27, అక్టోబర్ 2010, బుధవారం

ప్రహేళిక - 18

ఈ నవల పేరేమిటి?
సీ.
బలవంతు నెదిరించు బలహీనుఁ డేమి గను?
విఘ్నములఁ దొలగించు వేలు పెవఁడు?
గుణ వాచకంబుగఁ గొనెడి శబ్దం బేది?
గోటి గిల్లుడు కెట్టి గుర్తు గలదు?
సరసిలో జన్మించు విరిని యేమందురు?
పంజాబునకు నేది ప్రాత పేరు?
తొలిసారి యిరువురి యెఱుక నేమందురు?
సంతానము నొసంగు సత్త్ర మేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ నైదేసి యక్షరమ్ము
లందు వరుసగా రెండవ యక్షరములఁ
జదువఁ దెలుఁగులో వచ్చిన మొదటి నవల
యనిన కీర్తి పొందిన గ్రంథమై యెసంగు.
ఆ గ్రంథం పేరేమిటి?

16 కామెంట్‌లు:

  1. పరాజయం, గజవదను(అజసుతుడు ),విశేషణము,నఖక్షతము,సరసిజము,పాంచలము,పరిచయము,పుత్రకామేష్టి

    రాజశేఖర చరిత్ర

    రిప్లయితొలగించండి
  2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంబుధవారం, అక్టోబర్ 27, 2010 8:55:00 AM

    పరాజితుడు, గజముఖుడు, విశేషణము, నఖక్షతము, సరసిజము, పంచనదము, పరిచయము, త్రం
    రాజశేఖరచరిత్రం - తెలుగు లో మొదటి నవల

    గురువు గారూ,
    చివరి పదం తెలియలేదు. సత్త్రం (శస్త్ర చికిత్స) అంటే ఆపరేషన్ అనో, కామధేనువు లాంటి దైవిక అంశయో తెలియలేదు.

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  3. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    స్థూలంగా మీ సమాధానం సరైనదే. అభినందనలు.
    కాని 2వ, 4వ పదాలను సరి చేయాలి.

    రిప్లయితొలగించండి
  4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    మీ సమాధానం సరైనదే. అభినందనలు.
    చివరి పదం దశరథుడు పుత్ర సంతానాన్ని కామించి ఇష్టంతో చేసిన యాగం.

    రిప్లయితొలగించండి
  5. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ సమాధానం కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పరాజయము,గజముఖుడు,విశేషణము,నఖ క్షతము,నీరజాతము,పంచనదము(ఐదునదులు)పరిచయము ,పుత్రకామేష్టి= రాజ శేఖర చరిత్ర.

    రిప్లయితొలగించండి
  7. మంద పీతాంబర్ గారూ,
    మీ సమాధానం 100% కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పరాజయము; గజముఖుడు; విశేషణము; నఖక్షతము; సరసిజము;
    పంచనదము; పరిచయము; పుత్రకామేష్టి;

    సమాధానము: రాజశేఖర చరిత్ర

    రిప్లయితొలగించండి
  9. " 1.పరాజితుడు.2.గజవదన .3.విశేషమైన 4.నఖపు గుర్తు.5.సరసిజము.6.పంచనదము.7.పరిచయము
    .8.పుత్ర కామేష్టి.= " రాజశేఖర చరిత్ర "

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గారు నమస్కారం .
    మీరు ప్రహేళిక పద్యాలను అలవోకగా,అతిసునాయసంగా
    వ్రాస్తున్న తీరు అద్వితీయం .ఇన్ని రోజులు పదాలకు
    సమాధానాలు వెదకడంలోనే దృష్టి పెట్టడం జరిగింది కాని
    పద్య సౌందర్యాన్ని ఆస్వాదించడం జరుగలేదు. మీకు అభినందనలు.
    నేటి పద్యంలో "పంజాబునకునేది ప్రాత పేరు"అని అన్నారు . పాత పేరు అంటే సరి పోదా
    నా సందేహాన్ని తీర్చ గలరు .

    రిప్లయితొలగించండి
  11. పరాజయము
    గజముఖుడు
    విశేషణము
    నఖక్షతము
    సరసిజము
    పంచనదము
    పరిచయము
    పుత్రకామేష్టి

    రాజశేఖరచరిత్ర

    రిప్లయితొలగించండి
  12. విఘ్నములు తొలగించు వేల్పుడుకి గజకర్ణుడు లేక గజవక్త్రుడు,

    గోరుగిల్లుడుకి నఖక్షతము కాని పక్షములో నఖరేఖలు నా సమాధానాలు. యింకా పప్పులో కాలుంటే మీ సమాధానంతో బయటకు తీసుకొంటాను. నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  13. చంద్రశేఖర్ గారూ,
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    మీ సమాధానాలు సరి యైనవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మంద పీతాంబర్ గారూ,
    పాత కొత్తలు జన వ్యవహరంలో ఉన్నా అవి నిజానికి తప్పులే. ప్రాత, క్రొత్తలే సరైనవి.

    రిప్లయితొలగించండి