8, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 118

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
రోషమ్మును వీడువాఁడె రోషయ్య యగున్.
( దీనిని పంపించిన హరి దోర్నాల గారికి ధన్యవాదాలు )

15 కామెంట్‌లు:

  1. భాషింపక కఠినోక్తులు
    దూషింపక నెట్టివారి దొరతన మబ్బన్
    బోషింపక షడ్వర్గము
    రోషమ్మును వీడు వాఁడె రోషయ్య యగున్.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు, మరో పూరణండీ :

    మేషము మీనము లనుచున్
    శేషించిన యాత్రలందు శివమెత్తక తాన్
    ఘోషించి యధిష్టానము
    రోషమును వీడు వాఁడె రోషయ్య యగున్.

    రిప్లయితొలగించండి
  3. మాస్టారూ నమస్కారములు, మరో పూరణండీ

    మాషముల మూట నిత్తును
    కాషాయపు వస్త్రమిత్తుఁ గాశికి పొమ్మన్
    మేషములు లెక్క పెడుతూ
    రోషమ్మును వీడు వాఁడె రోషయ్య యగున్

    రిప్లయితొలగించండి
  4. రోషమున కయ్య యనుచో
    రోషంబును శిక్ష సేయు, క్రోధాదులనే
    దోషము లంటవు కావున
    రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్

    రిప్లయితొలగించండి
  5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ మిగిలిన రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
    "కాశికి పొమ్మన్" అనేకంటే "కాశిఁ జను మనన్" అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  6. ఉష గారూ,
    "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం.
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. భాషించడు దుర్భాషలు
    ద్వేషించడు వెనుక గొయ్యి తీసెడు జనులన్
    దోషుల గాంచుచు పలుకక
    రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్

    రిప్లయితొలగించండి
  8. పేషీలో మంత్రి గణము
    ధూషణలతొ పొద్దుబుచ్చి దోపిడి సేయన్
    ఈషన్మాత్రము పట్టక
    రోషమ్మును వీడువాఁడె రోషయ్య యగున్

    రిప్లయితొలగించండి
  9. భేషుగ రాముడు భీముడు
    వేషాల్మార్చుచు నయముగ వీడే వాడై
    దోషుల గొట్టుచు పొందగ
    రోషమ్మును వీడు, వా(డె రోషయ్య యగున్.
    విన్నపము: రాముడు-భీముడు (NTR), హలో బ్రదర్ (నాగార్జున) మనసు తట్టారు. ఆనందిద్దాము మళ్ళా తలుచుకొని.

    రిప్లయితొలగించండి
  10. వేషము మారగ నేరడు
    భాషయు విన సొంపు గొల్పు,పరువుకు లేదే
    దోషము భేషజమా నిశ్శేషము
    రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్.

    రిప్లయితొలగించండి
  11. రోషమ్మున దోషంబులు వదలి
    మీసమ్ములు మెలిక వేయ బింకము తోడన్ !
    కాషాయమ్ములు తీర్చవు
    రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్ !

    రిప్లయితొలగించండి
  12. మనవి:
    దసరాలు మొదలయ్యాయి కాబట్టి అమ్మవారి అవతారాలు ప్రాధాన్యంగా కొన్ని సమస్యలు, ప్రహేళిక లు ఇస్తే సమయోచితంగా వుంటుంది.

    రిప్లయితొలగించండి
  13. హరి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.

    నచికేత్ గారూ,
    పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    కాని మూడవ పాదంలో గణదోషం ఉంది.
    దానిని "దోషము భేషజ మెఱుఁగఁడు" అంటే సరిపోతుంది.

    రాజేశ్వరి గారూ,
    పద్యంలో గణ, ప్రాస దోషాలున్నాయి. భావం కూడ సందిగ్ధంగా ఉంది. మీ పద్యాన్ని ఇలా సవరించాను.
    రోషమ్మున మీసములన్
    దోష మనక మెలిక వేసి తుది బింకమునన్
    కాషాయమ్ములు .................

    రిప్లయితొలగించండి
  14. తోషమ్మున మంత్రి యగుచు
    పోషించుచు రాజశేఖ్రు ప్రొద్దున రాత్రిన్
    భేషజ మింతయు లేకయె
    రోషమ్మును వీడువాఁడె రోషయ్య యగున్

    రిప్లయితొలగించండి