శ్రీ శంకరయ్య గారు, నమస్కారం "శంకరాభరణం"ప్రేరణ గా, మీరిచ్చిన ప్రోత్సాహం వల్ల నాలుగు పూరణలు చేయగలిగాను. నేను పూరించిన పద్యాలను మీ అనుమతితో నా బ్లాగైన "సరదాకి చిరు కవిత" లో వేసికోవాలని అనుకుంటున్నాను , ఏమంటారు! అదే బ్లాగులో "మంద వారి మాట మంచు మూట"అనే మకుటం తో ఆట వెలదులలో తేలిక పాటి పద్యాలను వ్రాయడం మొదలు పెట్టాను. దీనికి స్పూర్తి శంకరాభరణములో పాల్గొనడమే .మీరు వీలు చిక్కినప్పుడు నా బ్లాగును వీక్షించి తగు సూచనలు చేస్తే సంతోష పడతాను.మీ సూచనలు, సలహాలు వ్రాసిన వాటిని సవరించు కోడానికి ముందు ముందు నిర్దోషంగా వ్రాయడానికి ఉపయోగ పడ గలవని భావిస్తున్నాను.శతకం పూర్తి చేయడానికి మర్ర్ ఆశీస్సులను ఆశిస్తున్నాను. మీ భవదీయుడు. మంద పితాంబర్
మంద పీతాంబర్ గారూ, పూరణ బాగుంది. అభినందనలు. మీ బ్లాగులో మీ పూరణలనే కాదు, నా పద్యాలను కూడ నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చు. అది నాకు సంతోషం కూడా. మీరు చెప్పినట్లు మీ బ్లాగును బుక్ మార్క్ చేసి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను.
చంద్రశేఖర్ గారూ, మీ పూరణను ఆలస్యంగా చూస్తున్నాను. అదీ గోలి వారి కారణాన. పద్యం బాగుంది. కాని తిలకాష్ఠమహిషబంధం కథ తెనాలి రామకృష్ణుడితో ముడిపడి ఉంది కదా! * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. అలాంటి గురువులను నా సర్వీసులో చాలామందిని చూసాను.
వేదించు టె పని పాటై,
రిప్లయితొలగించండిశోధించును తప్పులన్ని చోద్యము తోడన్
బాధించు మంత్రి కొడుకై,
బోధించుట రాని గురువె పుజ్యుండయ్యెన్ !
శోధన మృగ్యంబయ్యెను
రిప్లయితొలగించండిసాధించుట మార్కులెల్ల శౌర్యంబయ్యెన్
సాధన బట్టీ యైనది
బోధించుట రాని గురువె పూజ్యుం డయ్యెన్.
శ్రీ శంకరయ్య గారు, నమస్కారం
రిప్లయితొలగించండి"శంకరాభరణం"ప్రేరణ గా, మీరిచ్చిన ప్రోత్సాహం వల్ల నాలుగు
పూరణలు చేయగలిగాను. నేను పూరించిన పద్యాలను మీ అనుమతితో
నా బ్లాగైన "సరదాకి చిరు కవిత" లో వేసికోవాలని అనుకుంటున్నాను ,
ఏమంటారు!
అదే బ్లాగులో "మంద వారి మాట మంచు మూట"అనే మకుటం తో
ఆట వెలదులలో తేలిక పాటి పద్యాలను వ్రాయడం మొదలు పెట్టాను.
దీనికి స్పూర్తి శంకరాభరణములో పాల్గొనడమే .మీరు వీలు చిక్కినప్పుడు
నా బ్లాగును వీక్షించి తగు సూచనలు చేస్తే సంతోష పడతాను.మీ సూచనలు,
సలహాలు వ్రాసిన వాటిని సవరించు కోడానికి ముందు ముందు నిర్దోషంగా
వ్రాయడానికి ఉపయోగ పడ గలవని భావిస్తున్నాను.శతకం పూర్తి చేయడానికి
మర్ర్ ఆశీస్సులను ఆశిస్తున్నాను.
మీ భవదీయుడు.
మంద పితాంబర్
నమస్కారమండీ నా పూరణ:
రిప్లయితొలగించండిసాధించె నేకలవ్యుడు
బోధింపక గురుడు ద్రోణు బొమ్మై యుండన్
బాధేది బొటనవేలిడ
బోధించుట రాని గురువె పూజుండయ్యెన్
నమస్కారమండీ నా పూరణ:
రిప్లయితొలగించండిసాధించె నేకలవ్యుడు
బోధింపక గురుడు ద్రోణు బొమ్మై యుండన్
బాధేది బొటనవేలిడ
బోధించుట రాని గురువె పూజ్యుండయ్యెన్
సాధించుచు విద్యార్థుల
రిప్లయితొలగించండివేధించుచు లైంగికముగ విద్యార్థినులన్
బాధించుచుండి చదువుల-
బోధించుట రాని గురువె పూజ్యుండయ్యెన్
(గురువుగారూ ఇక్కడ నా ఉద్దేశ్యము బాధిస్తూ చదువు చెప్పడము రాని గురువు అని)
బాధించుటె దప్ప ఎలమి
రిప్లయితొలగించండిబోధించుట రాని గురువె పూజ్యుండయ్యెన్
ఆధిక్యమొందె స్పర్థయె
గాంధారీపతులదాయె కాలము జూడన్!
