16, అక్టోబర్ 2010, శనివారం

ప్రహేళిక - 12

ఈయన ఎవరు?
ఆ.వె.
సారె, బిలము, విజయ, మీరసమ్మును, స్నేహ
మనఁగ త్ర్యక్షరమ్ము; లందు నడిమి
యక్షరములఁ జదువ నగు నొక్క పేరు వ్యా
కరణమును రచించి ఘనతఁ గనెను.

ఈయన ఎవరో చెప్పండి.

8 కామెంట్‌లు:

  1. సారె = పాచిక
    బిలము = కన్నము
    విజయము = జయము
    ఈరసము = అసూయ
    స్నేహము = కూరిమి

    చిన్నయసూరి

    రిప్లయితొలగించండి
  2. సారె__ బిలము-కన్నము, విజయ-జయము, మీరసము-? స్నేహము-కూరిమి -----చిన్నయసూరి
    అని తెలుస్తూంది సారె కు అర్థం తెలిసినా పదం 'చి' తో కుదరలేదు.
    మీరసమునకు అర్థం తెలీలేదు.

    రిప్లయితొలగించండి
  3. సారె = పాచిక
    బిలము = కన్నము
    విజయ=జయము
    మీరసము = ?సూ?(అక్షరాలూ కలవటం లేదు గానీ; సూ మధ్యనుండాలి.)
    స్నేహము = కూరిమి
    సమాధానం: చిన్నయసూరి

    రిప్లయితొలగించండి
  4. పాచిక ,కన్నము,జయము ,- సూ -,కూరిమి == చిన్నయ సూరి
    మాసురమ్ము ఏమిటో తెలియ లేదు.

    రిప్లయితొలగించండి
  5. సారె = పాచిక, బిలము = కన్నము, విజయము = జయము, ఈరసము = అసూయ,స్నేహము = ఒరిమ ( ఈ పదానికి నిఘంటు శోధన అవసరమయింది.అదృష్టంగా దొరికింది. )

    సమాధానము = చిన్నయసూరి

    రిప్లయితొలగించండి
  6. ??
    కన్నము
    జయము
    ??
    కూరిమి

    చిన్నయసూరి

    రిప్లయితొలగించండి
  7. " పాణిని, పాణినీయము. [ కాప వ్యాకరణము ,దీనినె " కలాప వ్యాకరణము అంటారు ]

    రిప్లయితొలగించండి