19, అక్టోబర్ 2010, మంగళవారం

ప్రహేళిక - 14

ఊరి పేరేది?
ఆ.వె.
క్షితి, నెలతుక, మత్తు, కీటకమ్ము, సొరిది,
మోము మూడు వర్ణముల పదములు;
మొదటి యక్షరములఁ జదివినఁ దెలిసెడి
యూరి పేరుఁ జెప్పువార లెవరు?

ఆ ఊరి పేరు చెప్పండి.

12 కామెంట్‌లు:

  1. అవని,నందన,తన్మయం,పురుగు,రమణ,ముఖము
    అనంతపురము. సొరిది= రమణ= విధము అనుకొంటున్నాను

    రిప్లయితొలగించండి
  2. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ సమాధానంలో 2వ, 3వ అక్షరాలు తప్పు. అది అనంతపురము కాదు.

    రిప్లయితొలగించండి
  3. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    మీ సమాధానం కరెక్ట్. అభినందనలు.
    సమాధానంలోని ఒక్కొక్క అక్షరరం ఎలా వచ్చాయో చెపితే బాగుండేది.

    రిప్లయితొలగించండి
  4. క్షితి = అవని, నెలతుక = మహిళ, మత్తు = లాహిరి, కీటకము = పురుగు, సౌరిది = రహి, మోము = ముఖము. = అమలాపురము.

    రిప్లయితొలగించండి
  5. అవని ,మగువ ,లాహిరి ,పురుగు ,ర - - ,ముఖము = అమలా పురము

    రిప్లయితొలగించండి
  6. మరో ప్రయత్నము

    అవని,లతాన్వి,కయిపు,పురుగు,రమణ,ముఖము = అలకపురము ( కుబేరును పట్టణము )

    రిప్లయితొలగించండి
  7. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మళ్ళీ పప్పులో కాలేసారు.

    రిప్లయితొలగించండి
  8. షేక్ రహ్మానుద్దిన్ గారూ,
    "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.
    మీ సమాధానం కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మా వూరికి ( విశాఖపట్నం )కి ప్రక్కనే వున్న అమలాపురం వదలి కయిపులో ఊహాత్మకమైన అలకపురంకి వెళ్తే పప్పులో కాలెయ్యకుండా ఎలా వుంటాము మాస్టారూ ? బాగుంది. అందరికీ అభి నందనలు.

    రిప్లయితొలగించండి