1, జులై 2012, ఆదివారం

పద్య రచన - 38


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు.... 
౧. పండిత నేమాని
(1)
    విశ్వకవియయి జగమున శాశ్వతముగ
    భరతదేశ కీర్తిని నిల్పె గురువరుండు
    శ్రీరవీంద్రనాథ్ టాగూర్ ప్రసిద్ధికెక్కె
    కమ్ర గీతాంజలీ కృతికర్త యనగ.
(2)
    విశ్వవినుత కవీంద్ర! రవీంద్రనాథ!
    అమృతసార ప్రవాహమై యలరుచుండు
    నట్టి గీతాంజలీ కృతి నద్భుతముగ
    వ్రాసితీవు మహోదయా! వందనములు.

*     *     *     *     *     *
౨. గోలి హనుమచ్ఛాస్త్రి
    అంజలి గైకొనుమా గీ
    తాంజలి కృతి కర్త! భరత ధాత్రిని నీవే
    రంజిల జేసితి వయ్యా!
    కుంజరముగ 'విశ్వకవివి' కొను మా ప్రణతుల్.
*     *     *     *     *     *
౩. సుబ్బారావు
    విశ్వ విఖ్యాతి గాంచిన విశ్వ గురుడు
    భరతమాతకు బుట్టిన భవ్య చరితు
    డతడె , ఠాకూరు పేరున నాప్తు డయ్యె
    సకలమునకు గీతాంజలి సృష్టికర్త.
*     *     *     *     *     *
౪. గోలి హనుమచ్ఛాస్త్రి
    అంజలి గైకొనుమా గీ
    తాంజలి కృతి కర్త! భరత ధాత్రిని నీవే
    రంజిల జెసితి వయ్యా!
    కుంజరముగ 'విశ్వకవివి' కొను మా ప్రణతుల్.
*     *     *     *     *     *
౫. సుబ్బారావు
    విశ్వ విఖ్యాతి గాంచిన విశ్వ గురుడు
    భరతమాతకు బుట్టిన భవ్య చరితు
    డతడె , ఠాకూరు పేరున నాప్తు డయ్యె
    సకలమునకు గీతాంజలి సృష్టి కర్త .
*     *     *     *     *     *
౬. డా. ఆచార్య ఫణీంద్ర
    కవియన వాల్మీకి, మరియు
    కవియనగా కాళిదాసు, కనగ రవీంద్రుం
    డవని - కవి! వారి కన్నను
    కవులెవరని నా మనంబు కరము తలంచున్!
*     *     *     *     *     *
౭. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    చేతం బుల్లసిలంగ జేయు పదరాజింగూర్చి యందంబుగా
    జాతీయంబగు గీతరాజమును దేశైశ్వర్యసంధాయిగా
    ఖ్యాతిం బెంచెడిదానిగాఁ బలికె నాహా! సత్కవీశుండు నే
    జోతల్ సేతు రవీంద్రనాథునకు సుశ్లోకుండునౌ మౌనికిన్.

    ఉన్నతంబైన భావంబు లెన్నొ చేర్చి
    గీతములు గూర్చి యలరించు రీతి నాత
    డంజలించుచు సత్కీర్తి నందుచుండి
    విశ్వకవియౌచు నిలిచిన విజ్ఞవరుడు.

    పుణ్యభూమిగ పదునాల్గు భువనములను
    ఘనత నందిన భారతావనికి భక్తి
    నీత డందించె శాంతినికేతనంబు
    వినయమున జేతునిక రవీంద్రునకు నతులు.
*     *     *     *     *     *
౮. మిస్సన్న
    విశ్వగర్భుని తత్త్వ వేదికై భాసించె
              'గీతాంజలీ' కావ్య గీత రచన!
    సామాన్య జీవుల చక్కని బంధాల
              పొందుగ చెప్పును ' పోస్టుమేను '!
    కన్నులఁ తడిసేయు ' కాబూలివాల ' యన్
              కథలోని యార్ద్రత కరుణ కురిసి!
    విననౌను మనసా రవీంద్ర గీతికలెన్న
              రమ్యమౌ రాగాల రాశి యౌచు!
    భారతాంబకు ముద్దుల పట్టి యితడు!
    వంగ భాషామ తల్లికి వరమితండు!
    విశ్వకవి! చిత్ర కర్త! నోబెలు విజేత!
    పల్కు డాతని మూర్తికి ప్రణతి ప్రణతి!
*     *     *     *     *     *
౯. గుండు మధుసూదన్
    జనగణమన యంచు జాతీయగీతమ్ము
            ప్రజల కిచ్చియు మెప్పు బడసె నెవఁడు?
    గీతాలతో భక్తి గీతాంజలి రచించి
            నోబెలు బహుమతి నొందె నెవఁడు?
    విశ్వకవీశుగా బిరుదుతో లోకాన
            ఖ్యాతి వహించిన ఘనుఁ డెవండు?
    శాంతినికేతన స్థాపనంబును చేసి
            లలితకళలఁ బెంచి వెలిగె నెవఁడు?
    అతఁడె ఠాగూరువంశ సద్యశవిరాజి
    విశ్వభారతీ హృదయ సంవేద్యయోగి
    భరతమాతాఖ్య సత్పుత్రవర విశిష్టుఁ
    డల రవీంద్రనాథుండు విమలగుణుండు.

*     *     *     *     *     *
౧౦. ఏల్చూరి మురళీధర రావు
    పలుకులు భావముల్ మధురభంగిమఁ జొప్పడ; సత్యవస్తుతాఽ
    స్ఖలితకళాస్వరూపముఁ, బ్రశస్తరసధ్వనిచార్వలంకృతుల్,
    లలితగుణంబులున్ మెఱయ లక్షణలక్షితగీతరమ్యమౌ
    చలితసరస్వతీ కృతివిశాలజగత్పరమేష్ఠి కంజలుల్.

    అకలుషసాధుచింతనము, నైహికభోగవిరక్తి పేర్మి భా
    వుకతయు విశ్వకావ్యరసభూమికలందును నుత్సవింపఁ గా
    వ్యకృతికి - ధర్మసంహితకు నద్వయరూపము నేర్పఱించి, గీ
    తికలను నంజలించిన సుధీంద్ర రవీంద్ర కవీంద్ర! సన్నుతుల్.
*     *     *     *     *     *
౧౧. రవి

 సీ ||
ఘనతరనాకలోకాంభోజమొక్కటి
          యవనిపై యరళించె సువచనముగ
శ్రావణికజలదసౌదామినీశక
          లమ్మిల నురళించె నక్షరముగ
ప్రేమాభిరామమౌ పీయూషవర్షమ్ము
          తెరలాడె సరళంపు తేనె పాట
మందమందస్మితమలయకూలమ్మల
          చిత్తముం బొరళించు చిత్రపటము

గీ||
కలికి చిలుకల యెలరారు చెలువపలుకు
అమ్మ పోలికఁ జెప్పెడు కమ్మని కథ
వేదవేద్యమౌ శారదవీణ పలుకు
విశ్వతోముఖమ్మై యొప్పె విశ్వ కవిగ.

*     *     *     *     *     *
౧౨. రాజేశ్వరి నేదునూరి
అన్ని కళలకు కాణాచి యంగి రసుడు 
నెన్న లేని ఘనత యది మేరు నగము
విన్నవించగ నాతడు విశ్వ కర్మ
విన్ను వెలుగంటు యశమది వేల్పు చెట్టు! 

 

25 కామెంట్‌లు:

  1. విశ్వకవియయి జగమున శాశ్వతముగ
    భరతదేశ కీర్తిని నిల్పె గురువరుండు
    శ్రీరవీంద్రనాథ్ టాగూర్ ప్రసిద్ధికెక్కె
    కమ్ర గీతాంజలీ కృతికర్త యనగ

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    విశ్వకవిని గురించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. అంజలి గైకొనుమా గీ
    తాంజలి కృతి కర్త! భరత ధాత్రిని నీవే
    రంజిల జెసితి వయ్యా!
    కుంజరముగ 'విశ్వకవివి' కొను మా ప్రణతుల్.

    రిప్లయితొలగించండి
  4. విశ్వ విఖ్యాతి గాంచిన విశ్వ గురుడు
    భ రత మాత కు బుట్టిన భవ్య చరితు
    డ త డె , ఠా కూ రు పేరున నాప్తు డ య్యె
    సకలమునకు గీ తాంజలి సృష్టి కర్త .

    రిప్లయితొలగించండి
  5. కవియన వాల్మీకి, మరియు
    కవియనగా కాళిదాసు, కనగ రవీంద్రుం
    డవని - కవి! వారి కన్నను
    కవులెవరని నా మనంబు కరము తలంచున్!

