29, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 137

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.

17 కామెంట్‌లు:

  1. కలికాలపు దాపున రో-
    కలిగొని యాదవులు వీధిఁ కలహములాడన్
    వెలివచ్చి చూసి, నిలుపక
    బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.
    ('సీత'= సారాయి, మద్యము)
    (యాదవ వంశ నాశనం జరుగుతున్నప్పుడు బలరామదేవుడు ఏంచేస్తున్నాడో తెలియదు.. కోపం తెచ్చుకొని, గొడవలను ఆపవలసిన సమయంలో ఆ నాయకుడే మద్యాన్ని చూసి నవ్వాడన్నది నా ఊహ..విలువలు క్షీణించటానికి ప్రతీక.)

    రిప్లయితొలగించండి
  2. తుల నాడిన వాడిని గని,
    తల నంటెను చెప్పు తోడ తలవాయ,భద్రా
    చలమున నవమిన నేటిస
    బల!రాముడు సీత జూసి ఫక్కున నవ్వెన్!

    రిప్లయితొలగించండి
  3. "హలమా! వ్యవసాయముకై
    పొలమును దున్నకను, నాదు భుజమున తిరమై
    నిలచితివేమ"ను తలపున
    బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  4. నారాయణ గారూ,
    సీత శబ్దానికి ఉన్న నానార్థాలను చక్కగా వినియోగించుకొని సమస్య పూరించారు. బాగుంది. అభినందనలు.
    "వీథి"తరువాత అరసున్నా పెట్టారు కనుక "కలహము" గలహము అవుతుంది కదా.

    రిప్లయితొలగించండి
  5. మంద పీతాంబర్ గారూ,
    చక్కని చమత్కారంతో సమస్యను పూరించారు. అభినందనలు.
    "తలవాయ భద్రా" అన్న చోట గణదోషం ఉంది. దానిని "తడయక భద్రా" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  6. రవి గారూ,
    పద్యం ధారాశుద్ధితో బాగుంది. అభినందనలు.
    మీరు "సీత" శబ్దనికి హల మనే అర్థాన్ని తీసుకున్నారా? ఆ శబ్దానికి "నాగటి చాలు" అనే అర్థం ఉంది. నాగలి అనే అర్థం లేదు.

    రిప్లయితొలగించండి
  7. నమస్కారమండీ, నా పూరణ :

    ఇలలోన నొక్క సతి యని
    వెలయంగా వ్రతము సలుపు విభుఁడును బిదపన్
    పలుమాఱు పెండ్లి యాడఁగ
    బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి
  8. కలియుగ మునపలు సీతలు
    వెలయంగా వేచి రంత విభవము తోడన్
    కలవర పడికలలు గనిన
    బలరాముడు సీత జూచి ఫక్కున నవ్వెన్ !

    రిప్లయితొలగించండి
  9. తలచుచు మది గాధేయుడు,
    బల యతిబల విద్యల గొన్న భరతాగ్రజుడే
    వలపుల నిన్నుగెలుచు నీ
    బల రాముఁడు, సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  10. విలవిల లాడుచు రక్కసి
    విలపించుచు పారిపోవ విచలిత యయ్యెన్
    యిలసుత! మ్రాన్పడి పోయె న-
    బల! రాముడు సీత జూచి ఫక్కున నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పద్యం నిర్దోషంగా ఉంది. అభినందనలు.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    "విద్యల్ గొన్న" అన్నచోట గణదోషం ఉంది. "విద్యల గొని/విద్యల గొను" అంటే సరిపోతుంది.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ అద్భుతం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. అల - రావణ వధ పిమ్మట
    చలద్విమానాధిరోహ సంభ్రమమున మి
    న్నుల - కపి కోలాహలము ప్ర
    బల, రాముడు సీత జూచి ఫక్కున నవ్వెన్!

    రిప్లయితొలగించండి
  13. అల కృష్ణు కన్న యెవ్వరు ?
    కల ఫలితము నెవరి జూచి కదిపెను త్రిజటే ?
    చెలి చక్కలి గిలి కేమనె ?
    బలరాముడు - సీతజూచి - ఫక్కున నవ్వెన్ !

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ప్రశ్నోత్తర రూప పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. నలుబది లక్షల కోతుల
    గలగల కిచకిచల నామె కలవర పడగా
    వలపులు మీరంగ మహా
    బల రాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి
  16. కొలనుకు గట్టున కూర్చొని
    కలవరపడ జానకమ్మ కప్ప దుముకగన్
    జలమున పడి నీదెడి బహు
    బల రాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి