీరు కాస్తా 0/100 marks వేయించి fail చేయించారు. ఈసారి assignment బాగా చేయటానికి ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 11. రొయ్యల కందమ్మిడుచున్
  కయ్యము గావించి గెల్చు కప్తానులకున్
  తియ్యని జోకులనిడు వెం
  కయ్యలకే గాని మీస మందరి కేలా?

  వెంకయ్య = వెంకయ్య నాయుడు

  రిప్లయితొలగించండి