1, జులై 2012, ఆదివారం

సమస్యాపూరణం - 750 (శస్త్రసన్యాసమే మేలు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు.

 కవిమిత్రుల పూరణలు  

౧. లక్ష్మీదేవి
    రాజ్యరక్షణ యనునది రాజధర్మ
    మెల్ల జనులను గాచుట కిచ్ఛ యున్న,
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు
    కలుగజేయు? నిశ్చయముగ కలుగు హాని.



    సృష్టి నెల్లను గాల్చెడు శస్త్రములగు
    ఘనతరమగు నణ్వాయుధ కల్పన విడి
    శస్త్రసన్యాసమే మేలు. క్షత్రియులకు,
    నైన, నెట్టి వీరులకైన నట్టి తలపు
    వలదు. దీన రక్షణకునై పాటుపడగ
    శస్త్రముల ధరియించుట సమ్మతమ్ము,
    జగతిని వినాశమొనరించు శస్త్రమేల?
    తెలిసి మెలగుటయె శుభము తెలివితోడ.


*     *     *     *     *     *     *
౨. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    సత్యధర్మాలు కాపాడి సత్వమొసగి
    శాంతిసౌఖ్యాలు స్థాపించి జనులకెపుడు
    హర్ష మందించలేకున్న నవనిలోన
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు.

*     *     *     *     *     *     *
౩. పండిత నేమాని
    శాంతి సౌభాగ్య నిలయమై సర్వభూత
    సామరస్య సమేతమై సకల విశ్వ
    మొక కుటుంబ విలాసమై యొప్పు వేళ
    శస్త్ర సన్యాసమే మేలు క్షత్రియులకు.

*     *     *     *     *     *     *
౪. మన తెలుగు చెప్పారు...
    కర్మయుగమున కలిమాయ కప్పుచుండ
    దర్భసన్యాసమేతగు ధర సురులకు
    యాదవులకు సేమమది గోప్రోది విడువ
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు
    (ఎవరి వృత్తివారు విడువ నిచ్చగింత్రు)
*     *     *     *     *     *     *
౫. మిస్సన్న
    వైద్యుడై నిపుణుడు గాక వచ్చు వారి
    శస్త్రములఁ చికిత్సలు జేసి చంపు కన్న
    శస్త్రసన్యాసమే మేలు! క్షత్రియులకుఁ
    జూడ పూర్వము శస్త్రముల్ శోభ నిచ్చె.

*     *     *     *     *     *     *
౬. గోలి హనుమచ్ఛాస్త్రి
    స్త్రీలు బాలలు వృద్ధులు చేతగాని
    పిరికి వారలు మరియును పేడి వారి
    నెన్ని యుద్ధము చేయుట కన్న జూడ
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు.

*     *     *     *     *     *
౭. సహదేవుడు
    యుద్ధ మందున విజయమ్ము యోధు లంద
    నస్త్రశస్త్రమ్ము లన్నవి యవసరములు
    తదవసర మైన యస్త్రాలు దక్క నన్య
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు.
*     *     *     *     *     *
౮. సుబ్బారావు
    శత్రు సంహార మేనాడు జరుగదేని
    శస్త్ర సన్యాసమే మేలు, క్షత్రియులకు
    ప్రజల రక్షణ బాధ్యత వరలుచుండు
    రాజు సేతను బట్టియె రాజ్య మలరు.
*     *     *     *     *     *
౯. చంద్రమౌళి
    ధర్మ రక్షణ జేయగ ధరిణిలోన
    రగిలె రౌద్రాల పోరుల రంగమందు
    లయము దరిజేర శరణని రిపులు జేయు
    శస్త్ర సన్యాసమే, మేలు క్షత్రియులకు
*     *     *     *     *     *
౧౦. గుండు మధుసూదన్
    సకల దేశాలలోని సస్యములు సిరుల
    ఫలము లీయంగ బ్రజలంత పరమశాంతి
    సౌఖ్యము లనుభవించుచు సఖ్యతఁ గన
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు.

