9, అక్టోబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 119

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
భాస్కరుఁ డుదయించె పడమటి దెస.

12 కామెంట్‌లు:

  1. నమస్కారమండీ, నా పూరణ :

    దాస్యశృంఖలముల దల్లి భారతి జూచి
    విడుపు గోరి పోరె విమల సుతుడు
    తేజరిల్లె తిలకు బాలగంగాధరు
    భాస్కరు డుదయించె పడమటి దెస

    రిప్లయితొలగించండి
  2. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కని విషయాన్ని ఎన్నుకొని సమస్యను పూరించారు. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది.
    "ప్రజ్వలించె తిలకు బాల గంగాధరు" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  3. మరో పురణండీ :

    కపటితనము గాదె కన్నె కుంతియ గోర
    తరణి దెలియ రాడె ధరణి తీరు
    దొంగతనము దెలిసి తూరుపు నోపక
    భాస్కరుఁ డుదయించె పడమటి దెస.

    రిప్లయితొలగించండి
  4. నరసింహ మూర్తి గారూ,
    ఈ పూరణ ఇంకా బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. కనక దుర్గ ప్రభలు కనువిందు కనుమని
    చన్దమామ చెప్ప సవితు తోడ
    అయ్యొ గ్రుంకినానె అయిన నేమౌనని
    భాస్కరు డుదయించె పడమటి దెస

    రిప్లయితొలగించండి
  6. మాస్టారూ, మీ సవరణ యతిదోషము తీర్చడమే కాదు , పద్యానికి అందం యిచ్చింది. 'ప్రజ్వలించె తిలకు బాలగంగాధరు ' గా సవరిస్తాను. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  7. తిమిర మందు జరుగు తికమక పనులెన్నొ
    కనులు మూసు కొంటి గాంచ లేక
    వెలుగు చూపి నంత వీడుదురని తలచి
    భాస్కరుడు దయించె పడమటి దెస

    రిప్లయితొలగించండి
  8. మంధిరముఱుకు వేళ మైనాక సింహిక
    సురస లన్చతురతజుట్టి ధీర

    మూర్తియవతరించె మునిమాపు వేళల
    లంకలోని లంబశిఖరమందు
    జూడనచట భాస్కరశతాంశుడౌ కపి
    భాస్కరుఁ డుదయించె పడమటి దెస!
    మనవి: తేట గీతి లో లాగా నాలుగు కంటే ఎక్కువ పాదాలు వుండచ్చంటే ఆరు పాదాలూ వేయండి. లేకపోతే చివరి నాలుగు పాదాలు తీసుకొన్నా బాగానే వుంటుంది.

    రిప్లయితొలగించండి
  9. లాలు,బాబు గూడి లండను ఏలంగ
    లాడెనన్న దొరికి లాస్యమాడ
    సెల్లు లన్ని మాయ బల్లులై పోవంగ
    భాస్కరుడుదయించు(చె)పడమటి దెస !

    రిప్లయితొలగించండి
  10. సమస్యలు పూరించేటప్పుడు కోతి ఆలోచనలు రాక పోతే ఎలా ? జై హనుమా !

    సంధ్య వేళ నెగసి చవిగొని యెఱ్ఱని
    ఫలము ననుచు మ్రింగె పవన సుతుడు
    కరియు మ్రింగు వెలమ కరణి దా విడివడి
    భాస్కరుఁ డుదయించె పడమటి దెస

    రిప్లయితొలగించండి
  11. ఉష గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    చక్కగా నిర్దోషంగా ఉంది మీ పూరణ. ధన్యవాదాలు.

    చంద్రశేఖర్ గారూ,
    మంచి భావంతో పూరించారు. నాకు తెలిసినంత వరకు ఆటవెలదిని నాలుగు పాదాల్లోనే తప్ప షట్పదిగా రాయడం లేదు.
    మీ పద్యంలో మొదటి రెండు పాదాలు కాక, 4,5 వ పాదాలు తొలగిస్తే బాగుంటుందేమో. మోదటి పాదంలో గణదోషం ఉంది. సమయం చిక్కగానే ఆ పద్యాన్ని సవరించి ప్రకటించి, మీకు మెయిల్ చేస్తాను. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    చాలా బాగుంది. మీ పద్యం ఏదో తత్త్వగీతాన్ని గుర్తుకు తెస్తోంది. చమత్కారంతో సమస్యను పూరించినందుకు అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఈ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. మాష్టారు గారు,
    గణదోషం సవరించి నాలుగు పాదాలకి పరిమితం చేశాను. పరిశీలించ౦డి.
    మంధిరము గడచుచు మైనాక సింహిక
    సురస లన్చతురత జుట్టి కడలి
    కాదరి మునిమాపుగ డిగజూడ నాకపి
    భాస్కరుఁ డుదయించె పడమటి దెస!

    రిప్లయితొలగించండి