    రిప్లయితొలగించండి
  6. చేతం బుల్లసిలంగ జేయు పదరాజింగూర్చి యందంబుగా
    జాతీయంబగు గీతరాజమును దేశైశ్వర్యసంధాయిగా
    ఖ్యాతిం బెంచెడిదానిగాఁ బలికె నాహా! సత్కవీశుండు నే
    జోతల్ సేతు రవీంద్రనాథునకు సుశ్లోకుండునౌ మౌనికిన్.

    ఉన్నతంబైన భావంబు లెన్నొ చేర్చి
    గీతములు గూర్చి యలరించు రీతి నాత
    డంజలించుచు సత్కీర్తి నందుచుండి
    విశ్వకవియౌచు నిలిచిన విజ్ఞవరుడు.

    పుణ్యభూమిగ పదునాల్గు భువనములను
    ఘనత నందిన భారతావనికి భక్తి
    నీత డందించె శాంతినికేతనంబు
    వినయమున జేతునిక రవీంద్రునకు నతులు.

    రిప్లయితొలగించండి
  7. విశ్వగర్భుని తత్త్వ వేదికై భాసించె
    ...............' గీతాంజలీ ' కావ్య గీత రచన!
    సామాన్య జీవుల చక్కని బంధాల
    ...............పొందుగ చెప్పును ' పోస్టుమేను '!
    కన్నులఁ తడిసేయు ' కాబూలివాల ' యన్
    ...............కథలోని యార్ద్రత కరుణ కురిసి!
    విననౌను మనసా రవీంద్ర గీతికలెన్న
    ...............రమ్యమౌ రాగాల రాశి యౌచు!

    భారతాంబకు ముద్దుల పట్టి యితడు!
    వంగ భాషామ తల్లికి వరమితండు!
    విశ్వకవి! చిత్ర కర్త! నోబెలు విజేత!
    పల్కు డాతని మూర్తికి ప్రణతి ప్రణతి!

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ. శుభాభినందనలు.
    మీ పూరణ చాల బాగున్నది. మీ ప్రశంసలకు సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ. శుభాభినందనలు.
    మీ పద్యము చాలా బాగున్నది. మా ప్రశంసలు. శ్రీ రవీంద్రుని గూర్చి విపులమైన విషయాలతో అలరారుచున్నది మీ పద్యము. సెహబాస్. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ, సమస్య చూడగానే నాకు మీకు వచ్చిన భావమే వచ్చింది. అయితే మీ పూరణకన్నా అందంగా చేయలేను.ధన్యవాదాలు, అబినందనలు.

    రిప్లయితొలగించండి
  11. రవి గారూ! మీ ప్రశంసకు ధన్యవాదములు.
    మీ పద్య వైభవం ముందు నా పద్య రచన నిలబడదు.
    మీరు చాల అందంగా పద్యాలు వ్రాస్తారు.
    కానీ మీరలా అనడంలో మీ సహృదయత ద్యోతకం అవుతోంది.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ మిస్సన్న గారూ!
    మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారి పద్యము

    జనగణమన యంచు జాతీయగీతమ్ము
    ప్రజల కిచ్చియు మెప్పు బడసె నెవఁడు?
    గీతాలతో భక్తి గీతాంజలి రచించి
    నోబెలు బహుమతి నొందె నెవఁడు?
    విశ్వకవీశుగా బిరుదుతో లోకాన
    ఖ్యాతి వహించిన ఘనుఁ డెవండు?
    శాంతినికేతన స్థాపనంబును చేసి
    లలితకళలఁ బెంచి వెలిగె నెవఁడు?
    అతఁడె ఠాగూరువంశ సద్యశవిరాజి
    విశ్వభారతీ హృదయ సంవేద్యయోగి
    భరతమాతాఖ్య సత్పుత్రవర విశిష్టుఁ
    డల రవీంద్రనాథుండు విమలగుణుండు.

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    మీ పద్యంలో లోపం లేదు. అయినా స్వతంత్రించి చివర కొద్దిగా మార్చాను. మన్నించండి.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,

    సరి లేరు నీకు నాచార్య ఫణీంద్ర
    మురిపించు సత్కావ్యముల రచనమున.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,

    వ్రాసితే సత్యనారాయణ మూర్తి
    భాసించు భావాల వరకవిత్వమ్ము.
    *
    మిస్సన్న గారూ,

    రమణీయ భావాల రాశియై వెలిగి
    తమి గూర్చె నీ కవిత్వమ్ము మిస్సన్న!
    *
    గుండు మధుసూదన్ గారూ,

    మధురమయ్యా గుండు మధుసూదనా! సఖుఁడ!
    సుధలొల్కు నీ కైత శోభించు నెపుడు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గారికి, శ్రీ నేమాని సద్గురువులకు, పెద్దలందఱికీ ప్రణామం!

