ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 6
సీ.స్తంభ సంభూతావసర ఘోరతర నర
పంచాస్య కహకహార్భటులఁ దెగడి
శాకినీ ఢాకిని సంతత లయకాలభైరవ కిలకిలార్భటులఁ దెగడి
సంవర్త సమయ ప్రచండ దండధరారిభర్గ కోలాహలార్భటులఁ దెగడి
దక్షాధ్వరధ్వంసకా క్షుద్రబల వీరభద్ర హూహూక్రియార్భటులఁ దెగడి
తే. గీ.పొలుచు భవదట్టహాసంబు చెలఁగఁ బంక్తి
ముఖుని రొమ్ము పగుల్పవే ముష్టిహతిని?
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )
పద్యాల అర్ధాలు ఇస్తే మంచిదని నా అభిప్రాయం
రిప్లయితొలగించండిఈ పద్య గమనం అర్థం బ్రహ్మాండం గా వున్నాయి. ఇది మననము చేస్తే ఆంజనేయుని అనుగ్రహం వల్ల మనకి "ధీ" శక్తి, వీరశక్తి తప్పక చేకూరుతాయనిపిస్తోంది. ఎప్పుడయినా dull mood లో వుంటే ఈ పద్యం చదువుకోవాలనిపిస్తుంది.
రిప్లయితొలగించండిజగ్గంపేట వారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం.
అర్థాలు, వివరణలు ఇవ్వాలని నాకూ ఉంది. కాని సమయాభావం!
మీ "జగ్గంపేట మెట్టసీమ" బ్లాగు చూసాను. సమకాలీన విషయాలపై వెంట వెంటనే మీ స్పందనలు బాగున్నాయి.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిపద్యాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.