22, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 130

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో.

23 కామెంట్‌లు:

  1. గురువుగారూ మీ ప్రశంసలు నూతనోత్తేజాన్ని కలిగిస్తూ తెలుగు పద్యంపై మమకారాన్నినుమడింప జేస్తున్నాయి. కృతఙ్ఞతలు.
    వైవిధ్యభరితమైన ఆలోచనలు భావాలతో కూడిన తోటి కవిమిత్రుల పద్యాలు మరింత స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. కవివరుడై కపి వ్రాయడె
    భువిసుతపతి భూరిచరిత పొంగెడు భక్తిన్
    అవమానించుట కాదది
    కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో.

    రిప్లయితొలగించండి
  3. లంకాదహన సందర్భమున :

    చపల యగుఁ జిచ్చుకంటో,
    విపులమ్ముగ లంకఁ గాల్చె విమలుడు నగ్నో,
    తపనుండొ గాక హరియో
    కపివరుఁ గపితోడఁ బోల్చఁ గా మెచ్చిరహో !

    చపల = కోతి,చిచ్చుకంటి = ఈశ్వరుడు,తపనుడు= సూర్యుడు,
    కపి = విష్ణువు ,కోతి,హరి

    రిప్లయితొలగించండి
  4. అవివేకులు కొందరొక్క
    కవివరు కపితోడ బోల్చగా మెచ్చిరహో
    అవియివియనక మెసవుగా
    దె విటచరములరమరలవి దెలియవశంబే?

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    సమస్య "కపివరు కపితోడ" కాదు, "కవివరు కపితోడ". మరో పూరణను మీ నుండి ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  7. నారాయణ గారూ,
    బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. పాదాంతంలో బేసి గణంగా జగణం వచ్చింది.
    "అవివేకులు కొంద రొకట" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  8. కవిసమ్మేళనము నొకడ
    నవసరమైన పొలిటీషియను పోజిడగా
    కవియొక్కడు అది కనుగొని
    కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో.

    రిప్లయితొలగించండి
  9. భువనేశ్వరి మాట వినక
    జవుడున నాపాలుపెరుగు చక్కగ ద్రావన్
    కవియైన తెనాలి వికట
    కవివరుఁ గపితో డఁబోల్చఁ గామె చ్చిరహో.

    రిప్లయితొలగించండి
  10. భువనేశ్వరి మాట వినక
    జవుడున నాపాలుపెరుగు చక్కగ ద్రావన్
    కవియైన తెనాలి వికట
    కవివరుఁ గపితో డఁబోల్చఁ గామె చ్చిరహో.

    రిప్లయితొలగించండి
  11. 1 రవి గాంచని చోటుల నిల
    కవి గాంచును తన మనముతొ కవితలు సేయన్ ,
    కవి కొమ్మల గెంతి నపుడు,
    కవివరు కపితోడ బోల్చగా మెచ్చి రహో !

    2 . రవియు తన కిరణములతో,
    కవి తనపద చరణములతొ గంతులు వేయన్,
    యువసతి కోతని తిట్టెన్
    కవివరు కపితోడ బోల్చగా మెచ్చి రహో !

    రిప్లయితొలగించండి
  12. శ్రీ మిస్సన్న గారి పూరణలు అద్భుతంగా ఉంటున్నాయి
    .వారికి నమస్కారాలు ,అభినందనలు .

    రిప్లయితొలగించండి
  13. పి ,వి,లకు భేదము గలదని
    కవిసుతులకె తెలియకుండె కాజనులకుయున్
    కవితందు దీపి దెలియునె
    కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చిరహో

    జంటగ రెండద్దంబులు
    కంటికి కనుచూపు బెంచ గాంచెడి మనుజున్
    తుంటరి చతురాక్షనియెను
    కంటద్దము లెట్లు కళ్ళు కాగల విలయున్ ?

    అందుచేత కళ్ళద్దాలు క్రొత్తవి తెచ్చుకొంటాను. క్షమించండి. నా పూరణ :

    కవితెఱుగని కాపురుషులు
    కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చిరహో
    పవనసుతు డాత్మ నిలువ గు
    పవనముగ సుకవిత దిద్దె ప్రాజ్ఞులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  14. కవి కపికి కలద బేధము ?
    రవి గాంచని నెలవు లైన కవి గాంచినటుల్ !
    పవన సుత లంక గెంతగ
    కవివరు గపితోడ బోల్చ గా మెచ్చిరహో !

    రిప్లయితొలగించండి
  15. హరి గారూ,
    చంద్రశేఖర్ గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మీ అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. జంటగ పద్యములో చిన్న సవరణండీ

    తుంటరి 'చతురాక్షి 'యనియె

    రిప్లయితొలగించండి
  17. స్నేహితులు సరదాగా అన్న మాటలు...

    ఎవరవు ? హనుమవు నీవే!
    కవివర నీ పేరు జూడ కపి వరుడే! వి
    ప్రవరా ! యని నేస్తంబులు
    కవివరు గపితోడ బోల్చ గా మెచ్చిరహో!

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    హాస్యస్ఫోరకంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. చవిగొని పదవన మందున
    నవరసముల గ్రోల నేర్చి నటనమ్మాడే
    పవనసుతుని వోలె నలరు
    కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నటనమ్మాడే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ "నటియిచెడి యా" అందామా?

      తొలగించండి
  20. తివురున ఛందము నెక్కుచు
    చివరల కొమ్మలను త్రుంచి శృంగారమునన్
    చవిగొన పద్యపు పండును
    కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో

    రిప్లయితొలగించండి


  21. చవులూరెడు విధములు తా
    కవనమ్మును బీకు నతడు కన్పడ నేదై
    న వరుస పదమ్ములని నా
    కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో!


    జిలేబి

    రిప్లయితొలగించండి