    బెంగాలీలో ప్రత్నమైన “చలిత్ భాషా” ఉద్యమాన్ని ప్రారంభించి, ఆధునికభారతీయసాహిత్యంలో ఉపనిషద్గంధసుగంధిలమైన సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టిన మహాకవికిది అంజలిబంధం!

    పలుకులు భావముల్ మధురభంగిమఁ జొప్పడ; సత్యవస్తుతాఽ
    స్ఖలితకళాస్వరూపముఁ, బ్రశస్తరసధ్వనిచార్వలంకృతుల్,
    లలితగుణంబులున్ మెఱయ లక్షణలక్షితగీతరమ్యమౌ
    చలితసరస్వతీ కృతివిశాలజగత్పరమేష్ఠి కంజలుల్.

    అకలుషసాధుచింతనము, నైహికభోగవిరక్తి పేర్మి భా
    వుకతయు విశ్వకావ్యరసభూమికలందును నుత్సవింపఁ గా
    వ్యకృతికి - ధర్మసంహితకు నద్వయరూపము నేర్పఱించి, గీ
    తికలను నంజలించిన సుధీంద్ర రవీంద్ర కవీంద్ర! సన్నుతుల్.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  16. చాల కాలము తరువాత డా. ఏల్చూరి వారి పద్యములను చూడడము అయినది. మంచి పద్యములు చక్కగా అందరినీ ఆకట్టుకొనుచున్నవి. సంతోషము. వారికి శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. సీ ||
    ఘనతరనాకలోకాంభోజమొక్కటి
    యవనిపై యరళించె సువచనముగ
    శ్రావణికజలదసౌదామినీశక
    లమ్మిల నురళించె నక్షరముగ
    ప్రేమాభిరామమౌ పీయూషవర్షమ్ము
    తెరలాడె సరళంపు తేనె పాట
    మందమందస్మితమలయకూలమ్మల
    చిత్తముం బొరళించు చిత్రపటము

    గీ||
    కలికి చిలుకల యెలరారు చెలువపలుకు
    అమ్మ పోలికఁ జెప్పెడు కమ్మని కథ
    వేదవేద్యంబౌ శారదవీణ పలుకు
    విశ్వతోముఖమ్మై యొప్పె విశ్వ కవిగ

    రిప్లయితొలగించండి
  18. మూర్తిగారూ ధన్యవాదాలు.
    విశ్వకవి ఘనతను చక్కగా ఆవిష్కరించారు మీ పద్యాలలో.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గుండు మధుసూదన్ గారి పద్యం మధురంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  20. రవిగారూ విశ్వకవికి మనోజ్ఞమైన భావంతో నీరాజనం అర్పించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    అత్యద్భుతంగా ఉన్నాయి మీ పద్యాలు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రవి గారూ,
    చాలా బాగా రాసారు పద్యాలను. అభినందనలు.
    ఎత్తుగీతి మూడవ పాదంలో ‘వేద్యంబౌ’ అన్నచోట గణదోషం. ‘వేద్యమౌ’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  22. అన్ని కళలకు కాణాచి ఆంగి రసుడు
    యెన్న లేనట్టి ఘనతది మేరు నగము
    విన్న వించగ నాతడు విశ్వ కర్మ
    విన్ను వెలుగంటి యశమది వేల్పు చెట్టు .!

    రిప్లయితొలగించండి
  23. పూజ్యశ్రీ నేమాని సద్గురువుల అఖండకృపాశీర్వాదానికి, శ్రీ శంకరార్యుల ప్రోత్సాహనానికి ధన్యవాదాలు.

    వస్తువు ఏదైనా శ్రీ గురువుల పద్యం సనాతన భారతీయసంప్రదాయవైభవాన్ని ప్రస్ఫుటింపజేస్తూ సౌందర్యరత్నాకరమై సర్వాదర్శంగా భాసిస్తూనే ఉంటుంది. సరస్వతీకటాక్షఫలం అది!

    సమాధిగుణం నిండారి సమగ్రశోభతో అలరారుతున్న పద్యరచన చేసినందుకు శ్రీ మిస్సన్న గారికి అభినందనలు. తదన్యకవివరేణ్యు లందఱికీ జయోస్తు!

    రిప్లయితొలగించండి