*     *     *     *     *     *
౧౧. రాజేశ్వరి నేదునూరి
    అస్త్ర శస్త్రము లనునవి నాత్మ విద్య
    జగతి పాలించు ప్రభువుకు శాంతి పధము
    శాంతి సౌఖ్యము లొనగూర్చసాటి యేది
    శస్త్ర సన్యాసమే మేలు క్షత్రియు లకు . !

25 కామెంట్‌లు:

  1. రాజ్యరక్షణ యనునది రాజధర్మ
    మెల్ల జనులను గాచుట కిచ్ఛ యున్న,
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు
    కలుగజేయు? నిశ్చయముగ కలుగు హాని.

    రిప్లయితొలగించండి
  2. సత్యధర్మాలు కాపాడి సత్వమొసగి
    శాంతిసౌఖ్యాలు స్థాపించి జనులకెపుడు
    హర్ష మందించలేకున్న నవనిలోన
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు.

    రిప్లయితొలగించండి
  3. శాంతి సౌభాగ్య నిలయమై సర్వభూత
    సామరస్య సమేతమై సకల విశ్వ
    మొక కుటుంబ విలాసమై యొప్పు వేళ
    శస్త్ర సన్యాసమే మేలు క్షత్రియులకు

    రిప్లయితొలగించండి
  4. లక్ష్మీదేవి గారూ,
    సమస్య పాదాన్ని ప్రశ్నగా మార్చి మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    స్వధర్మాచరణంలో విఫలుడైన వాని స్థితిని గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    విశ్వమంతా సౌహార్దం నిండుకున్నప్పుడు ఇక శస్త్రాలతో పనేముంది? ఉత్తమమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. నేమాని పండితార్యా మీ పూరణ మనోజ్ఞంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  6. కర్మయుగమున కలిమాయ కప్పుచుండ
    దర్భసన్యాసమేతగు ధర సురులకు
    యాదవులకు సేమమది గోప్రోది విడువ
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు
    (ఎవరి వృత్తివారు విడువ నిచ్చగించు)

    రిప్లయితొలగించండి
  7. సరదాగా:

    వైద్యుడై నిపుణుడు గాక వచ్చు వారి
    శస్త్రములఁ చికిత్సలు జేసి చంపు కన్న
    శస్త్రసన్యాసమే మేలు! క్షత్రియులకుఁ
    జూడ పూర్వము శస్త్రముల్ శోభ నిచ్చె.

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారూ,
    వృత్తిధర్మాలను త్యజిస్తున్నవారి గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘ధరసురులు’ అనవచ్చా అని సందేహం. అనవచ్చేమో? ధరకార్ముకుడు అని శివునికి పేరు. ‘ఇచ్చగించు’ను ‘ఇచ్చగింత్రు’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ,
    మీ పూరణ నిజంగానే సరదాగా మనోరంజకంగా ఉంది. అభివందనలు.

    రిప్లయితొలగించండి
  10. గురువు గారు,
    ధన్యవాదాలండి.

    సృష్టి నెల్లను గాల్చెడు శస్త్రములగు
    ఘనతరమగు నణ్వాయుధ కల్పనేల?
    శస్త్రసన్యాసమే మేలు. క్షత్రియులకు,
    నైన, నెట్టి వీరులకైన నట్టి తలపు
    వలదు. దీన రక్షణముకై పాటుపడగ
    శస్త్రముల ధరియించుట సమ్మతమ్ము,
    జగతిని వినాశమొనరించు శస్త్రమేల?
    తెలిసి మెలగుటయె శుభము తెలివితోడ.

