3, అక్టోబర్ 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 11

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
( దీనిని చంద్ర శేఖర్ గారు పంపించారు. వారికి ధన్యవాదాలు )
కోడలు మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్.

9 కామెంట్‌లు:

  1. వేడుక యాడుబిడ్డ తను వెళ్ళెడు వేళ సినీమ కంతలో
    కాడియు నెడ్లతో దిగెను గమ్మున యింటికి పెద్ద వెంటనే
    కోడలు మామ జూచి కను గొట్టెను రమ్మని సైగ చేయుచున్
    తోడుగ పెన్మిటిన్ తమకు తొందరగా నొకవంక భీతితో

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ,
    ఎంత మంచి భావన! పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్నగారూ, నేను ఉహించినట్లుగా సమస్యను చక్కటి విభజన తో సందర్భాన్ని సృష్టించి పూరించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్యగారూ నమస్కారములు. మిస్సన్న గారి పూరణ చాలా బాగుంది. నా పూరణ :

    పాడది రక్త పోటునకు పథ్యము యేలనొ మందు లుండగా
    కూడుకు రాడు మామ,తన కూరిమి భర్తను నిద్ర పుచ్చి యో
    కోడలు మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్
    వేడుక నాడు తీరె కడు వేదన కూడగ పంచ భక్ష్యముల్.

    రిప్లయితొలగించండి
  5. నరసింహ మూర్తి గారూ,
    కన్న కూతురులా చూసుకొనే అలాంటి కోడలు దొరకడం మామ అదృష్టం. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. మేడలొ దూరినారు కను మేరన కాంచి(చ)న భూషణాల, కై
    దాడిని జేసినారు నవ దంపతులిర్వురి గట్టి వేసి, నో
    గోడకు నెట్టిరా ధములు కోమలి నోటిన మాటరాక ,నా
    కోడలు మామ జూసి కను గొట్టెను రమ్మని సైగ జేయుచున్ !.

    రిప్లయితొలగించండి
  7. వేడెను వేల్పు లెల్లరను వీరిని వారిని జాబు కోసమై
    వీడెను మబ్బులట్లు తన యిక్కటు లన్నియు,మంచి జీతమే
    జూడగ, జోడుగా కుదిరె వాని సహోదరి ముద్దు కూతురే ,
    కోడలు మామ జూసి కను గొట్టెను రమ్మని సైగ జేయుచున్!

    రిప్లయితొలగించండి

  8. కోడలు పోయి పువ్వులను గోసెడి మామను నంతలోనె నా
    గోడ సమీపమందు బుస గొట్టుచు నున్న భుజంగమున్ గనెన్
    జూడక యాదెసన్ జనినచో నది కాటును వేయునంచు నా
    కోడలు మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగ జేయుచున్.

    రిప్లయితొలగించండి
  9. బాడుగ కొంపలో మగడు కాపుర ముంచగ నత్త మామతోన్
    వేడుక సుంతయున్ గనక వేచుచు నొంటరి భర్తతోడుకై;...
    గోడకు చాటు మంచమున గొప్పగ తూగుచు నుండెడిన్,...
    కోడలు,...మామఁ జూచి,...కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్
    కూడుము నన్నురా యనెను కొద్దిగ సిగ్గుయు లేక పెన్మిటిన్

    రిప్లయితొలగించండి