(నేటి విద్యా విధానంలో పోటీతత్వం ఎక్కువై సంతోషం కరువౌతున్న సందర్భం)
బోధించని దేమి లేదని
రిప్లయితొలగించండిసాధించుట మాని గురువులు సారూప్యముగన్
వేధించు రుబ్బెడి చదువులు
బోధించుట రాని గురువె పూజ్యుండయ్యీన్
మరి యొక పూరణండీ :
రిప్లయితొలగించండిమాధవుని లీల దెలియగ
శోధింపగఁ జేతిఁ జిక్కె శుక ప్రవచనముల్
బాధలకు లేపనంబయె
బోధించుట రాని గురువె పూజ్యుండయ్యెన్
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అభినందనలు.
మీ బ్లాగులో మీ పూరణలనే కాదు, నా పద్యాలను కూడ నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చు. అది నాకు సంతోషం కూడా. మీరు చెప్పినట్లు మీ బ్లాగును బుక్ మార్క్ చేసి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను.
హరి గారూ,
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మిస్సన్న గారూ,
నారాయణ గారూ,
నేదునూరి రాజేశ్వరి గారూ,
మీ అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యంలో గణదోషా లున్నాయి. వాటిని సవరిస్తే .....
బోధించనిదే లేదని
సాధించుట మాని గురులు సారూప్యమునన్
వేధించి రుబ్బు చదువులు
బొధించుట రాని గురువె పూజ్యుం డయ్యెన్.
సాధించె కురుబ సమ్మతి
రిప్లయితొలగించండిమేధా తిలకాష్టమహిష బంధన గ్రంధాల్
శోధించి, యవి కనుగొనిన
బోధించుట రాని గురువె పూజుండయ్యెన్.
మనవి: మన కాళిదాసు కథే. పనివత్తిడి వల్ల పోస్ట్ చేయటం లేటయింది.
"సాధన లేకనె విషయము
రిప్లయితొలగించండిశోధన మరిచేయ కుండ సోకుల రాజై
బాధతొ పుటలను దిప్పుచు
బోధించుట"- రాని గురువె పూజ్యుండయ్యెన్.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణను ఆలస్యంగా చూస్తున్నాను. అదీ గోలి వారి కారణాన.
పద్యం బాగుంది. కాని తిలకాష్ఠమహిషబంధం కథ తెనాలి రామకృష్ణుడితో ముడిపడి ఉంది కదా!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. అలాంటి గురువులను నా సర్వీసులో చాలామందిని చూసాను.
మాస్టారూ, అది అక్కినేని నటించిన మహాకవి కాళిదాసు సినిమాలో చూసినట్లు గుర్తు. నాకు తెనాలి వికటకవి కవిగారిదని తెలియదు. సినిమా జ్ఞానం అంతంత మాత్రమే నాకు:-)
రిప్లయితొలగించండిమాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసాధించెడి గయ్యాళికి
రిప్లయితొలగించండివేధించెడి యత్తగార్కి వేదాంతమ్మున్
బాధయు దండుగ యనుచున్
బోధించుట రాని గురువె పూజ్యుం డయ్యెన్
సాధన చేయుట లేదని
రిప్లయితొలగించండివేధించక నన్ను రోజు వెంబడి బడుచున్
బాధించెడు సరిగమలన్
బోధించుట రాని గురువె పూజ్యుం డయ్యెన్
ప్రాధాన్యత పాటించక
రిప్లయితొలగించండిబోధించుటరాని గురువె పూజ్యుండాయెన్!
బాధాకర విషయంబే!
సాధారణమాయె నేటి చదువులు జూడన్!!
వేధించకవిద్యార్ధుల
రిప్లయితొలగించండిశోధించక పాఠములను ,శోభలుగూర్చన్
సాధించుచుమార్కులనే
బోధించుటరానిగురువె ,పూజ్యుండాయెన్
సాధన తపముగ శంభుడు
రిప్లయితొలగించండిబాధను దీర్చె ఋషివరుల వట వృక్షమునన్
బోధన మౌనముగానట
బోధించుట రాని గురువు పూజ్యుండయ్యెన్!