    రిప్లయితొలగించండి
  11. స్త్రీలు బాలలు వృద్ధులు చేతగాని
    పిరికి వారలు మరియును పేడి వారి
    నెన్ని యుద్ధము చేయుట కన్న జూడ
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీదేవి గారూ,
    మీ రెండవ పూరణకూడా బాగుంది. అభినందనలు.
    ‘కల్పన + ఏల’ అన్నప్పుడు సంధి లేదు. ‘రక్షణముకై’ అనరాదు ‘రక్షణమునకై’ అనాలి. ‘కల్పన విడి’, ‘దీనరక్షణ చేయ’ అని నా సవరణలు. ఏమంటారు?
    *
    గోలి హనుమచ్చాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ ధన్యవాదాలు.
    నా పూరణలో ' చంపు కన్న' అనవచ్చునా అన్న సందేహం ఉంది.
    ' చంపుట కన్న' అని మాత్రమే అనాలంటే 'చంపరాదు' గా చదువుకో మనవి.

    రిప్లయితొలగించండి
  14. యుద్ధమందునవిజయమ్ముయోధులంద
    నస్త్రశస్త్రమ్ములన్నవియవసరంబు
    తదవసరయస్త్రశస్త్రాలుదక్క
    నన్య
    శస్త్రసన్యాసమేమేలుక్షత్రియులకు

    రిప్లయితొలగించండి
  15. శత్రు సంహార మేనాడు జరుగ నేని
    శ స్త్ర సన్యాసమే మేలు, క్షత్రి యులకు
    ప్రజల రక్షణ బాధ్యత వ ర లు చుండు
    రాజు సేతను బట్టియె రాజ్య మలరు .

    రిప్లయితొలగించండి
  16. ధర్మ రక్షణ జేయగ ధరిణిలోన
    రగిలె రౌద్రాల పోరుల రంగమందు
    లయము దరిజేర శరణని రిపులు జేయు
    శస్త్ర సన్యాసమే, మేలు క్షత్రియులకు

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
    మీ పూరణ బాగున్నది. 3వ పాదములో యడాగమము ఎలాగ వేసారో తెలియుట లేదు. యడాగమము తెలుగు సంధి. తత్ అవసర అస్త్ర శస్త్ర -- ఈ పదములన్నియు సంస్కృత పదములే. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ. శుభాభినందనలు.
    మీ పూరణ చాల బాగున్నది. మీ ప్రశంసలకు సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    సకల దేశాలలోని సస్యములు సిరుల
    ఫలము లీయంగ బ్రజలంత పరమశాంతి
    సౌఖ్యము లనుభవించుచు సఖ్యతఁ గన
    శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు.

    రిప్లయితొలగించండి
  20. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తదవసర + అస్త్ర’ అన్నప్పుడు సవర్ణదీర్ఘసంధి జరుగుతుంది.
    ‘తదవసరమైన యస్త్రాలు దక్క యన్య’
    *
    సుబ్బారావు,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘జరుగ నేని’ అన్నచోట ‘జరుగదేని’ అంటే బాగుంటుందేమో?
    *
    చంద్రమౌళి గారూ,
    శత్రువులు శరణు కోరిన తర్వాత శస్త్రంతో పనేముంటుంది? చక్కని పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. అస్త్ర శస్త్రము లనునవి నాత్మ విద్య
    జగతి పాలించు ప్రభువుకు శాంతి పధము
    శాంతి సౌఖ్యము లొనగూర్చసాటి యేది
    శస్త్ర సన్యాసమే మేలు క్షత్రియు లకు . !

    రిప్లయితొలగించండి
  22. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శంకరయ్య గారూ,
    వందనములు.మీ పరిభావన సమంజసమే.
    యుద్ధనియమాల్లో,ఆయుధాన్ని కిందవేసినంత శరణాగతియన్నది పరిపాటేగా.
    శస్త్రసన్యాసం (surrendering of weapons) శరణాగతి రెండూ సహక్రియలు, ఏకపరిణామసూచకాలు అని నా భావన. ’లయము దరిజేర పట్టగ రిపులు జేయ’అన్న, సరిపోవును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. చంద్రమౌళి గారూ,
    ముందు గమనించలేదు. మీ పూరణ మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
    ‘.......... రంగమందు
    నపజయంబున శరణని రిపులు జేయు’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి