11, అక్టోబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 121

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్.

14 కామెంట్‌లు:

  1. దేవికి వైభవ మొప్పగ
    నవరాత్ర్యుత్సవము లమరె, నాలుగు దినముల్
    పవలున్ రేయియు ముందుగ
    యువకుల్ శ్రమియింపజేసి యూరికి ఘనమై.

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ,
    మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
    కాని మొదటి పాదంలో ప్రాసాక్షరానికి ముందు గురువుంది. మొదటి పాదంలో ప్రాసాక్షరానికి ముందు గురు లఘువులలో ఏది ఉంటుందో మిగిలిన పాదాల్లోను అదే ఉండాలని నియమం. దానిని ఇలా సవరించాను.
    "శివసతికి వైభవముగా"

    రిప్లయితొలగించండి
  3. గురువుగారూ మిక్కిలి కృతజ్నతలు.
    దయచేసి క్షమించి క, ఖ,గ, ఘ తర్వాతి అక్షరము టైపు ఉపకరణితో యెలా వ్రాయాలో చెప్పరూ

    రిప్లయితొలగించండి
  4. శక్తి స్వరూపిణి శ్రీ మాతకు, గురువులకు నమస్కృతులు.

    నవయుగమున మా బ్రతుకులు
    శివమూర్తీ శీఘ్రమయ్యె సేవలు సహితం
    భవహారిణి పద పదమా
    నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారూ,
    నేను "లేఖిని" వాడుతున్నాను. లేఖినిలో ఏ అక్షరాన్ని ఎలా టైపు చేయాలో కుడిపక్కన కనిపిస్తుంది. మరి మీరు ఏ టైపు ఉపకరణాన్ని ఉపయోగిస్తున్నారో? నాకు మిగిలిన వాటి గురించి తెలియదు.

    రిప్లయితొలగించండి
  6. భవ మోచని కాత్యాయని
    భవ దీయుల మమ్ము బ్రోవు బాధలు దీరన్
    నవవిధ పూజలు సేతుము,
    నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్ !

    రిప్లయితొలగించండి
  7. మరో పూరణండీ :

    శివరాత్రియు నొక దినమే
    భవచయమును మాపగలదె పరతత్వమునున్
    శివరంజని రంజింపగ
    నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్

    రిప్లయితొలగించండి
  8. జవ విజయవాడ మెరుపుల
    భవ సప్తమి మొదలు దశమి బలి శమిగొట్టన్
    శివశ్రీ దుర్గా ప్రాభవ
    నవరా త్ర్యుత్సవ ము లమరె నాలుగు దినముల్.
    మనవి: జవ = వడి గల

    రిప్లయితొలగించండి
  9. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మంచి భావంతో పూరణ పంపారు. అభినందనలు.
    మూడవ పాదంలో "శివశ్రీ" అన్నప్పుడు యగణం అవుతున్నది. దానిని "శివసతి" అంటే సరిపోతుంది కదా.

    రిప్లయితొలగించండి
  10. మాష్టారూ, సవరణకి ధన్యవాదములు. శ్రీ శబ్దముతో ఇంకో పూరణ.

    సవరిలు కృష్ణా తీరము
    భవ ఇంద్రకిలాద్రి,దుర్గభర్గల నెలవున్
    భువనశ్రీ శ్రీమాతా
    నవరా త్ర్యుత్సవ ము లమరె నాలుగు దినముల్.

    రిప్లయితొలగించండి
  11. నవయుగమున లేక వ్యవధి
    భవనమునకు లేక నిధులు బంగాలందున్
    చవుకగ సరిపుచ్చు కొనుచు
    నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్

    రిప్లయితొలగించండి
  12. భవముగ పెండ్లపు బంధులు
    చవిగొని రాగా పదుగురు చందానగరిన్
    జవురుచు రూకలు నూకలు
    నవరాత్ర్యుత్సవములమరె నాలుగు దినముల్

    రిప్లయితొలగించండి