11, అక్టోబర్ 2010, సోమవారం

ప్రహేళిక - 7

ఇత డెవరు?
ఆ.వె.
శిల, హృదయము, త్రోవ, చెలువైన యమృతమ్ము
ద్వ్యక్షర పదము లగు; వాని మొదటి
యక్షరములఁ జూడ నతని పేరై యొప్పుఁ
గీర్తనల రచించి కీర్తిఁ గనెను.

అత డెవరో చెప్పండి.

13 కామెంట్‌లు:

 1. రాయి-మది-దారి-సుర => రా-మ-దా-సు.

  రిప్లయితొలగించండి
 2. రాయి గాదు మదియు రాగమ్ము తీయనై
  దారి సులభమయ్యె త్రాగి సుధలు

  రాయి,మనస్సు,దారి,సుధ = రామదాసు

  రిప్లయితొలగించండి
 3. రాయి గాదు మదియు రాగమ్ము తీయనై
  దారి సులభమయ్యె త్రాగి సుధలు

  రాయి,మది,దారి,సుధ = రామదాసు

  రిప్లయితొలగించండి
 4. జవాబు = " రామదాసు " అనుకుంటున్నాను.
  శిల = రాయి ,హృదయము = మనసు.,త్రొవ = దారి.అమృతము = సుధ . వెరసి " రామదాసు

  రిప్లయితొలగించండి
 5. వరుస వ్రాయుమిదె గుడారము మశకము
  తనిఖియును తరాజు కనుము తుదలు
  రెండు అక్షరములు నుండవలయునన్ని
  తెలియవచ్చునతడు సులభముగను

  రిప్లయితొలగించండి
 6. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  నా పద్య ప్రహేళికకు పద్య ప్రహేళికా రూపమైన మీ సమాధానం నన్ను ఆనందపరచింది. ధన్యవాదాలు.
  మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసాక్షరానికి ముందు గురులఘువులు సమానంగా ఉండాలి కదా. దానిని " కోరి వ్రాయు మిదె గుడారము మశకము" అని సవరించాను.

  రిప్లయితొలగించండి
 7. ఈ సారి ప్రహేళికకు ప్రతిస్పందన బాగుంది. నన్ను ఉత్సాహ పరుస్తున్నది.
  సరియైన సమాధానాలు పంపిన వారు భాస్కర్ రామి రెడ్డి గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మందాకిని గారు, చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, రెహమాన్ గారు, నేదునూరి రాజేశ్వరి గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు. అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. ఓరెమునా గారూ,
  రెహమాన్ గారూ,
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.

  రిప్లయితొలగించండి